Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
b.jaya directing vaishakam movie

ఈ సంచికలో >> సినిమా >>

'లక్కున్నోడు' వచ్చేస్తున్నాడు

'గీతాంజలి' వంటి హారర్‌ కామెడీ చిత్రంతో సక్సెస్‌ అయిన డైరెక్టర్‌ రాజ్‌కిరణ్‌. ఇప్పుడు మంచు విష్ణుతో 'లక్కున్నోడు' సినిమా తెరకెక్కిస్తున్నాడు. మాస్‌ మెచ్చే సినిమాగా, మాంచి యాక్షన్‌ సీన్స్‌ని మేళవించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు విష్ణు. విష్ణుకి ఈ సినిమా కొత్త సంవత్సరంలో మంచి విజయం తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు అంతా. అలాగే ఈ సినిమాలో ముద్దుగుమ్మ హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది.

హన్సిక, మంచు విష్ణుది బెస్ట్‌ పెయిర్‌ అంతేకాదు హిట్‌ పెయిర్‌ కూడా. గతంలో వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. కావాలని హన్సికని ఏరి కోరి ఈ సినిమా కోసం తెచ్చుకున్నాడు మంచు విష్ణు. ఈ మధ్య హన్సిక తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మళ్లీ మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్‌ ఉంది. ఇకపోతే సినిమా ట్రైలర్‌ ఇటీవలే విడుదలయ్యింది. మంచి రెస్పాన్స్‌ అందుకుటోంది. అంతేకాదు అచ్చు, ప్రవీణ్‌ లక్కరాజు మ్యూజిక్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలోని పాటలు కూడా చాలా బాగున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో విష్ణు చేసిన కామెడీ 'ఢీ' సినిమాని తలపించనుందట. విష్ణు కెరీర్‌లో 'ఢీ' సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ సినిమా తరహాలోనే ఈ సినిమాకి టాక్‌ బాగా వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వచ్చే నెల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
guntoorudu movie launch by manchu mohan babu