Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
charan offered to taman

ఈ సంచికలో >> సినిమా >>

Happy Ugadi

అందరివాడు ఈ విశ్వనటుడు

kamal for all

విశ్వనటుడు గుర్తింపు చాలా అరుదైనది. ఆ అరుదైన గుర్తింపు పొందిన నటుడు కమల్‌హాసన్‌. ఏ సినిమా చేసినా వైవిధ్యం కోరుకునే నటుల్లో కమల్‌హాసన్‌ అందరికన్నా ముందుంటాడు. నిర్మాతగా, దర్శకుడిగానూ కమల్‌హాసన్‌ తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడు. దేశంలో ఆయన పేరు తెలియని సినీ అభిమాని లేరనడం అతిశయోక్తి కాదు. కమల్‌హాసన్‌ ఇప్పుడు ‘ఉత్తమవిలన్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళంలో రూపొందిన ‘ఉత్తమ విలన్‌’ తెలుగులో కూడా అదే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం  హైద్రాబాద్‌ వచ్చిన కమల్‌హాసన్‌, ఎలాంటి హంగామా లేకుండా సినిమా పబ్లిసిటీకి అన్నీ తానే అయి కష్టపడుతున్నాడు.
న్యూస్‌ ఛానల్స్‌లో ఇంటర్వ్యూలకు సైతం హాజరై సినిమా విశేషాలు చెబుతూ, సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపే ప్రయత్నం చేస్తున్న ఈ విశ్వ నటుడు, గతంలో వివాదాస్పదమైన ‘విశ్వరూపం’ సీక్వెల్‌ని కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పాడు. కెరీర్‌ మొదటి నుంచి ఇప్పటిదాకా ఏ సినిమానీ మర్చిపోని కమల్‌, ఎవరైనా అడగాలిగానీ ఒక్కో సినిమాకీ తానెంత కష్టపడిరదీ పూసగుచ్చినట్లు చెబుతాడు. పేరు ప్రఖ్యాతులు రావడం గొప్ప కాదు, ఎంత ఎదిగినా ఒదిగి వుండడం గొప్ప. ఆ విషయంలో కమల్‌ నేటితరం హీరోలకు ఆదర్శం.

మరిన్ని సినిమా కబుర్లు
is lion title   not belong to balayya ....