Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
350 Days to cross the 'Legend'

ఈ సంచికలో >> సినిమా >>

అప్పటికీ ఇప్పటికీ ఆమెలో అదే అందం

She still is still the same beauty

రమ్యకృష్ణ ఒకప్పటి గ్లామరస్‌ హీరోయిన్‌. తన గ్లామర్‌తో సినీ ప్రేక్షకుల్ని అలరించిన రమ్యకృష్ణ అప్పటికీ ఇప్పటికీ అదే అందాన్ని ఎలా మెయిన్‌టెయిన్‌ చెయ్యగలుగుతుందో సస్పెన్సే. నాగార్జునతో పలు విజయవంతమైన చిత్రాల్లో రమ్యకృష్ణ నటించింది. రమ్యకృష్ణతో గతంలో నటించిన సినిమాల్ని గుర్తు చేసుకున్న నాగార్జున, ఆమెలో అప్పటికీ ఇప్పటికీ అందం తగ్గలేదన్నాడు. 'సోగ్గాడే చిన్ని నాయనే' నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం. ఇందులో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ సందర్భంగానే రమ్యకృష్ణలోని 'బ్యూటీ'ని ట్విట్టర్‌ ద్వారా నాగార్జున పొగిడేశాడు. 'సంకీర్తన' నాగార్జున, రమ్యకృష్ణ తొలినాళ్ళలో చేసిన సినిమా. 'చంద్రలేఖ', 'హలోబ్రదర్‌' లాంటి ఎన్నో సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. నాగార్జున, రమ్యకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనే' విశేషాలకొస్తే, కళ్యాణకృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో 'అందాల రాక్షసి' ఫేం లావణ్య త్రిపాఠి హీరోయిన్‌.

మరిన్ని సినిమా కబుర్లు
chiru in trivikram direction