Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
srinivas the solider

ఈ సంచికలో >> కథలు >> ఒక చెరువు ఆత్మ కథ

నా పేరు "కాలువ కుంట"... నేను ఉండేది నగరానికి ఒక 150-200 కి మి దూరం లో "కాలువరాళ్ళ" అనే గ్రామం సరిహద్దులో, అసలు నా వల్లే ఆ గ్రామనికి "కాలువ రాళ్ళ" అని పేరు వచ్చిందని అంటారు. నా వయసు ఎంతో నాకు సరిగ్గ తెలియదు కాని నేను ఆ ఊరి "సంస్థానం" "రాజా" వారిని, "తెల్ల దొరలను" చూసినట్టు గుర్తు .. అంటే ఒక 200-300 ఏళ్ళ నుండి నా "ఉనికి" ఉందన్నమాట. 

నన్ను ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా "చిన్న చెరువు" అని కూడ అంటారు ఎందుకంటే నా ప్రయాణం ఒక చిన్న "పిల్ల కాలువ" లాగ మొదలై మంచి వర్షాలు పడి కాల క్రమేణ ఒక "చెరువు" లాగ రూపాంతరం చెంది ఒక పది పదిహేను గ్రామలను కలుపుకుంటు పోయి "కృష్ణా" నది లో ముగుస్తుండేది.

నాలో పుష్కలంగ "జలసిరి" ఉండటం వల్ల నేను పారిన గ్రామాల పంట పొలాలు  ఎప్పుడూ పచ్చగా ఉండేవి. ఆయా గ్రామాల ప్రజలు "ధన ధాన్యాలతో", "సుఖ సంతోషాలతో","ఆయురారోగ్యాలతో" విలసిల్లుతూ ఉండేవారు...ఎవరైనా వయసు అయ్యి "కాల ధర్మం" చెందేవారే తప్ప ఎటువంటి "శారీరిక" ఇబ్బందులతో,రోగాలతో ఉండేవారు చాల తక్కువ. ఆ ఊళ్ళన్నింటికి ఒక్క ఆసుపత్రి కూడ ఉండేదికాదంటే అర్థం చేసుకోవచ్చు..దాదాపు ప్రతి ఇంట్లొ సమ్రుద్ది గా పాడి ఉండేది. 

నాకు ప్రత్యేకించి  "కాలువరాళ్ళ" అంటే ఎక్కువ అభిమానం ఎందుకంటే నా ప్రయాణం మొదలైంది అక్కడినుండే...ఆ ఊరు పచ్చని చెట్ల తో,చిన్న చిన్న వాగులతో,సెలయేళ్ళతో, రక రకాల పక్షులకు నివాస యోగ్యమై ఉండేది.ఏండా కాలం వచ్చిందంటే పిల్లలు,పెద్దలు అందరు నాలో ఈతలు కొట్టి,సంతోషంగా వాళ్ళ ఇండ్లల్లకి వెళ్ళే వారు. వర్షాలు పడకున్నా నేను మాత్రం ఎప్పుడూ ఎండిపోయేదాన్ని కాదు.."కరువు" అనే మాట "కాలువరాళ్ళ" ప్రజలకి తెలియదు...ఇలా కొన్ని ఏళ్ళు గడిచినాయి...

మనుషుల తో పాటు కాలం లో కూడ మార్పు గమనించసాగినాను."అభివృధి" పేరుతో ఆ గ్రామనికి దగ్గరలో ఒక "ఫాక్టరి" వెలిసింది..దాని కోసం లెక్క లేనన్ని "చెట్లని"  కొట్టేసి,వాగులని పూడ్చి వారికి తగ్గట్టుగా "మార్గం"  చేసుకున్నారు..ఆ గ్రామ ప్రజలు కూడ ఆ "అభివృద్ధి" మాయ లో పడి వారి భూములని కూడ ఆ "ఫాక్టరి" వారికి  అమ్ముకోవటమే కాకుండా వారు, వారి పిల్లలు అక్కడే పనికి కుదిరి "నెల జీతానికి" అలవాటు పడి "చేతి వృత్తులని","వ్యవసాయాన్ని" పక్కన పెట్టినారు..కొన్నాళ్ళకి ఆ "ఫాక్టరి" నుండి వచ్చే "వ్యర్ధాలు" సెలయేళ్ళలో కలిసి కలుషితం అయినాయి.."పొగ" ఆ చుట్టుపక్కన ఉన్న వాతావరణాన్ని పాడు చేసింది..అక్కడికి ఇప్పుడు "పక్షులు" రావటం లేదు, చెట్లు ఎండిపోసాగాయి..సెలయేళ్ళలో ఇప్పుడు నీటి చుక్క లేదు.. ఆ వ్యర్ధాలు నాలో కూడా కలిసి నన్ను కూడా కలుషితం చేయసాగాయి..నాలో ప్రవహిస్తున్న నీటిని  తాగి పశువుల "పాడి" తగ్గిపోయింది, ఆ ప్రజలకి కొత్త రోగాలు , జ్వరాలు పీడించసాగాయి..ఇప్పుడు అక్కడికి దగ్గరలో ఒక "ఆసుపత్రి" కూడ వెలిసింది. 

ఒక్కొక్క ఏడు "వర్షపాతం" తగ్గిపోయి మెల్లి మెల్లిగా నాలో కూడా "జల" తగ్గిపోయింది...ఇప్పుడు "నాతో" పాటు "కాలువరాళ్ళ"  గ్రామం కూడా "కళ" తప్పింది..నాలో  కాలువ పోయి "కుంట" మిగిలింది.."కాలువరాళ్ళ" లో "పచ్చదనం", "ధనధాన్యాలు" అన్ని పోయి "రాళ్ళు" బయట పడ్డాయి.."వర్షాల" కోసం ఎదురు చూస్తున్నారు..కాని వారికి ఏం తెలుసు "విధ్వంసం" ఎంత తొందరగా చెయ్యొచ్చో "సృష్టించటం" అంతకు వంద రెట్లు కష్టమని..

ఆ గ్రామ ప్రజలకి ఇప్పుడు అర్ధం అయ్యింది వారు ఏం "పోగొట్టుకున్నారో"..... మెల్లిగా అందరూ "కలిసి కట్టు" గా నడుం బిగించి "నాలో" మళ్ళీ "జీవం" పోయటానికి "పూడికలు" తీస్తున్నారు.."ఫాక్టరి"  వారితో అందరూ "ఏకమై" మాట్లాడి, దగ్గరలోని "టౌన్" కి మార్చుకున్నారు.అక్కడ మళ్ళీ "మొక్కలు" నాటుకున్నారు...ఎవరి వృత్తులు వారు చేసుకుంటున్నారు..

నేను పూర్వం లా పారటానికి, ఆ గ్రామం లోని సెలయేళ్ళు,వాగులు,పచ్చిక,చెట్లు ఇవన్ని "పూర్వ రూపానికి" రావటానికి కొంత సమయం పట్టొచ్చు , కాని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే అందరి "ధృడ చిత్తం" తో ఒక "నాంది" పడింది..ఈ "ఐకమత్యం" అందరి లో వచ్చి అన్ని గ్రామాలు ఇలానే "ముందడుగు" వేస్తే ప్రతి గ్రామం "సస్యశ్యామలం" అవుతుంది.. 

ఫలితంగా ఈ దేశం "రైతు భారతం" గా మారటానికి ఎక్కువ కాలం పట్టదని ఆశిస్తూ....

మీ "కాలువ కుంట"

మరిన్ని కథలు
megastar  150th movie shooting speed up