Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

Happy Ugadi

ఇంటర్వ్యూ

interview

సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో క్రికెట్ ఆడా  - స‌యామీఖేర్‌

తెలుగింటికి మ‌రో హిందీపిల్లొచ్చింది. క‌థానాయిక‌గా!  ఆమె పేరే.. స‌యామీఖేర్‌.  ష‌బానా ఆజ్మీ మేన‌కోడ‌లు ఈ అమ్మాయి. అంతేనా.. అంటే - మంచి మోడ‌ల్ కూడా. వాణిజ్య సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిపోయే హొయ‌లున్నాయి. ర్యాంప్‌పై న‌డిస్తే.. కెవ్వు కేకే. హీరోయిన్ కావ‌డానికి ఇంత‌కంటే అర్హ‌త‌లేమున్నాయి. అందుకే వైవిఎస్ చౌద‌రి వెదికి వెదికి మ‌రీ ఈ అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేసేశారు. రేయ్‌తో త‌న టాలెంట్ ఏంటో చూపించ‌డానికి రెడీ అయిపోయింది స‌యామీ. వ‌చ్చేవారం రేయ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈసంద‌ర్భంగా స‌యామీ తో... చిట్ చాట్‌.

* హాయ్‌.. ఎలా ఉన్నారు?
- (న‌వ్వుతూ)  చాలా చాలా హ్యాపీగా...

* రేయ్‌.. రిలీజ్ అవుతోంద‌నా, ఇంత ఆనందం?
- య‌స్‌... చాలా కాలం నుంచి ఇలాంటి మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నా.ఇప్పుడు సినిమా వ‌చ్చేస్తోంది. మా క‌ష్టానికి త‌గిన ఫ‌లితం రాబోతోంది. ఇంక‌కంటే సంతోష‌క‌ర‌మైన ఘ‌డియ ఏముంటుంది?

*  మీరు న‌టించిన తొలి సినిమా ఆల‌స్య‌మైంద‌ని ఎప్పుడైనా బాధ ప‌డ్డారా?
-  కొన్ని సార్లు ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌వు. సినిమా రంగంలో ఇవ‌న్నీ మామూలే. తొలి సినిమాకే ఇలాంటి అనుభ‌వం ఎదురు కావ‌డం ఒక విధంగా నాకు మంచిదే. ఎందుకంటే భ‌విష్య‌త్తులో ఇలాంటి ప‌రిస్థితుల్ని తేలిగ్గా ఎదుర్కోగ‌ల‌ను.

* ఇంత‌కీ రేయ్‌లో మీ పాత్ర ఎలా సాగుతుంది?
- సాధార‌ణ‌మైన అమ్మాయినే. తాను అనుకొన్న‌ ల‌క్ష్యం సాధించ‌డం కోసం ఏం చేసింది ?  త‌న ల‌క్ష్యాన్ని, ప్రేమ‌ని ఎలా గెలుచుకొంది?  అనేదే క‌థ‌.

* సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో మీ కెమిస్ట్రీ ఎలా కుదిరింది?
- సాయి చాలా కూల్‌. ఎన‌ర్జిటిక్‌గా ఉంటాడు. సినిమా ఇద్ద‌రికీ కొత్తే. అయినా స‌రే... నాకంటే ఎంతో తెలిసివాడిలా క‌నిపించేవాడు. నాకు స‌ల‌హాలిచ్చేవాడు. న‌ట‌న అనేది కొత్త అని ఎప్పుడూ అనిపించ‌లేదు.

* సెట్లో ఇద్ద‌రూ అల్ల‌రి చేసేవాళ్ల‌ట‌..
- మా ఇద్ద‌రికీ షూటింగ్ లా అనిపించేది కాదు. క్లాస్ రూమ్‌కి వెళ్లి పాఠాలు వింటున్న‌ట్టే ఉండేది. చౌద‌రిగారు ఓ స్కూల్ టీచ‌ర్ లా క‌నిపించేవారు. క్లాస్ రూమ్ అంటే అల్ల‌రి చేయాలి క‌దా.. అందుకే మేం అల్ల‌రి చేసేవాళ్లం. విరామంలో నేనూ, సాయి క‌ల‌సి క్రికెట్ ఆడుకొనేవాళ్లం. అయితే..మా ప‌నిని మాత్రం సిన్సియ‌ర్ గానే చేశాం.

* రెండేళ్లు ఈ సినిమా కోసం ప‌నిచేశారు.. మ‌రి తెలుగు ఎందుకు నేర్చుకోలేదు.
- ముందు కొంచెం కొంచెం మాట్లాడేదాన్ని. అయితే మ‌ధ్య‌మ‌ధ్య‌లో విరామాలు ఎక్కువ‌గా వ‌చ్చాయి. ఈలోగా నేను ముంబై వెళ్లివ‌చ్చేదాన్ని. నేర్చుకొన్న తెలుగంతా.. మ‌ర్చిపోయేదాన్ని. కంటిన్యూగా రెండేళ్లు ఇక్క‌డే ఉంటే.. ఈపాటికి తెలుగు మాట్లాడేసేదాన్ని. మ‌రో సినిమా రానివ్వండి.. త‌ప్ప‌కుండా తెలుగులో మాట్లాడ‌తా.

* అంటే ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌రో తెలుగు సినిమాపై సంత‌కం చేయ‌లేదా?
- లేదు. అన్నీ.. రేయ్ వ‌చ్చాకే. ఎందుకంటే న‌టిగా నేనేం చేయ‌గ‌ల‌నో నాకు, ద‌ర్శ‌కుల‌కూ తెలియాలి. అలా తెలియాలంటే రేయ్ రావాలి.

* ఇంత‌కీ మీరేం చేయ‌గ‌ల‌రు అనుకొంటున్నారు?
- న‌టిగా ఎలాంటి పాత్ర‌కైనా న్యాయం చేయాలి. ఏ త‌ర‌హా పాత్ర వ‌చ్చినానేను న‌టించ‌డానికి సిద్ధ‌మే..

* గ్లామ‌ర్‌కు నో చెప్ప‌రు.. అంతే క‌దా..
- ఈత‌రం అమ్మాయిలు, అబ్బాయిల అభిరుచి తెలిసిన దాన్ని. వాళ్ల‌కేం కావాలో నాకు బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే నేనూ ఆ వ‌య‌సులోనే ఉన్నా క‌దా. నేను ఎలాంటి సినిమాల్ని చూడ్డానికి ఇష్ట‌ప‌డ‌తానో, అలాంటి సినిమాల్లో న‌టించ‌డానికి అభ్యంత‌రం ఏముంటుంది?

* మీ అభిమాన న‌టీన‌టులెవ‌రు?
- అమితాబ్‌బ‌చ్చ‌న్‌, ట‌బు

* తెలుగులో..?
- మెగా హీరోలంద‌రూ. ఈమ‌ధ్య నేను వాళ్ల సినిమాలే ఎక్కువ‌గా చూస్తున్నా.

* వాళ్ల‌తో క‌ల‌సి న‌టించే అవ‌కాశం వ‌స్తే..
- ఎట్టి ప‌రిస్థితుల‌లోనూ వ‌దులుకోను. కార‌ణం... మెగా హీరోలంద‌రి గురించి సాయి చాలా గొప్ప‌గా చెప్పాడు. నేనూ వాళ్ల సినిమాల్ని చూశాను. భాష అర్థం కాక‌పోయినా... వాళ్లంద‌రి అభిమానిగా మారిపోయాను.

* హైద‌రాబాద్ ఎలా ఉంది?
- సో స్వీట్‌. ఇక్క‌డి వాతావ‌ర‌ణం చాలా బాగుంది. బిరియానీ అయితే మ‌రీ మ‌రీ సూప‌ర్‌.

* హిందీలో సినిమాలేమైనా చేస్తున్నారా?
- మీర్జియా అనే చిత్రంలో న‌టించా. ఇంకొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌

మరిన్ని సినిమా కబుర్లు