Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

నటుడిగా ఫెయిలవని నాని

nani never failed as actor

రెండు సినిమాలు వెంట వెంటనే వచ్చినా ఏ సినిమా కూడా హీరో నానిని నిరాశపర్చలేదు. ఎప్పటినుంచో విడుదలకు నోచుకోని ‘జెండాపై కపిరాజు’, విభిన్న కథాంశంతో రూపొందిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలు వెంట వెంటనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా విభిన్న కథాంశంగా ప్రేక్షకుల మన్నన పొందితే, ‘జెండాపై కపిరాజు’ సినిమా నానిలోని నటుడికి ప్రశంసలు తెచ్చిపెట్టింది. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా నాని సినిమాలు కొన్ని విజయవంతం కాలేదేమోగానీ నటుడిగా అతను ఒక్కో సినిమాకీ ఒక్కో మెట్టు పైకెక్కుతూనే ఉన్నాడు. నటుడిగా పూర్తి స్థాయిలో మెచ్యూరిటీని ప్రదర్శిస్తున్నా, ఇంకా ఏదో సాధించాలన్న అతనిలోని తపనకు హేట్సాఫ్‌ అనాల్సిందే ఎవరైనా. విజయం, పరాజయం అనేవాటి గురించి ఆలోచించకుండా కొత్త దనం గురించి మాత్రమే ఆలోచించడమే తన సక్సెస్‌ సీక్రెట్‌ అంటాడు నాని. ఈ తరం యువ నటుల్లో నానికి అందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అందరితోనూ స్నేహంగా మెలిగే నానికి, మిగతా హీరోల అభిమానులనుంచీ మద్దతు లభిస్తుంది అందుకే. నాని ఈజ్‌ వెరీ వెరీ స్పెషల్‌.

మరిన్ని సినిమా కబుర్లు
crosed limits cinema politics