Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kitikeelo cheyyi

ఈ సంచికలో >> కథలు >> ఇదీ సంభవమే

idee sambhavame

టైం       చూసుకుంటూ హడావుడి పడిపోతున్న సుమతిని చూసుకుంటూ  ఆనందంతో బాటు బోల్డంత ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబయింది వసుమతి. ఎప్పుడూ చుడీదారుల్లో కనిపించే కూతురు మల్లెపూవు లాంటి ఖద్దరు చీరా జాకెటుతో దర్శనమిచ్చే సరికి కళ్లలో నిండిన ఆనంద భాష్పాలతో తృప్తిగా కళ్లు మూసుకుంది  ఓ క్షణం. తండ్రి లేని సుమతిని  క్రమశిక్షణతో పెంచి పెద్దచేసింది. బాధ్యతలు గుర్తించిన సుమతి పోష్టుగ్రాడ్యుయేటై ఒక పెద్ద కంపెనీలో మేనేజరుగా ఉద్యోగం చేస్తోంది.కానీ సేవాదృక్పధం వున్న ఉద్యోగం చేయాలన్నతన చిరకాల కోరిక తీర్చుకోవాలని తపన పడుతోంది. దాని పర్యవసానమే ఈ హడావుడి. 

అమ్మాసుమా యింకా  చాలా టైముందిరా. ముందు నువ్వు టిఫిన్ చేసెయ్ హడావుడి పడిపోతున్న తల్లిని మురిపెంగా చూస్తూ ..అయిందనిపించి బైచెప్పి బయలుదేరి పోయింది సుమతి ఇంటర్వూకు. ఫోన్లో చెప్పిన కొండగుర్తుల్నినెమరేసుకుంటూ మదర్ ధెరిసా  సేవాసదన్ మార్గసూచి దగ్గర ఆగిపోయి మరోసారి టైం చూసుకుంది. మరో అరగంట టైముంది.తన స్కూటీని సేవాసదన్ రోడ్ మీదకు మళ్లించింద జస్ట్ మరో ఐదు కిలోమీటర్లు.లకీగా సేవాసదన్ మేనేజరుగా తను సెలక్ట్ అయితే తన జీవితాశయం నెరవేరినట్లే...వూహల్లో తేలిపోతూ తన స్కూటీ వేగం పెంచింది.రోడ్ ఖాళీగా వుంది . అప్పుడప్పుడు సేవాసదన్ నుండి వస్తున్న  ఆటోలు తప్పనిర్మానుష్యంగా వుంది. హుషారుగా దూసుకు పోతున్నసుమతి హఠాత్తుగా తన స్కూటీని ఆపేసింది. రోడ్ ప్రక్క ఓచేతిలో సంచి,మరోచేతిలో వాకింగ్ స్టిక్ తో వెళ్తున్నవ్యక్తి హఠాత్తుగా కుప్పకూలి పోతుంటే ...ఒక్క గెంతులోవెళ్లి పడిపోకుండా పట్టుకుంది. సారీఅమ్మా..కళ్లు తిరిగి పోతున్నాయ్.. సారీ తల్లీ..   అంటున్న ఆపెద్దాయన్ని భద్రంగా తీసుకెళ్లి ఓతూమ్మీద కూర్చోబెట్టి తన బేగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి అందించింది.    వాటర్ తాగుతూ  ఓప్రక్కకు వాలిపోతున్న ఆయన్ని పట్టుకొని ఓ ఖాళీఆటో   ఆపి డ్రైవర్ సాయంతో ఆటోలో చేర్చితన స్కూటీని లాక్ చేసి మెయిన్ రోడ్ మీదున్న హాస్పిటల్లో తన కంపెనీ  ఐడి కార్డు చూపించి తన చేతి బంగారుగాజును డిపాజిట్ చేసి అడ్మిట్ చేసింది. హఠాత్తుగా తన ఇంటర్వూ సంగతి గుర్తొచ్చిటైం చూసుకుంది. అప్పటికే షెడ్యూల్ దాటి గంట గడిచిపోయింది.ఇంటర్వూగురించి మనసు పాడుచేసుకోకుండా తన స్కూటీ గురించి ఆలోచిస్తూ రిసెప్షన్ముందు కూర్చుండిపోయింది.

కంగ్రాట్స్  తల్లీ..హిఈజ్  ఔటాఫ్ డేంజర్..ఆయనెవరో తెలియకపోయినా యింత రిస్క్ తీసుకున్నావు. వాళ్లబ్బాయి వచ్చాడు. ఇదిగో నువ్వు డిపాజిట్ చేసిన నీ బంగారు గాజు.వెల్డన్ ... కీపిటప్...  ఆశ్చర్యంతో చూస్తున్న సుమతి భుజం తట్టి చిరునవ్వు నవ్వాడు డాక్టర్...

మూడీగా  యింటికొచ్చిన కూతుర్ని చూస్తూ...మళ్లీ యిది ఏ దెబ్బతిన్న కుక్క పిల్లకో అడుక్కుంటున్న ఏ అవ్వకో సాయం చేయబోయి ఈ ఇంటర్వూను కూడా తన్నేసుకుని వుంటుందిది...మామూలేగా దీనికి అని.. సమాధాన పడింది వసుమతి.  

ఉదయం నిద్రలేస్తూనే ... అమ్మా..నేను సెలక్టయ్యాను...హౌ..  అంటూ అరిచేస్తున్న కూతుర్ని అయోమయంగా చూసింది వసుమతి....    అమ్మా ఇట్స్ ట్రూ...సీ మై యస్సెమ్మెస్... బట్.. ఐథింక్.. దేరీజెమిస్టేక్...     వితౌట్ ఇంటర్వూ...దట్ టూ...జనరల్ మేనేజర్ ...‘ఒక్కసారి  ఆశ్రమానికి వెళ్లి ఎంక్వైరీ చేసుకుంటాను.  తయారై తుర్రుమంది సుమతి.

..తను హాస్పిటల్లో జాయిన్ చేసింది .. సేవా సదన్ ఫౌండర్నని.. తన ఇంటర్వూ దారి లోనే పూర్తయిపోయిందనీ తెలిసే అవకాశం ..సుమతికి..  లేదు ...లేదు. .రాదేమో  కూడా.         

మరిన్ని కథలు
vyasana prabhavam