Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Naa Paata 8 - Pedave Palikina Matallone - Nani movie

ఈ సంచికలో >> సినిమా >>

Happy Ugadi

తమన్‌కే ఛాన్సిచ్చిన చరణ్‌

charan offered to taman

రామ్‌చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రానున్న సినిమాకి సంగీత దర్శకుడిగా ‘కొలవెరి’ అనిరుధ్‌ని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అనిరుధ్‌ని పక్కన పెట్టి, తమన్‌ని సీన్‌లోకి తీసుకొచ్చారు. ఛాయిస్‌ చరణ్‌దా? లేదంటే దర్శకుడు శ్రీనువైట్ల ఈ మార్పు చేశాడా? అని చర్చించుకుంటున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలో. ‘వై దిస్‌ కొలవెరి కొలవెరి’ పాటతో ప్రపంచాన్ని ఊపేశాడు అనిరుధ్‌. అయితే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా స్టార్‌ డమ్‌ మాత్రం దక్కలేదు అతనికి. అనిరుధ్‌తో పోల్చితే తమన్‌కి తెలుగులో స్టార్‌ డమ్‌ ఉంది. అందుకనే రిస్క్‌ తీసుకోకుండా తమన్‌ని తీసుకున్నారని సమాచారమ్‌. రామ్‌చరణ్‌, శ్రీనువైట్ల సంయుక్తంగా తమన్‌ పేరుకి ఓటేయడంతో అనిరుధ్‌ ప్లేస్‌లో తమన్‌ వచ్చి చేరాడు. తమన్‌ ఇదివరకు చరణ్‌తో ‘నాయక్‌’ సినిమా చేశాడు. మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అయ్యింది ‘నాయక్‌’. కొన్ని ట్రాక్స్‌ రామ్‌చరణ్‌ సినిమా కోసం అనిరుధ్‌ రూపొందించాక, అవి చరణ్‌ స్టార్‌డమ్‌కి తగ్గట్టుగా లేకపోవడంతోనే ఈ మార్పు జరిగిందని ఓ వెర్షన్‌ విన్పిస్తుండగా, తమిళ సినిమాలతో బిజీగా ఉండడంతో చరణ్‌ సినిమాకి కంపోజిషన్స్‌ సరిగ్గా ఇవ్వలేక అనిరుధ్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తనంతట తానుగా తప్పుకున్నాడని ఇంకో వెర్షన్‌ వినిపిస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
kamal for all