Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sudhamadhuram

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Ugadi

మన్మధ నామ సంవత్సర ఫలితాలు - శ్రీకాంత్

మేష రాశి :  ఆదాయం- 14,వ్యయం-14, రాజపూజ్యం-03, అవమానం-06  

ఉద్యోగులకు-  వృత్తిలో ఎదుగుదల ఉన్నప్పటికి వివాదాస్పద వ్యవహరాలకు దూరంగా ఉండుట అలాగే చిత్తశుద్దితో ముందుకువెళ్ళుట సూచన. ఆర్థికపరమైన వ్యవహరాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీపైఅపనిందలు పడే అవకాశం కలదు వాటి గురించి సమయాన్ని వృధాచేసుకోకండి. వ్యక్తిగతవిషయాలను గోప్యంగా ఉంచుట మంచిది.  

వ్యాపారస్థులకు -  ప్రతి ఆలోచనలో జాగ్రత్త అవసరం. జాయింట్ వ్యాపారాలు చేసే వారు కాస్త అప్రమత్తంగా ఉండుట సూచన. పెట్టుబడులు అలాగే ధనమునకు సంభందించిన విషయాల్లో నిదానం అవసరం.  

విద్యార్థులకు -  పోటీపరిక్షల విషయంలో అప్రమత్తత అలాగే జాగురుకత అవసరం. బద్ధకం వీడండి కష్టానికి తగిన ఫలితం పొందుటకు అవకాశం కలదు. దూరప్రదేశాల్లో చదువుకొనే అవకాశం కలదు.

స్త్రీలకు-  అకారణకలహముల మూలాన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.


వృషభ రాశి : ఆదాయం-08, వ్యయం-08, రాజపూజ్యం-06, అవమానం-06  

ఉద్యోగులకు- వృత్తిలో అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికి తరచుగా కాస్త మానసికపరమైన ఇబ్బందులు,ఋణభాదలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఆశించిన సహకారం తక్కువగా ఉండే అవకాశం ఉంది కావున కాస్త శ్రమపెరుగుతుంది. ఆరోగ్యంవిషయంలో ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. 

వ్యాపారస్థులకు -  ఫైనాన్స్,కాంట్రాక్ట్ రంగాలలో ఉన్నవారికి మిశ్రమఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం,ఆర్థికపరమైన విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు.

విద్యార్థులకు -  మీరు ఆశించిన మేర ఫలితాలు ఉండకపోవచ్చును కావున ప్రణాళిక అవసరం,సమయపాలన పాటించుట మంచిది. సంవత్సరం మొదటిభాగం కన్నా రెండవబాగంలో వచ్చే ఫలితాలు ఆశాజనకంగా ఉంటవి.

స్త్రీలకు-  స్త్రీలు భాద్యతలు పెరుగుతాయి. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో అభద్రతాభావం నెలకొంటుంది.  సుబ్రమణ్య ఆరాధన ఉత్తమం. షిరిడిసాయిబాబా ఆలయం సందర్శించుట ఉత్తమం. గురు,రాహు జపాలు చేయించుకోండి.   


మిథున రాశి : ఆదాయం-11, వ్యయం-05, రాజపూజ్యం-02, అవమానం-02

ఉద్యోగులకు- పదోన్నతలు లభిస్తాయి అలాగే ఆశించిన ప్రదేశానికి బదిలీలు ఉంటవి. మీ పై అధికారుల నుండి అభినందనలు పొందుతారు. గతంలో మీరుచేసిన రుణాలను తీర్చుటకు అవకాశం ఉంది ఆర్థికపరమైన విషయాల్లో నూతనఅవకాశాలు లభిస్తాయి.


వ్యాపారస్థులకు - ఆశించిన ఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడులకు అవకాశం కలదు వ్యాపారంలో స్వల్ప మార్పులకు ఆస్కారం ఉంది,ఆశించిన మేర లబ్దిని పొందుతారు. నూతన ఆలోచనలను మలుచేసే ఆస్కారం ఉంది.

విద్యార్థులకు - అతికష్టం మీద ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. పెద్దల సూచనలు,సలహాలను పాటించుట వలన మేలుజరుగుతుంది. కాంపిటేషన్ పరీక్షల్లో మిశ్రమఫలితాలు పొందుతారు.

స్త్రీలకు- అరోగ్యంలో మంచి మార్పులు కలుగుతాయి అనారోగ్యసమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో ముఖ్యంగా బార్యభర్తల మధ్య ఉన్న విభేదాలు తగ్గుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులకు అవకాశం ఉంది.  దుర్గాదేవిని ఆరాధించుట మంచిది. తరచు దుర్గా ఆలయానికి వెళ్ళండి. రాహుజపం చేయించుకోండి. గాయత్రీమంత్రం పారాయణ  మేలుచేస్తుంది.

 

కర్కాటక రాశి : :ఆదాయం-05, వ్యయం-05, రాజపూజ్యం-05, అవమానం-02

ఉద్యోగులకు-  వృత్తిపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. నియామకవిషయాల్లో కాని సంస్తాగత విషయాల్లో పై అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మానసిక ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. 


వ్యాపారస్థులకు - స్వల్పపాటి ఇబ్బందులు ఎదురైనను సమయస్పూర్తితో వ్యవహరించుట వలన పరిస్కరించుకుంటారు. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది.

విద్యార్థులకు -  పోటీరంగాల్లో రాణించే అవకాశం ఉంది,పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉన్నతఅవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. 

స్త్రీలకు- ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించుట మంచిది. అనారోగ్యసమస్యలు భాదిస్తాయి తగిన జాగ్రత్తలు తీసుకోండి.
సూర్య ఆరాధన చేయండి. ప్రతిరోజు విష్ణుసహస్రనామం పారాయణ చేయండి. నవగ్రహలకు  పూజలు చేయుట మంచిది (నవగ్రహశాంతి)


సింహ రాశి : ఆదాయం-08, వ్యయం-14, రాజపూజ్యం-01, అవమానం-05

ఉద్యోగులకు-  ఉద్యోగంలో ఉన్నవారు నూతన ప్రయత్నాల కన్నా ఉన్న వాటిలోనే కోనసాగే ప్రయత్నం చేయుట మంచిది. నిరుద్యోగులకు కాస్త కటినమైన కాలంగా చెప్పుకోవాలి కావున ప్రణాలిక అలాగే తగిన శ్రమఅవసరం. ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట వలన ఇబ్బందులు తొలగుతాయి.  
 

వ్యాపారస్థులకు - వ్యాపరపారీశ్రామికరంగాల వారికి  అధికారుల మూలాన ఇబ్బందులు పొందుతారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో లబ్దినిపొందినను సమయానికి ధనం చేతికి అందకపోవచ్చును. 

విద్యార్థులకు - విద్యలో చిన్న చిన్న ఇబ్బందులు పొందుతారు, సమయాన్ని వృధాచేయకుండా సద్వినియోగం చేసుకోండి. లక్ష్యం ఏర్పాటుచేసుకోని ప్రయత్నం చేయుట మంచిది.

స్త్రీలకు- మానసికపరమైన సమస్యలు పొందుతారు. అనారోగ్యసమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు జాగ్రత్త. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి.ఈ రాశివారు గురు,శని,రాహు,కేతు గ్రహాలకు జపాలు చేయించుకోండి. దక్షిణామూర్తి,దత్తాత్రేయ స్తోత్రాలు చదువుట అలాగే ఆరాధన మంచిది. 

కన్యా రాశి :  ఆదాయం-11, వ్యయం-05, రాజపూజ్యం-04, అవమానం-05

ఉద్యోగులకు-  మీయొక్క లక్ష్యలాను సాధించుకొనే ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు. ఉద్యోగంలో మాత్రం ప్రణాళిక అవసరం నలుగురిలో పనిచేసే సమయంలో అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది.  

వ్యాపారస్థులకు -  నిదానంగా మీరుఅనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు కాస్త ఓపికగా ప్రయత్నం చేయుట మంచిది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. నూతన పనులను చేపడుతారు.

విద్యార్థులకు - బద్ధకం వలన నష్టపోతారు జాగ్రత్త. వచ్చే ఫలితాలు మీరు ఆశించిన మేర ఉండకపోవచ్చును సర్దుబాటు అవసరం. ఉన్నతలక్ష్యాలను ఏర్పరుచుకోండి ఆ దిశగా ముందుకుసాగండి.

స్త్రీలకు- కుటుంబంలో మీరు ఊహించిన మార్పులకు అవకాశం ఉంది. మీ జీవితభాగస్వామి సహకారం లభిస్తుంది. స్వల్పఅనారోగ్యసమస్యలు తప్పకపోవచ్చును జాగ్రత్త. గురు,రాహులు జపాలు చేయుట మంచిది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరధన అలాగే సుబ్రమణ్యఆరాధన మంచిది. ప్రతిరోజు సుబ్రమణ్యఆష్టకం చదవండి.   


తులా రాశి : ఆదాయం-08, వ్యయం-07, రాజపూజ్యం-07, అవమానం-01

ఉద్యోగులకు-  ఉద్యొగస్థులకు బాగుంటుంది నూతన అవకశాలు పొందుతారు. ఆశించిన ఫలితాలు రావడానికి ఆస్కారం కలదు. ఉన్నతఅవకశాలు పొందుతారు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రభుత్వ,ప్రైవేటు రంగంలో ఉన్నవారికి పదోన్నతి లభించే అవకాశం కలదు.   


వ్యాపారస్థులకు - లాభాలు పెరుగుటకు అవకాశం ఉంది. ఉన్నతస్థాయి పరిచయాలు అయ్యేందుకు ఆస్కారం కలదు వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. పారిశ్రామికరంగాల వారు ఆశించిన లబ్దిని పొందుతారు.

విద్యార్థులకు - తమ తెలివితేటలకు పదను పెట్టుట వలన మేలుజరుగుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నూతన ప్రయత్నాలు చేయునపుడు ప్రణాళిక అలాగే పెద్దల సూచనలు అవసరం. పోటీపరీక్షల్లో  ఆశించిన ఫలితాలు వస్తాయి.

స్త్రీలకు- ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆలోచనలు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన.  శుభకార్యక్రమాలు మీరు ఆశించిన వేగంగా జరుగక పోవచ్చును చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతాయి. శని,రాహు గ్రహాలకు జపాలు చేయించుట మంచిది. తరచు శివునకు రుద్రాభిషేకాలు చేయండి తరచు శివాలయాలు సందర్శన చేయుట మంచి ఫలితాలను కల్గజేస్తుంది. ప్రతిరోజు సుబ్రమణ్యఅష్టోత్తరం చదవండి.



వృశ్చిక రాశి  : .ఆదాయం-14, వ్యయం-14, రాజపూజ్యం-03, అవమానం-01

ఉద్యోగులకు-  ఉద్యోగంలో ఊహించని విధంగా నూతన సమస్యలు పొందుటకు అవకాశం కలదు కావున జాగ్రత్త. ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంది బదలీలు అయ్యే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన,సర్దుబాటు విధానం మంచిది.   

వ్యాపారస్థులకు -  జాయింట్ వ్యాపారాలు చేసే వారి తగు జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. నూతన పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గతంలో చేసిన ఆలోచనలనే కొనసాగించే ప్రయత్నం చేయుట ఉత్తమం.

విద్యార్థులకు -  విద్యాసంభందమైన విషయాల్లో పట్టుదల అవసరం. ఊహించిన విధంగా ఫలితాలు రాకపోవడం వలన నిరుత్సాహంను పొందుతారు. పోటీపరీక్షల్లో గట్టేకేందుకు చేసే ప్రయత్నాలు సాధారణఫలితాలను కలగజేస్తాయి. 

స్త్రీలకు- రక్షణకు ప్రథమప్రాధాన్యం ఇవ్వండి. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. విందులకు సమయాన్ని ఇస్తారు. ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ద అవసరం  లలితాసహస్రనామం పారాయణ,గణేశఅష్టకం ప్రతిరోజు చదువుట మంచిది. శని,రాహు,కేతుగ్రహాలకు జపాలు చేయుట వలన మేలుజరుగుతుంది. 


   ధనస్సు రాశి  : ఆదాయం-02, వ్యయం-08, రాజపూజ్యం-06, అవమానం-01

ఉద్యోగులకు- ఉద్యోగులకు అధికారుల వలన ఇబ్బందులు పొందు అవకాశం ఉంది కావున వారికి అనుగుణంగా నడుచుకొనుట సూచన. ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంది కావున బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులకు ఆస్కారం కలదు జాగ్రత్త.  

వ్యాపారస్థులకు - ఆర్థికపరమైన విషయాల్లో సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. సమయనికి చేతికి ధనం సర్దుబాటు కాకపోవచ్చును జాగ్రత్త. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టకపోవడం అనేది సూచన.

విద్యార్థులకు - శ్రమకు తగిన ఫలితం పొందుతారు కావున సమయాన్ని వృదాచేయకండి. పోటీపరిక్షల విషయంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. దూరప్రదేశం వెళ్ళాలనుకొనేవారు తమ కోరికలను సిద్దిన్చుకుంటారు.   

స్త్రీలకు- కుటుంబంలో ఉన్న చిన్న చినన్ మనస్పర్థలు తొలగిపోతవి. భార్యాభర్తల మధ్య అనుభందం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఉద్యోగం లభిస్తుంది. విలువైన వస్తువుల విషయంలో మాత్రం జాగ్రతలు అవసరం. శని,రాహులకు జపాలు చేయండి. తరుచు హనుమాన్ ఆలయం వెళ్ళుట మంచిది. దక్షిణామూర్తిస్తోత్రం పారాయణ చేయుట అలాగే రాజరాజేశ్వరి అష్టకం చదవండి.


మకర రాశి : ఆదాయం-05, వ్యయం-02, రాజపూజ్యం-02, అవమానం-04

ఉద్యోగులకు- సంవత్సరంలో చక్కటి ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం కలదు ఆశించిన ప్రదేశానికి బదిలీలు అయ్యేందుకు అవకాశం కలదు. నూతన ధనాదయమార్గాలు కలిసి వస్తాయి,ఆర్థికపరమైన విషయల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటవి.  


వ్యాపారస్థులకు -  పురోగతి ఉంటుంది నూతన పనులలో సమయాన్ని గడుపుతారు. నలుగురిలో ఆశించిన విధంగా గుర్తింపు లభిస్తుంది. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. నూతన ఆదాయవనరులు పెరుగుటకు అవకాశం కలదు.  

విద్యార్థులకు -  చక్కటి అనువైన కాలం కావున ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండి ముందుకు వెళ్ళుట వలన మంచి ఫలితాలు పొందుతారు. పోటీపరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఉన్నతవిద్య చదివే వారికి కోరికలు నెరవేరుతాయి.  

స్త్రీలకు- కుటుంబసభ్యుల నుండి గుర్తింపు అలాగే గౌరవం లభిస్తుంది. నూతన పనులకు శ్రీకారం చుడుతారు. ఉద్యోగంలో ఉన్నతపదవులు లభించే అవకాశం కలదు. సంతానసౌఖ్యం ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంకష్టచతుర్థి రోజున గణపతిని ఆరాధన చేయండి. షిర్డీసాయి ఆలయం వెళ్ళుట మంచిది. ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం అలాగే శివఅష్టోత్తరం చదవడం వలన మేలుజరుగుతుంది. గురు,రాహులకు జపాలు చేయించుకోండి.

కుంభ రాశి : ఆదాయం-05, వ్యయం-02, రాజపూజ్యం-05, అవమానం-04

ఉద్యోగులకు- తమపై అధికారులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున సర్దుబాటు అవసరం. ఉద్యోగంలో దూరప్రదేశంనకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ప్రణాలికాబద్దంగా వ్యవహరించుట అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళుట చక్కటి గుర్తింపును పొందుతారు. ధనమునకు సంభదించిన విషయాల్లో నూతన అవకశాలు కలుగుతాయి. 

వ్యాపారస్థులకు - ఊహించిన విధంగా అనుకూలమైన మార్పులకు అవకాశం కలదు. నూతన పెట్టుబడులకు అవకాశం కలదు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. తోటివారి నుండి ఆశించిన సహకారం లభిస్తుంది.

విద్యార్థులకు -  సాంకేతిక విద్యలో ఉన్న విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద చాకటి కాలం మంచి ఫలితాలనే పొందుతారు కష్టపడటం ద్వార మరింత ఉన్నతమైన ఫలితాలు కలుగుతాయి.

స్త్రీలకు-  నూతన ఉద్యోగఅవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుటకు అవకాశం ఉంది. సంవత్సరం ప్రథమర్తంలో ఖర్చులను తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. రాహు,కేతువులకు జపాలు చేయించుకోండి. దైవసంభందమైన కార్యక్రమాలలో పాల్గొనుట మంచిది. ప్రతిరోజు సూర్యభాగావనున్ని ఆరాధించుట మంచిది. గాయత్ర్ మంత్రం చదవండి. తరచు శివాలయం వెళ్ళుట ఉత్తమం. 

మీన రాశి : ఆదాయం-02, వ్యయం-08, రాజపూజ్యం-01, అవమానం-07

ఉద్యోగులకు-  ఉద్యోగంలో స్థానచలనంకు అవకాశం ఉంది. అధికారులతో చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు,వారినుండి పని ఒత్తిడి ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఆరంభించుట విషయంలో తొందరపాటు పనికిరాదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. 

 
వ్యాపారస్థులకు - నూతన పెట్టుబడుల విషయంలో సరైన అవగాహన అవసరం. జాయింట్ వ్యాపారాలు మిశ్రమఫలితాలను కలుగజేస్తాయి. ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్ళుట వలన లబ్దిని పొందుతారు.   

విద్యార్థులకు - అతికష్టం మీద ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది కావున శ్రమను కలిగి ఉండుట మంచిది. అనవసరమైన విషయలకు దూరంగా ఉండుట సూచన. పోటీపరీక్షల్లో లక్ష్యం ఆధారంగా ముందుకు వెళ్ళండి మంచిది.  

స్త్రీలకు- ఓర్పును కలిగి ఉండుట మంచిది. వివాదాలకు దూరంగా ఉండుట సూచన. ఉద్యోగంలో శ్రమను పొందుతారు నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ద వహించుట మంచిది.  ఖుజ,గురు,రాహు,కేతు జపాలు చేయించుకోండి. దుర్గాస్తోత్రం చదవుట మంచిది. శ్రీ వేంకటేశ్వరస్వామిని సందర్శించుట ఉత్తమం. శివాభిశేకాలు తరచు చేయుట మంచిది.   

టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
sahiteevanam