Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
prabhas bolly wood entry

ఈ సంచికలో >> కథలు >> నిక్కీ గర్లానీకి బిగ్‌ ఆఫర్‌

'కృష్టాష్టమి' సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది నిక్కీ గల్రాని. సంజన చెల్లెలిగా కొంచెం బొద్దైన అందంతో ఈ ముద్దుగుమ్మ బాగా అట్రాక్ట్‌ చేస్తోంది. తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ఇప్పటికే 15 సినిమాలకు పైగా నటించిన ఈ భామ 'కృష్టాష్టమి' సినిమాతో తెలుగులో కూడా తన అదృష్టం పరీక్షించుకోనుంది. తొలి సినిమాతోనే ఫుల్‌ గ్లామర్‌తో యూత్‌ను బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. నిజానికి ఈ ముద్దుగుమ్మకి గ్లామర్‌ షో చేయడం అస్సలు ఇష్టం ఉండదట. నటనకు స్కోప్‌ ఉన్న క్యారెక్టర్స్‌ చేయడమే ఇష్టమంటోంది.

కానీ క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే ఎలా నటించడానికైనా నో చెప్పనంటోంది నిక్కీ. కథల ఎంపిక విషయంలో తన అక్క సలహా తీసుకుంటానంటోంది. ఆమెకి తన అక్కంటే చాలా ఇష్టమంటోంది. అక్కే తనకు రోల్‌ మోడల్‌ అని నిక్కీ గల్రాని చెప్పింది. తను నటించిన 'కృష్ణాష్టమి', మలుపు' సినిమాలు రెండూ ఒకేసారి విడుదల అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానంటోంది ముద్దుగుమ్మ నిక్కీ. అంతేకాదు అమ్మడు, ఒక పెద్ద హీరో సరసన హీరోయిన్‌గా అవకాశం కొట్టేసినట్లు సమాచారం. ఓ ప్రముఖ హీరోతో ఛాన్స్‌ కన్‌ఫర్మ్‌ అయినా ఆ వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాఇaల్స ఉంది. నటనతోపాటు, డాన్సుల్లో కూడా మాంచి జోష్‌ కనబరుస్తున్న ఈ భామ అవకాశమొస్తే త్వరలోనే తెలుగులో టాప్‌ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయేలా ఉంది ఈ ముద్దుగుమ్మ నిక్కీ. 

మరిన్ని కథలు
srinivas the solider