Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
yureka

ఈ సంచికలో >> కథలు >> నిరంతరం

nirantharam

 ఆమె చల్లని వెన్నెలలా  ప్రకాశించింది...తను జీవించి వున్నందుకు గుర్తుగా ఆమె శ్వాసించడమే కాదు ..ఆమె పాదాలు నాట్యం కూడా  చేసాయి విచిత్రమేమంటే ఆమె మరణించే వరకు ఎవరికీ ....చివరకి కన్న కూతురికి కూడా ఆమెకు కాన్సర్ వుందని తెలియదు .ఆమెకు  కాన్సర్ ఎప్పుడు మొదలయిందో ... ఎప్పుడు దాన్ని ఆమె గుర్తించారో ...ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకున్నారో ,  వాళ్ళు ఏమి చెప్పారో ....ఎందుకు వైద్యం తీసుకోలేదో ఎవరికీ తెలియ లేదు.

 
పేద, మురికి వాడలో బడి పెట్టబోతున్న ఓ సామాజిక కార్యకర్త కు సహాయంగా ఒక నాట్య ప్రదర్శన ఇస్తూ ...ప్రదర్శన ముగింపు దశలో ఆమె తడబడిందని...అది గమనించిన గాయని వెంటనే పాట ఆపడంతో అవాక్కయిన ఆమె నెమ్మదిగా నాట్య భంగిమ నుండి అతి నెమ్మదిగా నేలపై రాలుతున్న తారలా  వాలిపోయిందని ...కోమాలోకి వెళ్ళిన ఆమెను డాక్టర్లు బ్రతికించలేక పోయారని, అయితే రక్త పరీక్షలో నే ఆమెకు కాన్సర్ వున్నట్లు గ్రహించిన వాళ్ళు ఆశ్చర్యానికి లోనయినట్లు తెలిసింది. ఒక్కగానొక్క కూతుర్నిదూరంగా చదివిస్తూ ఎప్పుడూ నాట్య ప్రదర్శనలు ఇస్తూ..ఒంటరిగా జీవించే ఆమె జీవితం ఒక మిస్టరీగా ముగిసింది. 
 
ఆమె అభిమానిగా ..అరాధకురాలిగా నేను మాత్రం ఆమె జీవితాన్ని తెలుసుకో దలిచాను...ఆమె మరణానికి ..ఆమె తన అనారోగ్యాన్ని దాచడానికి  ఇంకా తను జీవించే అవకాశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయక పోవడం గురించి కాదు నా ఆసక్తి... అది ఎలా ఆమెకు సాధ్యమయిందో తెలుసుకోవాలనిపించింది ...అంతటి సంయమనం, అంతటి నిభాయింపు, నిగ్రహం, మరణం పట్ల నిర్భయం, మమతల పట్ల నిర్లిప్తత,ఎలా సాధ్యమయిందో తెలుసుకోవాలనిపించింది .... ఆమె అంజలి! ఆమె మహా ప్రస్థానంతో ... నా ప్రస్థానం  మొదలైంది.        
 
అంజలి  గారి కూతురు  యామినిని  కలవడానికి  వెళ్లాను. అంజలిగారిని చివరి గా  నేను చూడలేదు. మా పరిచయం అయిన నాటి నుండి ఆమె ఒక్క నాట్య ప్రదర్శన కూడా నేను చూడకుండా వుండలేదు...కానీ ఆ రోజు  దృవ్ కు చాలా బాగాలేదు. ఆస్తమా చాలా తీవ్రంగా ఉండింది ...వాడ్ని చూస్తుంటే ...ఏ నిముషంలో ప్రాణాలు పోతాయేమో అనిపించింది..తరువాత వాడికి ఆరోగ్యం కొంచం మెరుగైనా, వాడ్ని వదిలి ప్రయాణం చేయడానికి సాహసించ లేకపోయాను. అలా అంజలి గారి ఆఖరి నాట్య ప్రదర్శన చూడలేక పోయాను. ఆమె ఆఖరి ప్రయాణం కూడా చూడలేకపోయాను. అయినా  నేను  ఆమెను అలా నిర్జీవంగా చూడలేను...  నిరంతరం  జాలువారే  జలపాతం లాంటి ఆమెను నిశ్చలంగా చూడగలనా?
 
"ఇదెలా జరిగింది ...యామిని? కనీసం నీ దగ్గర కూడా  దాచారంటే ..నేను నమ్మ లేక పోతున్నా..అసలు అమ్మకు తెలియదా తనకా జబ్బు వున్నట్లు ..మొదటే కనుక్కుని వుంటే అమ్మను కాపాడుకునే వాళ్ళం కదా! "
 
"లేదక్కా నాకేమి చెప్పలేదు .. కొంచం బరువు  తగ్గినట్లు అనిపిస్తే అడిగాను ...కొంచం బరువు తగ్గాలి ....  అంది .  కొన్ని సింప్టంస్ తెలుస్తాయి ..ఎందుకో మరి తెలియ లేదు....నేను డాక్టర్ గా వుండి తెలుసుకోలేకపోవడం ..ఎందుకో..బాధగా వుందక్కా .."యామిని దుఃఖంతో మాట్లాడ లేక పోయింది.
ఏమిచెప్పి ఓదార్చా లో  అర్థం కాక మౌనంగా వుండిపోయా .
 
"అక్కా అమ్మకు బాల కృష్ణ  అనే చిన్న నాటి స్నేహితుడున్నాడు ..అమ్మ చనిపోయినప్పుడు ఆన్ని చేసింది బాలు అంకులే ..ఆయనకు తెలిసి వుంటుంది..అమ్మకు అంకుల్ కు మధ్య  రహస్యాలు వుండవు  ......! నువ్వు తెలుసక్కా అంకుల్ కు. అడిగారు కూడా  ఆ రోజు .. మీ అమ్మకు చాలా ఇష్టం కదా మైత్రి అంటే  అన్నారు ..కానీ మీ ఇంటికి కాల్ చేస్తే బాబుకు బాగాలేక హాస్పిటల్ లో వున్నారని చెప్పారు, పేపర్లో, టీవీలో చూస్తారులే అనుకున్నా !అదే జరిగింది ".
 
"నేను  బాల కృష్ణ  గారిని కలుస్తాను యామిని .."
 
"ఖచ్చితంగా కలవండి.. నేను ఇంక హైదరాబాదు రాలేను .. మీరే రావాలి నా దగ్గరకు "కన్నీళ్లు తుడుచుకుంటూ అంది యామిని.
 
"నేనున్నాను...యామిని  నీకు .. అలా అనకు నేను వస్తానులే" 
బాలు  గారి అడ్రెస్ ..ఫోన్ నంబర్  తీసుకున్నా, యామిని తో సెలవు తీసుకుంటూ . 
చెన్నై నుండి హైదరాబాదు  రైలెక్కాను, అంజలి గారితో ..నా అనుబంధం నా కళ్ళలో మెదిలింది 

నాకు నాట్యమంటే ప్రాణం.చిన్నప్పుడు నాట్యం నేర్చుకునే దానికి నేను చేసిన ప్రయత్నం నా అనారోగ్యం కారణంగా విఫల మయ్యాయి, కానీ నాట్య ప్రదర్శనల్ని చూడడానికి మాత్రం తప్పకుండా వెళుతుండేదాన్ని. మొట్టమొదటిసారి   రవీంద్ర  భారతిలో అంజలి గారి నాట్య ప్రదర్శన చూసాను... విశ్వమొహినిలా  తరంగం చేస్తున్న ఆమెను  చూసి  ముగ్ధురాలిని అయ్యాను. సినిమాల్లో లాగా ఆమె అద్బుత నాట్యం చూసి ఎవరూ చుట్టుకోలేదు నేను తప్ప. నన్నుఅబ్బుర  పరిచింది ఆమె వయసు. ఆమెకు నలభై  పైనే  వయసు అని తెలిసాక నాకు మరింత ఆశ్చర్యం కలిగింది. ఆమె అందమైన  వదనానికి చక్కటి శరీరాకృతి ఆమె నాట్యానికి మరింత శోభనిచ్చింది. అమ్మాయికి నాకే ఆమె సౌందర్యం అద్భుతంగా అనిపించింది, మరి మగవాళ్ళకు ఆమె సౌందర్యం ఎంత గొప్పగా వుండి వుంటుందో మరి! అంజలి గారితో పరిచయం పెరిగింది. ఆమె రెడ్డీస్  లాబ్ లో  సైంటిస్టుగా జాబ్ చేస్తూ నాట్యప్రదర్సనలు ఇస్తుంటారు ..ఒక్కరే వుంటారు. ఒక్కదాన్నే వుంటాను అనడం తో నేను ఆమె భర్త గురించి అడగ లేదు. హాల్ లో వున్న అందమైన  అమ్మాయి ఫోటో  చూస్తుంటే ..
“నా  కూతురు"  అన్నారు ..

"మీలాగే వుంది. మీదే చిన్నప్పటి ఫోటో అనుకున్నా" అన్నాను.

"చెన్నైలో చదువుతోంది .. మెడిసిన్  ఫైనల్ ..ఆమె  చదువంతా  చెన్నైలోని మా అమ్మ వాళ్ళింటి లోనే జరిగింది, నేను  వుద్యోగం, ప్రోగ్రామ్స్అంటూ తిరుగుతుంటాను కదా !" నవ్వారు.

 

వీలు చిక్కినప్పుడల్లా నాట్యానికి సంబందించిన పుస్తకాలు అంజలి గారి దగ్గరినుండి తెచ్చుకుని చదివి ఇచ్చేదాన్ని,అంజలి గారు వేరే కళాకారుల  ప్రోగ్రాంలకు నన్నుతనతో కూడా తీసు కెళ్ళేవారు. అందర్నీ అభిమానించేవారు, ఇతర కళాకారుల గొప్పతనాన్నిఎంతో నిగర్వంగా, ప్రేమగా మెచ్చుకునేవారు,ఆమె గొప్ప కళాకారిణి అయినా ఆమెకు చాలా మంది అభిమాన నాట్య కళాకారులుండే వారు. ఆన్ని రకాల నాట్యం గురించి అనర్గళంగా మాట్లాడేవారు. మా కాలేజికి గెస్ట్ లెక్చరర్ గా పిలిచినప్పుడు  నాట్యం గురించి అంజలి గారు ఇచ్చిన ఉపన్యాసం అందర్నీ ముగ్ధుల్ని చేసింది. ఆమె రూపం, ఆమె జీవన విధానం, నన్నుచాలా ఇంప్రెస్  చేసేది, ఆమెను  ఒక దేవతలా ఆరాధించేదాన్ని, ప్రతి రోజూ అంజలి గారికి మా పెరటి తోటలో పూచే  పువ్వుల్ని అమ్మతో మాల కట్టించి తీసుకెళ్ళేదాన్ని. అవి తీసుకుంటూ ఆ పువ్వుల కంటే అందంగా నవ్వేది.

 

అంజలి గారి కూతురు యామిని వచ్చినప్పుడంతా ఎక్కువ నాతోనే గడిపేది ఈ సారి కూడా  అంజలి గారు ఇండో జర్మన్  ప్రోగ్రాం కు  తయారవుతూ నన్ను యామిని ని సంతోషంగా ఉంచే బాధ్యత  పెట్టారు …పదిరోజులు … పది క్షణాల్లా గడిచిపోయాయని చెప్పింది యామిని.  అంజలి గారి లాగానే యామిని కూడా...చాలా అందమైనది ... ప్రముఖ నాట్య శిరోమణి యామిని కృష్ణ మూర్తి అభిమానిగా తన కూతురికి ఆ పేరు పెట్టుకున్నారు. కానీ యామినికి   నాట్యం  ఎందుకు నేర్పించలేదంటే..నవ్వి ఊరుకున్నారు. యామిని కూడా నవ్వి "వదిలేయ్... మనకు నచ్చింది మనం చేసుకుందాం.." అంది. వాళ్ళ మాటలలో  ఏదో మర్మం  ఉందనిపించేది . కానీ నాకు వాళ్ళ వ్యక్తిగత జీవితం పై ఆసక్తి వుండేది కాదు....కానీ ఏదో వుంది...అంజలిగారి జీవితంలో ఏదో అపశృతి వుంది, లేకపోతే ... ఆ ఆలోచనల తోనే కలత నిదురపోయా...

 
హైదరాబాద్  రాగానే , ద్రువ్ కు ఒక ముద్దు ఇచ్చేసి, బయలుదేరా బాలకృష్ణ  గారింటికి ...! అమ్మ వారిస్తున్నా విన లేదు. ప్రయాణపు బడలిక ఒక ప్రక్క, అంజలి గారి ఆకస్మిక మరణం చేసిన గాయంతో నిద్రలేని రాత్రులతో  నిజానికి నేను చాలా..నిస్సారంగా నిరాశగా వున్నాను, ఎక్కడ పడి పోతానో దారిలో అనిపించింది నాకే ....కానీ పట్టుదల నన్ను ముందుకు నడిపించింది .బాలకృష్ణ  గారికి ముందే ఫోన్ చేశా, ఆయన నా కోసం బయటే వేచి వున్నారు. ఇద్దరం వాళ్ళ తోటలో కుర్చీలు వేసుకుని కూర్చున్నాము. 
"మైత్రి..నీవంటే అంజలికి చాలా ఇష్టం ..ఎంత ఇష్టమంటే ..నిన్ను తన కూతురిలాగా ప్రేమించింది .నిజానికి తనకూతురి కంటే నిన్నే ఎక్కువ ప్రేమించింది ...అందుకే తన నాట్య శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ...తన  కాస్ట్యూమ్స్, మెడల్స్ ఇతర బహుమతులు ,నాట్యానికి సంబంధించిన  ప్రతి వస్తువు నీకే ఇవ్వమన్నారు...అంతే కాదు తన ఇల్లు కూడా నీకే రాసారు ."
"అదేంటి సర్ .అంజలి గారికి తను చనిపోతారని ముందే తెలుసా.... !"వణుకుతున్న నా  గొంతులోంచి కష్టమ్మీద మాట వచ్చింది      
ఆయన తల ఊపారు .
నా కళ్ళలోంచి కన్నీరాగలేదు..
"మీకు  కూడా తెలుసా!"
ఆయన  మళ్ళి తల ఊపారు.
"అదేంటి  తెలిసి ఆమెకు  వైద్యం కూడా ఇప్పించకుండా "....నాకు దుఃఖం ఆగలేదు చాలా సేపు ఏడ్చాను యామినిని ఓదార్చడం లో గట్టిగా వున్నాను ,ఇంట్లో బయట ఎక్కడ కూడా నిగ్రహాన్ని పోగొట్టుకోలా కానీ ఆమె నన్ను తన వారసురాలిగా అంగీకరించడం తో నా దుఃఖం రెట్టింపయింది.ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియ లేదు. నా ఎదురుగా శిలలా వున్న అతని కళ్ళలో సైతం తడి . 
"చెప్పండి సర్ ఎందుకు మీరు  వైద్యం ఇప్పించ లేదు...అంజలి గారి కి జీవితంమీద అంత గౌరవం వుండేది ఆమె ఎందుకు మరణాన్ని అంత అవలీలగా అంగీకరించారు? "
"జీవితాన్ని ప్రేమించింది కాబట్టే చివరి వరకు అంత సంతోషంగా ఉండింది.. మరణాన్నికూడా అంతే సహజంగా తీసుకుంది...ఆమెకు తెలుసు కాన్సర్ కిచ్చే కీమో థెరపి ఎంత భయంకరమో !అంతేకాదు అది తన ప్రియమైన వాళ్లకు ఎంత బాధాకరమో !అందరి కళ్ళలో సానుభూతి ని ఆమె భరించలేదు.ఎంత వైద్యం తీసుకున్నా, ఆ జబ్బు నయమయే  అవకాశాలు తక్కువే అని తనకు తెలుసు ...నాకూ తెలుసు ..నాకెంతో ప్రియమైన నా స్నేహితురాలి కి నచ్చి నట్లు చేయాలనుకున్నా...ఆమెకు చివరి వరకు నాట్యం చేయాలనే కోరిక  ఉండింది, అది నెరవేర్చుకుంది ."
"సర్..యామిని కి తండ్రి లేడా?" అనుకోకుండా అడిగేశాను.
"వున్నాడు ..అయితే అతని నీడ కూడా యామిని పై పడకుండా అంజలి కాపాడుకుంది ....అంజలి నాట్యం చూసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నఅతను..పెళ్ళయ్యాక ఆమెను నాట్యం మర్చిపోమన్నాడు. అతన్ని ఒప్పించడానికి శత విధాల ప్రయత్నించింది..కానీ విన లేదు...కొద్దికాలం నాట్యం మానేసింది.వుద్యోగం మానేయమన్నాడు, అదీ మానేసింది ..కానీ అతను దుర్వ్యసనాలకు లోనయ్యాడు. అంజలిని బాగా బాధించేవాడు ..కానీ ఎవరికీ తెలియజేసేది కాదు. యామినిని మాత్రం అతని కి దూరంగా ఉంచింది. అప్పుడు నేను వైజాగ్ లో ఉండేవాడ్ని , అతని గురించి వేరే స్నేహితుల ద్వారా తెలిసి0ది.   అతన్ని వదిలి తన  తల్లిదండ్రుల  దగ్గరికి వెళ్లి పోమన్నాను. నవ్వి వూరుకుంది. తర్వాత అతను అంజలి ని విడిచి వేరే ఆమెతో వున్నాడు.అప్పుడు కూడా తన ధోరణిలో మార్పు రాలేదు. కానీ ముందు చేస్తున్న వుద్యోగం లోనే  చేరింది ..వాళ్ళు నాట్య ప్రదర్శనకు అనుమతించే షరతుమీద.  నా సలహాల్ని వినలేనందుకు నాకొక ఉత్తరం రాసింది అంజలి...ఇదిగో చదువు ..ఇది అంజలి ఫిలాసఫీ.
" బాలూ ...,
                క్షేమం .నిన్ననువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించా ! కానీ..జీవితం నాది కదా నీకు నచ్చినట్లు ఎలా ఉండగలను ? నీవు నా ప్రాణ మిత్రుడివి  అయినా.. నీ సలహా పాటించలేను.ఆన్ని ప్రేమలకు సుఖాంతం వుండక్కరలేదు.అసలు నా దృష్టిలో ప్రేమ అనే ప్రవాహానికి అంతమే లేదు ..నీవు ఆత్మలకు మరణం లేదని నమ్ముతావే ,,నేను ప్రేమకు మరణం లేదని నమ్ముతాను.అతని ప్రేమ ఈ రోజు నాకు లభించలేదని నేను బాధపడ్డం లేదు. ప్రేమ పర్యవసానం ఏదైనా ప్రేమ స్వరూపం ఒకటే.  అది వాగ్దానాల్ని నమ్ముతుంది,అవి నేరవేరాయా లేదా అన్న నిరాశకు ,అనుమానానికి అది లోను కాదు .అతను భౌతికంగా నావాడు కాదు ..నా దగ్గర లేడు..వేరే స్త్రీ దగ్గరే వున్నాడు కానీ అతని పట్ల  నా ప్రేమ  ద్వేషంగా మారితే అతనికేమీ నష్టం లేదు.అది అతని కేమీ హాని చేయదు ..అతన్ని దండించడం ,శిక్షించడం వద్దు .విడాకులిచ్చి భౌతిక మైన బంధాన్ని తెంచు కోగలం..  కానీ అతనిపై నాకున్న ప్రేమ నిశ్చలమైంది. అతను నాకు మోసం చేసినా ,నన్ను త్యజించినా అతని పట్ల నాకు వ్యతిరేకత లేదు ..రాదు ..నా విలువ గ్రహించి నా చెంతకు చేరినా ..అతను గ్రహించకముందే నేను మరణించినా నాకు తేడాలేదు .ఇది హేతుబద్ధమైన ఆలోచన కాకపోవచ్చు ,చదువుకున్న అమ్మాయిని అయివుండి ఇలా మానసిక దౌర్భల్యానికి లోనుకావడం నిన్ను అందరిని బాధించవచ్చు  కానీ ఇది నా ప్రవృత్తి . నా ఆనందానికి హేతువు ప్రేమనివ్వడమే ..తీసుకోవడం కాదు ...ఆశించడం వలన నిరాశ, నిరాశ  నుండి నిర్వేదం, నిర్వేదం నుండి నిస్పృహ...  ఇదే దుఃఖానికి హేతువు. దుఃఖం నా దరి చేర రాదంటే ప్రేమించడం ఒక్కటే మార్గం . ప్రేమ తన దిశను,మార్గాన్ని మార్చుకుంటుంది దాన్ని నీవు ఇలాగే వుండాలని  నిర్దేశించలేవు .కేవలం ప్రేమను పొందిన క్షణాల్ని జ్ఞాపకంగా దాచుకోగలం .దాన్ని ఎవరూ దొంగిలించలేరు. కాలం వాటిని మరుగు పరచలేదు .సంతోషం  వెలుగుతున్న క్రొవ్వొత్తిలాంటిది...అది ఆరిపోయేలోగా మరొక క్రొవ్వొత్తి వెలిగించాలి ..లేకపోతే చీకటి లాంటి దుఃఖం రాజ్యం చేస్తుంది ...అతను లేని నా జీవితాన నాట్యమే నా జీవిత భాగ స్వామి.
అర్థం చేసుకుంటావు కదూ !
నీ అంజలి                             
కన్నీళ్ళతో మసక బారిన కళ్ళతో అలాగే చదివాను ఉత్తరాన్ని ..ఆమె లో  చెలరేగే ప్రతికూల స్పందలన్నిటిని  (నెగటివ్   ఎమోషన్స్) తన  నృత్యించే  పాదాల  క్రింద  అణచివేసింది; ...శివ తాండవం  లో  ఆమె  ప్రతి  అడుగు  ఆమె  నమ్మకం  పై  అతను  చేసిన  దుశ్చర్య  పై; మహిషాశుర  మర్ధనిగా  ఆమె  చేసిన  కరాళ నృత్యం  ఆమెలోని  కోపం ,ద్వేషం  అసూయ   లాంటి అవాంఛిత భావనలపై . ఆ వెలుగులు విరజిమ్మే వదనం వెనక విషాదం ..విషాదాన్ని వినోదంగా మార్చిన ధన్యజీవి ఆమె ...ప్రేమస్వరూపం మార్చుకోదు..దిశను మార్చుకుంటుంది ...ఎంత గొప్పవేదాంతం ...!
"సర్ ..అంజలి గారి నాట్యానికి సంబందించిన వస్తువుల్ని నాకిచ్చారు చాలు... ఆమె నాకు జీవితం పట్ల నిజమైన అవగాహన కలిగించారు ...మనం కోల్పోయిన వాటికంటే ..మనకు వున్న అదృష్టాల్ని మనం మననం చేసుకోవాలి ...ఆ ఇల్లు నాకు చెందడం  అన్యాయం అది ఆమె వారసురాలైన యామినికి చెందనివ్వండి...."
"మైత్రీ...నాట్యం పట్ల నీకున్న మక్కువ అంజలికి తెలుసు ...అందుకే ఆమె ఆశయాల్ని నీవు నేరవేర్చగలవనే అంత విశాలమైన ఆ ఇల్లు నీకు రాసారు .పై భాగమంతా నీవుండేందుకు..క్రింద అంతా నృత్య కళాశాల కోసం. దాన్ని ఉచితంగా నడప డానికి వీలుగా ఒక ట్రస్ట్ ఆధీనం లో డబ్బును కూడా దాచింది  ...దాన్ని నీవు ఆదర్శవంతంగా నడపగలవని అంజలి విశ్వాసం.యామిని ని మానవాళికి ఉపయోగపడే ఒక మంచి డాక్టర్ ను చేయాలనే తనకోరిక నెరవేరింది .నృత్యకళాశాల నడపడానికి నీవు..తన వారసురాలివి .నా స్నేహితురాలి ఆశయాల ఆచరణలో నేనుకూడా వున్నానమ్మా ! వెళ్లిరా !"కళ్ళలో తడిని తుడుచుకుంటూ..నన్ను 
మరిన్ని కథలు
debbakudebba