Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kamal for all

ఈ సంచికలో >> సినిమా >>

Happy Ugadi

‘లయన్‌’ టైటిల్‌ బాలయ్యది కాదా?

is lion title   not belong to balayya ....

బాలకృష్ణ హీరోగా ‘లయన్‌’ అనే సినిమా రానుంది. కానీ ఈలోగానే ‘లయన్‌’ టైటిల్‌ని ఇంకో దర్శకుడు అనౌన్స్‌ చేశాడు. ‘జె.డి.’ అనే దర్శకుడు రూపొందించనున్న సినిమా తాలూకు టైటిల్‌ని విడుదల చేశారు. తొమ్మిది నెలల క్రితమే ‘లయన్‌’ టైటిల్‌ని తాము రిజిస్టర్‌ చేయించినట్లు జెడి చెప్పారు. తెలుగు సినిమాకి టైటిల్స్‌ వివాదం కొత్త కాదు. కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాకి కూడా ఇలాంటి వివాదమే వచ్చింది. చేసేది లేక ‘కళ్యాణ్‌రామ్‌ కత్తి’గా దాని పేరు కొంచెం మార్చారు. పైన చిన్న అక్షరాలతో కళ్యాణ్‌రామ్‌ అని పెట్టి, పెద్ద అక్షరాలతో ‘కత్తి’ పెట్టడం ద్వారా వివాదం నుంచి తప్పించుకోగలిగారు. ఇలాంటి విచిత్రాలు తెలుగు సినిమా రంగంలోనే కాకుండా, ఇతర భాషల్లోనూ చోటుచేసుకుంటుంటాయి. బాలకృష్ణ సినిమాకి కూడా ‘లయన్‌’ అనే పేరు అలానే ఉంచి, దానికి బాలకృష్ణ అనో, నందమూరి అనో, ఇంకేదన్నానో పెట్టి వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి అవకాశం ఉందంటున్నారు సినీ ఇండస్ట్రీలో. ‘లయన్‌’గా బాలకృష్ణ సినిమాకి ప్రచారం ఇప్పటికే బాఆ లభించడం వల్ల పేరు మార్చేందుకు ఆస్కారం లేదు.

మరిన్ని సినిమా కబుర్లు
superb jyotika