Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Talk Of The Industry ' Sathyamoorthy '

ఈ సంచికలో >> సినిమా >>

నటనలో మేటి రాశి ఖన్నా

Top acting rasikhanna

సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటుంటారు. సినిమా ప్రమోషన్‌లో అదో స్టంట్‌. అరుదుగానే హీరోయిన్లను నటన పరంగా పొగిడే సందర్భాలు చోటుచేసుకుంటుంటాయి. హీరో గోపీచంద్‌ తన కొత్త సినిమా 'జిల్‌'లో హీరోయిన్‌ రాశి ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించాడు.'జిల్‌' ఆడియో విడుదల వేడుకలో గోపీచంద్‌ రాశి ఖన్నాకి ప్రత్యేకంగా థాంక్స్‌ చెప్పాడు. నటనలో ఇరగదీసేసిందన్నాడు గోపీచంద్‌. 'లౌక్యం' తర్వాత గోపీచంద్‌ హీరోగా నటించిన మూవీ ఇది. రాశి ఖన్నా 'ఊహలు గుసగుసలాడే' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 'జోరు' సినిమా కోసం పాట కూడా పాడిన ఈ మల్టీ టాలెంటెడ్‌ని ఎవరైనా అభినందించాల్సిందే.కెరీర్‌లో కొన్ని ఫ్లాప్స్‌ ఎదుర్కొన్నాక 'సాహసం'తో హిట్‌ అందుకుని, 'లౌక్యం'తో సెటిల్‌ అయిన గోపీచంద్‌, సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ చెప్పాడు 'జిల్‌' ఆడియో వేడుకలో. మిగతావారికి థ్యాంక్స్‌ మామూలుగా చెప్పి రాశి ఖన్నాకు సెపరేట్‌గా థాంక్స్‌ చెప్పి, ఆమె టాలెంట్‌ని పొగిడాడంటే, సినిమాలో రాశి ఖన్నా తన టాలెంట్‌ అంతా ప్రదర్శించి ఉండాలి.

మరిన్ని సినిమా కబుర్లు
350 Days to cross the 'Legend'