Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
' Invasion ' to the NTR Ready

ఈ సంచికలో >> సినిమా >>

విజువల్‌ వండర్‌ ‘రుద్రమదేవి’

Visual Wonder ' rudramadevi '

అంచనాలకు తగ్గట్టుగానే విజువల్‌ వండర్‌గా ‘రుద్రమదేవి’ ఉండేలా కనిపిస్తుంది. గుణశేఖర్‌ భారీ సెట్టింగ్స్‌కి పెట్టింది పేరు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో సెట్స్‌కి మంచి పేరొచ్చింది. ‘ఒక్కడు’ సినిమాలో చార్మినార్‌ సెట్‌ వేయించినా, ‘అర్జున్‌’ సినిమాలో మధురై మీనాక్షి దేవాలయాన్ని సెట్‌గా వేయించినా గుణశేఖర్‌కే చెల్లింది.కాకతీయ చరిత్రను, అందులో రుద్రమదేవి జీవిత గాధను ‘రుద్రమదేవి’ సినిమాగా తెరకెక్కిస్తున్న గుణశేఖర్‌, సినిమాని విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దనున్నాడు. ట్రైలర్‌లో విజువల్స్‌ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ట్రైలర్‌లోనే ఇంత గ్రాండ్‌గా ఉంటే, బిగ్‌ స్క్రీన్‌పైన ఫుల్‌ మూవీలో ఆ అద్భుతాలు ఇంకెంత అందంగా ఉండనున్నాయో అంచనా వేయడం కష్టం.అల్లు అర్జున్‌ గోనగన్నారెడ్డిగా నటిస్తున్న ఈ ‘రుద్రమదేవి’, వీరభద్రుడిగా రాణా నటిస్తున్నాడు. ‘రుద్రమదేవి’ పాత్ర లైఫ్‌ టైమ్‌లో ఒకేసారి వచ్చే గొప్ప పాత్రగా అనుష్క అభివర్ణిస్తుంది. ‘అరుంధతి’ తర్వాత అంతటి గొప్ప సినిమా అనుష్కకి ‘రుద్రమదేవి’ అవుతుందని దర్శకుడు గుణశేఖర్‌ అంటున్నాడు. ఈ విజువల్‌ వండర్‌ని వెండితెరపై చూడ్డానికి కొన్ని రోజులు ఓపిక పట్టాలి.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam