Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
telugu girl in thriller movie

ఈ సంచికలో >> సినిమా >>

హోమం అరిష్టాలను అడ్డుకోవాలి

homam will prevent

తెలుగు సినిమా పరిశ్రమకు ఏదో అరిష్టం పట్టుకుందని భావించి, అమృత పాశుపత మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఫిలిం నగర్‌ దైవ సన్నిధానంలో మూడు రోజులపాటు ఈ హోమం ఘనంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా మహోన్నత కార్యక్రమానికి హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించబడిరది.గత కొన్ని నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ పలువురు ప్రముఖుల్ని కోల్పోయింది. వృద్ధాప్యంతో కొందరు మరణించగా, ఇంకొందరు అకాల మరణం చెందారు. వరుసగా చోటు చేసుకుంటున్న మరణాలతో తెలుగు సినీ పరిశ్రమలో గంభీరమైన వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎలాంటి చేదు వార్త వినవలసి వస్తుందోనని ఆందోళన చెందిన తెలుగు సినిమా పరిశ్రమ, ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మహా మృత్యుంజయ హోమాన్ని నిర్వహించింది.
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, కోలుకుంటున్న సీనియర్‌ నటుడు ఈ మహా మృత్యుంజయ హోమానికి హాజరై, ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా వుందని ఉద్వేగానికి లోనవుతూ మాట్లాడారు. ఈ హోమం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పట్టిన అరిష్టం తొలగిపోవాలని పలువురు సినీ ప్రముఖులు అన్నారు. ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్‌ నేతృత్వంలో ఈ హోమం జరిగింది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam