Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
1000 abaddala Teja

ఈ సంచికలో >> సినిమా >>

పవన్‌ షర్ట్‌ విప్పుతాడట

‘గబ్బర్‌సింగ్‌`2’ సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనుంది. ‘గోపాల గోపాల’ సినిమాతోపాటుగా, ‘గబ్బర్‌సింగ్‌`2’ సినిమా కూడా చేయాలనే కసితో వున్నాడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. పోలీస్‌ గెటప్‌ కదా, పెర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌ అయితే బావుంటుందన్న ఆలోచనతో ఎక్కువ టైమ్‌ జిమ్‌లోనే పవన్‌ గడుపుతున్నట్లు సమాచారమ్‌.

పవన్‌ ఫిజిక్‌ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా వుంటాడు. అయితే రాజకీయాల్లోకి రావడంతో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై కాస్త దృష్టి తగ్గించాడు. మళ్ళీ సినిమాల్లో బిజీ అవడంతో, తన పూర్వపు శరీరాకృతిని పొందేందుకు, అది కూడా కండలు తిరిగిన శరీరంలా తన శరీరాన్ని మలచుకునేందుకు పవన్‌ కసరత్తులు చేస్తున్నాడట. మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యమున్న పవన్‌, వాటి సాధనలో కూడా తలమునకలై వున్నాడట.

సంపత్‌ నంది దర్శకత్వంలో ‘గబ్బర్‌సింగ్‌`2’ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన ‘దబాంగ్‌’ రీమేక్‌ అయిన ‘గబ్బర్‌సింగ్‌’ పెద్ద విజయం సాధించగా, దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘గబ్బర్‌సింగ్‌`2’పై ఖచ్చితంగా ‘ఇండస్ట్రీ హిట్‌’ అనే అంచనాలుంటాయి. దానికి తగ్గట్టుగానే సినిమాపై పవన్‌ చాలా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాడట. ‘రచ్చ’ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న సంపత్‌ నంది కూడా ఈ సినిమాని ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
movie review