Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Ugadi

యాత్ర

 

జరిగిన కథ : మొజార్ట్ లివింగ్ ప్లేస్ కి వెళ్ళి మొజార్ట్ వాయించిన గ్రేండ్ పియానో, రాసుకునే టేబులూ కుంచె ఇంకు బుడ్డీ స్వదస్తూరీతో ఉన్న సింఫనీ నోట్సూ, వాడిన బెడ్డూ, చెయిరూ బాత్ రూమూ లాంటి అతను జీవించిన పరిసరాలు చూస్తారు జీవన్ బృందం. అక్కణ్ణుంచి బయటకొచ్చి ట్రైన్ లో ఎక్కుతారు. మెషీన్లో డబ్బులు పెట్టి ఆడతారు....గోవిందు పెట్టిన డబ్బులు కాస్తా పోతాయి...... ఆ తరవాత.....

 

బస్టాండ్ కొచ్చి అడిగితే ఏగ్జమ్స్ బస్సు లేదట. టాక్సీని పిలుద్దాం అనుకునే లోపు ఒక డ్రగ్ ఎడిక్ట్ తగిలాడు. వాడు హోమో సెక్సువల్ కూడా.

టాక్సీ వచ్చింది.

ఎక్కడికెళ్ళాలో చెప్పి కూర్చున్నారు.

డ్రైవరు టర్కీ దేశం మనిషి. వాళ్ళ దేశం పాటలు పెట్టాడు.

ఘాట్ రోడ్డు దిగి ఊళ్ళో కొచ్చారు.

హోటలు కొచ్చే సరికి పదిన్నరయిపోయింది.

అంతా ఎవరి రూముల్లోకి వాళ్ళెళ్ళిపోయారు.

భోజనాల హాల్లోకి వెళ్ళే సరికి తాగుతూ కనిపించాడు ప్రొడ్యూసర్ సలీం భాయ్.

వర్కెలా జరుగుతుంది అనడిగేడు జీవన్. “బాగుంది భాయ్, నా పని హిల్టన్ హోటల్లో పెట్టిన హీరో సందేశ్ ని చూసుకోవడమే గదా...! అయినా జార్జి ప్రసాదు ఉండగా నాకేంటి బెంగ చెప్పు. ఆరు హోటల్సున్నాయి. ఓల్డ్ సిటీలో మదినా హోటలు ఎదురుగా ఉన్న హోటలు మనదే” అన్నాడు.

“పేరేంటి..?”

“హోటల్ షహనాజ్”

“షహనాజ్..!”

“అవును... నా చెల్లెలి పేరు. తన పేరు తో ఏ బిజినెస్ పెట్టినా అది లాభం తెస్తూ ఉంటుంది. నా చెల్లెలికి సంబంధించి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మీకు బోర్ అనిపించకపోతే చెబుతాను” అన్నాడు సలీం.

“లేదు చెప్పండి” అన్నాడు జీవన్ షహనాజ్ గురించి తెలుసుకోవచ్చునన్న కుతూహలంతో.

“షహనాజ్ కి అప్పుడు పదేళ్ళుంటాయి అనుకుంటాను. హోటల్ కోసమని పెయింటింగ్స్ కొనడానికి కనావంచన్ తో ఇంద్ర అనే ఆర్టిస్ట్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుంటే వెళ్ళాను. నాతో పాటు షహనాజ్ కూడా వచ్చింది. తనకి ఓ పెయింటింగ్ ఎంతగానో నచ్చింది. పొడవాటి కోటు, షూస్ వేసుకున్న పదేళ్ళ కుర్రాడు రైల్వే స్టేషన్ లో బెంచీ మీద కూర్చొని కళ్ళ గంతలు కట్టుకుని వయోలిన్ వాయిస్తున్నాడు. పక్కనే బెంచి మీద పండుటాకులు రాలి ఉన్నాయి. ఆ ఆకుల మీద బొద్దుగా నల్లగా వున్న కుక్క పిల్ల ముందరి కాళ్ల మీద తల పెట్టి మగతగా కళ్ళు మూసుకుని వింటూంది.

ఆ పెయింటింగ్ కొనిచ్చాను. అంతటితో ఊరుకోలేదు. ఆ పెయింటింగ్ లో వున్న వయోలిన్, బొద్దుగా వున్న నల్లటి కుక్క పిల్ల కావాలని మంకు పట్టు పట్టింది. వయోలిన్ అయితే వెంటనే కొనిచ్చాను. నలటి కుక్క పిల్ల కోసం నానా తంటాలు పడాల్సి వచ్చింది.

నా చెల్లెలు కోరితే కొండ మీదున్న కోతి నైనా తెచ్చిస్తాను” అన్నాడు. “పెద్దయ్యాక వయోలిన్ నేర్చుకుంటానంది, నేర్పించాను. ఎక్కడికెళ్ళినా తనతో పాటు వయోలిన్ కూడా వుండాల్సిందే. అదంటే దానికంత ప్రాణం” అని చెపుతుంటే తన వాయులీనంతో షహనాజ్ మా ముందు ప్రత్యక్షమైనట్టు అనిపించింది జీవన్ కి.

అక్టోబర్ – 7

తన రూమ్ బాల్కనీలో కొచ్చి చూస్తుంది షహనాజ్. అవతల రెండు ఇళ్ళు తగలబడి పోతున్నాయి. మొత్తం ఏగ్జమ్స్ లో జనం అంతా అక్కడే ఉన్నారు. ఫైర్ ఇంజన్లూ వచ్చాయి కానీ, అక్కడ ఇళ్ళకి సగానికి పైగా కలప వాడతారేమో ఓ పట్టాన ఆరడం లేదు మంటలు. యోగి, వంట మనిషి రామూ, వాడి అసిస్టెంట్లు మంటల దగ్గర కెళ్లారు.

రూమ్ లోపల కొచ్చే సరికి ఫోన్ మోగుతూ.... షహనాజ్

“పాపం వాళ్ళని చూసి రాలేకపోయారా...?” అంది

“చూసి ఏం చేస్తాం.... అయినా మీరు పాపం అనక్కర్లేదు. వాళ్ళకి అన్నిటికీ ఇన్సూరెన్స్ లు ఉన్నాయట” అన్నాడు జీవన్.

“సాల్స్ బర్గ్ వెళ్ళారట మొజార్ట్ స్టాచ్యూ చూసేరా నిజంగా ప్రాణం ఉన్నట్టుంటుంది గదా...?” అంది.

“చూళ్ళేదే, అయినా మీకెలా తెల్సు...?” అన్నాడు జీవన్.

“మా అంకుల్ తో పాటు వెళ్ళాను. వారం పాటు అక్కడే స్టే చేశాం. మొజార్ట్ పేరున్న వస్తువులన్నీ కొన్నాను. గెట్రియడిగేస్సేలో ఉన్న మొజార్ట్ బర్త్ ప్లేస్ చూశారా...?” అంది.

“చూశాం, చాలా ఇరుకు సందు అది” అన్నాడు జీవన్.

నవ్వేసిన షహనాజ్ “యూరప్ మొత్తం చాలా ఫేమస్ స్ట్రీట్ అది. సాల్స్ బర్గ్ వచ్చిన వాళ్ళెవరన్నా సరే కనీసం ఒక్కసారన్నా ఆ ఇరుకు వీధిలో నడిచి వస్తారు. ఆ వీధిలో ఇళ్ళన్నీ మూడు వందల ఏళ్ళ నాటివి” అంది.

“మొజార్ట్ మత్తు ఇంతట్లో వదలదు నన్ను. అతని గురించి ఇంకా చెప్పండి” అన్నాడు జీవన్.

“27 జనవరి 1756 లో సాల్స్ బర్గ్ లో పుట్టిన మొజార్ట్ డిసెంబర్ 1791 న ఆ వర్షం రోజు వియన్నాలో చనిపోయాడు. చాలా తక్కువ కాలం బతికిన ఇతను ఆరువందల వర్క్స్ చేశాడు.

అతను హృదయం లోతుల్లోకెళ్ళి రాసిన సింఫనీ కె.516 (జి.మైనర్). ప్రపంచమంతా పాపులర్ అయిన సింఫనీ కె.515(సి). ఆఖరి నాలుగు సింఫనీలూ 38(డి), 39(ఇ ఫ్లాట్), 40(జి.మైనర్), 41(సి) నాలుగో ఏటే కళ్ళకి గంతలు కట్టి మీరు చూసొచ్చిన పియానో ముందు కూర్చోబెడితే అద్భుతంగా వాయించేడు. అలాగే పెద్దయ్యాకా కాలి వేళ్ళతో వాయించిన ఘనుడు మొజార్ట్” అని ముగించింది షహనాజ్.

“మీరూ మాతో వస్తే చాలా బాగుండేది” అన్నాడు జీవన్.

“మీరెవరూ నన్ను పిలవలేదుగా..!” నవ్వుతూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.

వాళ్ళింటికి ఫోన్ చేసొచ్చిన యోగి డల్ గా పడుకుని ఎప్పుడూ లేంది సాయిబాబా పాటలు పెట్టుకుని వింటున్నాడు. కాస్సేపు గడిచాక తనే “మా ఇంటికి ఫోన్ చేసేను సార్. రికార్డింగులన్నీ పెండింగ్ లో పడిపోయినియ్యి. ప్రొడ్యూసర్లు ఒకటే గొడవ చేస్తున్నారట” అన్నాడు.“చాలా విషయాల్తో పాటు ఇలాంటి విషయాలు కూడా మాటాడ్డం సరిగా రాదు నాకు. నాకు తోచినవేవో మాటాడేను” అని కాస్సేపటికి తనే లేచి టేబుల్ ని తన మంచం మీదికి లాక్కుని దాని మీద వాయిస్తూ పాడ్డం మొదలెట్టాడు.

చాలా అనందించేడు జీవన్. కొన్ని పల్లవులకి సెకండ్ హాఫ్ లూ, ముక్తాయింపులూ సజెస్ట్ చేసేడు. మొత్తం మీద ఎనిమిది పల్లవులు చేసి బట్టలు మార్చుకుని బయటికెళ్ళినవాడు రాత్రి పదయినా రాకపోయే సరికి బయటికెళ్ళి చూశాడు జీవన్. విగ్గుతో భోజనం చేస్తూ కనిపించిన జార్జి ప్రసాదు, జాస్తి చౌదరితో “కేసినో కెళ్ళేడు యోగి” అని అన్నాడు.

అర్థరాత్రెప్పుడో వచ్చి జీవన్ని నిద్రలేపిన యోగి “కేసినోలో వెయ్యి డాలర్లు వచ్చాయి” అని చెప్పేడు.

“మళ్ళీ తిరిగి ఎంత పోగొట్టుకున్నావ్..?” అంటే అది చెప్పలేదు.

“మీకేదన్నా మంచి గిఫ్ట్ కొనాలనుకున్నాను” అంటుండగా దబ దబా తలుపు మోగింది. వెళ్ళి తెరిస్తే కో – డైరెక్టర్ గంగరాజు. నైటీలో ఉన్నాడు. మందు బాగా పడిందేమో సరాసరి వచ్చి కార్పెట్ మీద చతికిలబడ్డాడు.

“ఈ నైటీ ఎవరిచ్చేరు...?” అంటే, “మన హీరోయిన్ సార్, ఇక్కడ కొనడంతో డస్ట్ బిన్ లో పారేద్దాం అనుకుందట. అడిగితే నాకిచ్చింది” అన్నాడు.

“మందెవరిచ్చేరు..?”

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti