Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ee turpu-aa pachimam

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతి పధం - డా. పులివర్తి కృష్ణమూర్తి

 

గవంతుడి అనుగ్రహమ్ మనమీదే వుందని అనుకున్నాం అనుకోండి, ఇక మనకు ఎలాంటి అసంతృప్తే వుండదు జీవితంలో. ఎందుకంటే ఏ జీవికైనా ఇంతకన్నా ఏం కావాలి? మనిషి కేవలం తిండి కోసమే బ్రతుతుకుతున్నాడా అని ఆలోచిస్తే, కానేకాదని తేలిపోతుంది. ఎలాంటి ఆలోచనలకైనా మన మనస్సే కారణం. ఈ జగత్తూ నీవూ అంతా ఒకటేననుకుంటే, ఇక ప్రపంచంలో అంతా శాంతే మిగులుతుంది. అదే విశ్వాశాంతికి దారితీస్తుంది. మనం ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ జగత్తు అంతా ఒక దేశమే. మరిన్ని దేశాలు లేనే లేవు. ఆ దేశం పేరు మానవప్రదేశం. ప్రపంచంలో వున్న ఒకేఒక్క మతం, అదే మానవమతం. ఆ మతం పేరే ' ప్రేమ ' దాని అసలు పేరు ఆత్మ. మనం వింటున్న పేర్లన్నీ మనంగా పెట్టుకున్న పేర్లేకదా! ప్రతి దినమూ ఈ మానవుల గురించి గానీ ఈ ప్రకృతి గురించి గానీ చెడ్డగా మాట్లాడేవారూ, వాటికి హాని కలిగించేవారూ భగవత్ప్రసాదంగా సాగిపోతున్న జనజీవనానికీ, ప్రకృతి కదలికలకూ విఘాతం కలిగించేవారికి ఈ విశ్వంలో చేటే లేదు.

మీరు ఈ ప్రపంచంలో జీవిస్తున్న మానవులందరినీ పరిశీలిస్తే వారి పేర్లన్నీ ఆ భగవంతునికో, లేక ప్రకృతికి సంబంధించినవో వుంటాయి. భగవంతునిది కానిదేమున్నది ఈ విశ్వంలో. మనము భగవంతుని ప్రసాదాలే. మనలోనే భగవంతుని రూపం దాగివుంది. ఆ పరమాత్మ మనలోనుండి బయటకు వస్తే మిగిలే ఈ శరీరాన్ని ఎవ్వరూ ప్రేమించరు కదా, పట్టించుకోరు. 84లక్షల జీవరాశుల్లో అందరిలోనూ వున్నది ఒకేఒక్క రూపం. అదే భగవంతుడి స్వరూపం ఆత్మా,పరమాత్మా ఒక్కటేకదా! కేవలం మనుష్యులకు మాత్రమే తానేమిటో తెల్సుకోగలిగే శక్తి వుంది. వివేకం, విజ్ఞానం వుంది. మిగిలిన జీవరాశులకు ఈ సౌకర్యం లేదు. అది మానవ మాత్రులకు మాత్రమే సొంతం. ప్రపంచంలో వున్నది ఒకే ఒక్క కులం. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు వుండడు. ఆలోచించి చూస్తే అందరి దేవుడూ ఒక్కడే, అందరి కులమూ ఒక్కటే. అదే మానవ కులం. మన మతం పేరు మానవ మతం. దాని భాస ' ప్రేమ ' అదే హృదయ భాషగా చెప్పుకుందాం.

అయితే ఇప్పుడున్న మతాలన్నీ ఏమిటని ప్రశ్నించేవారికి ఒక్కసారి ఆలోచిస్తే, వాళ్ళందరూ భగవంతుడి దూతలే, ప్రవక్తలే. బుద్ధుడూ, క్రీస్తూ, మహమ్మద్, జోరాస్టర్, గురునానక్, వీళ్ళంతా తాము దేవదూతలుగానే చెప్పుకున్నారు. నిజానికి వీరంతా భగవంతుని సందేశాన్ని మానవాళికి అందించారు. అంతే, వాళ్ళెవ్వరికీ ఎలాంటి మతాన్ని ప్రారంభంచాలని వుందనిపించదు. వారితర్వాత వారి శిష్యులు వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ మతాలు ప్రారంభించారు. వాళ్ళపేర్లమీద చెలామణిలో వున్న మతాలు ఏం చెప్పినా ఒక్కటే వుండాలి నిశితంగా ఆలోచిస్తే. ఆ తర్వాత ఆ మతాల్లోనుండి మరికొన్ని శాఖలు ఉద్భవించాయి. అయితే ఆ తర్వాతి కాలాల్లో ఈ పెద్దలందరూ తమ మతాలూ పద్ధతులూ గొప్పవని చెప్పుకుంటూ మానవుల్లో విభజన తీసుకొచ్చారు. ఈ రోజున సఘంలో జరుగుతున్న మతపరమైన కార్యక్రమాలను పరిశీలిస్తుంటే, మన ప్రవక్తలు కోరుకున్నదీది కాదేమోననిపిస్తుంది.

ఏ మతమైనా మంచినే బోధించాలి. ఏ మతమైనా శాంతినే కోరుకోవాలి. ఏ మతమైనా మానవజాతి క్షేమం కొరకే పనిచేయాలి. అలా చేయని మతం మతం అనిపించుకోదు. ప్రేమ ప్రాతిపదికగా లేని మతం మతం కాదు. ప్రేమ అంటేనే ఆ భగవంతుని అందరిలోనూ దర్శించడమే. ఈ సత్యాన్ని తెల్సుకోలేనివారు సమాజానికి అనవసరంగా ఇబ్బందులు కలిగిస్తూ విధ్వంసకపూర్వక కార్యక్రమాలకు దారి తీస్తున్నారు. మానసిక ప్రశాంతత, శాంతి, భగవంతుని స్వరూపాలే. ఆనందం ఎప్పుడూ భగవంతుని ప్రసాదమే. మనం చేసే పనులన్నిటినీ భగవంతుని అదేశానుసారమే అనుకుంటూ నిర్వర్తిస్తే, మనస్సుకు ప్రశాంతత చేకూరి, తద్వారా విజయం సొంతమవుతుంది. ఈ విశ్వంలో జరిగే ఏ విషయమైనా భగవంతుడికి తెలియకుండా జరిగే ప్రసక్తే రాదు. అందుకే ప్రపంచమంతా ఒక్కటిగా, మతాలూ, కులాలూ, ప్రాంతాలూ, భాషా బేధాలూ లేకుండా వుంటే ఎంత బాగుంటుందో.

మరిన్ని శీర్షికలు
avee-e vee