Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
vichitrala vamshi

ఈ సంచికలో >> సినిమా >>

వెయ్యబద్ధాల తేజ

1000 abaddala Teja

'వెయ్యబధ్దాలు సినిమా షూటింగ్ సెట్లో దర్శకుడు తేజను ఇటీవల గోతెలుగు.కాం కలిసింది. ఈ సందర్భంగా 'నిజం ఫ్లాప్ అయినందుకు వెయ్యబధ్ధాల మీద పడారా?" అని సరదాగా అడిగితే దానికి సమాధానంగా తేజ. "నిజం ఫ్లాప్ అన్నది మీడియా సృష్టి. నిజం చెప్పినా అబధ్ధం ఆడుతున్నాడు అంటారని ఆ అబధ్ధాన్ని నిజమని ఒప్పేసుకున్నా. దాని వల్ల నాకు కొన్ని లాభాలు కలిగాయి. ఫ్లాప్ అని ప్రచారం జరిగింది కనుక ఏ ఇంకం టాక్స్ ఆఫీసరు నా వైపు చూడలేదు. నిజం వల్ల వచ్చిన లాభాలతో నేను వైజాగ్ లో ఒక సినిమా హాలు కొనగలిగాను", అన్నారు.

"నిజం వెనుక నిజం బానే ఉంది. వెయ్యబధ్ధాల కబుర్లు ఎమిట"ని అడిగితే...
"ఇది కామెడీ ప్రధాన చిత్రం. అలాగే కొన్ని సమకాలీన అంశాలు కూడా పెట్టాను. ఆ మధ్య పెద్ద హోదాలో ఉన్న ఒక ముసలాయన అమ్మయిలతో జరిపిన వ్యవహారం పెద్ద రభస అయ్యింది..ఆ వ్యవహారాన్ని ఇందులో ప్రస్తావించాం..." అని చెబుతూండగా 'సార్ షాట్ రెడీ అని అసోసియేట్ పిలవడంతో..తేజ 'ఎక్స్ క్యూజ్ మీ' అంటూ అటు వెళ్ళారు..

తర్వాత షాట్ పూర్తయ్యాక బాపు గారు గీసిన గోతెలుగు తొలి సంచిక ముఖచిత్రం చూపిస్తే దానిని తన్మయంతో ఒక పది సెకన్లు చూసి, "ఆ రాముడి ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ చూడండి..ఇది బాపు గారే గీయగలరు". అన్నారు..

గతంలో బాపు గారు తన మీద ఒక కార్టూన్ గీసిన ముచ్చట కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు: "బాపు గారు నా గురించి ఒక కార్టూన్ గీసారు. తండ్రి కొడుకుని చివాట్లు పెడుతూ 'ఒరేయ్! నువ్వు ఎందుకు పనికి రాకుండా తగలడ్డావ్. ఆ తేజ దగరికన్నా వెళ్ళు. నిన్ను హీరో గా పెట్టి సినిమా తీస్తాడు", అని అంటాడు..చాలా నవ్వుకున్నాను".

మరిన్ని సినిమా కబుర్లు