Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
oka cheruvu aatmakatha

ఈ సంచికలో >> కథలు >> యాక్షన్‌లోకి దిగిన మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరిగాయి. ప్రస్తుతం హైద్రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిరంజీవి మీద యాక్షన్‌ సన్నివేశాలు షూట్‌ చేస్తున్నారు. రామ్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఈ యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కుతున్నాయి. సినిమాకే ఈ ఫైట్‌ సీన్‌ హైలైట్‌ కానున్నాయట. హీరోకి, విలన్‌కి మధ్య జరిగే ఈ ఫైట్‌ విజువల్‌గా అదరహో అనేలా తెరకెక్కిస్తున్నారు.

యాక్షన్‌ సీన్స్‌లో మెగాస్టార్‌ చిరంజీవి చాలా ఈజ్‌తో కనిపిస్తారు. దాదాపు 8 ఏళ్ళ విరామం తర్వాత హీరోగా నటిస్తున్న చిరంజీవి గతంలో ఉన్న జోష్‌ని అలాగే కొనసాగిస్తుండడం చిత్ర యూనిట్‌ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. చాలాకాలం తరువాత తమ అభిమాన హీరో అలా తెరపై యాక్షన్‌ సీన్స్‌లో చూసేందుకు ఎదురు చూస్తోన్న అభిమానుల అంచనాలను అందుకునేలా ఈ ఫైట్‌ ఉండబోతోందట. చిరంజీవి కోసం రామ్‌లక్ష్మణ్‌లు చాలా డిఫరెంట్‌గా ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ని కంపోజ్‌ చేసినట్లు తెలియవస్తోంది. ఇదిలా ఉండగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు. 'కత్తిలాంటోడు' అనే వర్కింగ్‌ టైటిల్‌తో నడుస్తున్న ఈ సినిమాకి ఫైనల్‌ టైటిల్‌ని కూడా ఆ రోజే అనౌన్స్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి మ్యూజక్‌ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన మ్యూజిక్‌ అందించనున్నారు. 

మరిన్ని కథలు
How to increase height? Ayurvedic tips to grow taller in Telugu by Dr. Murali Manohar, M.D.