Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review : Jil

ఈ సంచికలో >> సినిమా >>

ముద్దులు పెట్టుకొంటే త‌ప్పేముంది? - రాశి ఖ‌న్నా

interview with rashi khanna

మ‌దిలోని ఊహ‌లకూ జోరు తెప్పించే అందం... రాశీఖ‌న్నాది. ఆ అందంతోనే కుర్ర‌కారుని ప‌డేసింది. హీరోల దృష్టిలో ప‌డింది. ద‌ర్శ‌కుల‌ను త‌న వెంట తిప్పించుకొంటోంది. ఇప్పుడు జిల్ చూపించ‌డానికీ రెడీ అంటోంది. టాలీవుడ్‌లో దూసుకొస్తున్న న‌వ‌త‌రం క‌థానాయిక‌ల జాబితాలో రాశీ పేరు కూడా చేరిపోయింది. రెండు మూడు హిట్లు ప‌డితే... ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ని దాటేసే స‌త్తా కూడా ఉంది. ఇప్పుడు ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్‌ సినిమాలో న‌టిస్తోంది. ``నా కెరీర్ ప్రారంభంలోనే నాకు మంచి అవ‌కాశాలు ద‌క్క‌డం నా అదృష్టం. అయితే నాలో ఉన్న టాలెంట్ పూర్తిగా చూపించే అవ‌కాశం మాత్రం ద‌క్క‌లేదు. త్వ‌ర‌లోనే నా ప్ర‌తిభ చూపిస్తా`` అంటోంది రాశీ. ఆమె గోపీచంద్‌తో న‌టించిన జిల్ ఈరోజు (మార్చి 27న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా రాశీఖ‌న్నాతో గో.తెలుగు సంభాష‌ణం

* హాయ్‌.. రాశీ. ఎలా ఉన్నారు..?

- (న‌వ్వుతూ)  ఫైన్‌.

* చేతి నిండా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారా?
-  మ‌రీ అంత బిజీ కాదులెలండి. ఒక‌వైపు జిల్‌, మ‌రో వైపు బెంగాల్ టైగ‌ర్‌.. గ‌త మూడు నెల‌లుగా నా దృష్టంతా ఈ రెండు సినిమాల‌పైనే.

* చాలా త‌క్కువ స‌మ‌యంలోనే పెద్ద హీరోల దృష్టిలో ప‌డ్డారు..
- అవును.. ఇదంతా నా అదృష్ట‌మే. ఊహ‌లుగుస‌గుస‌లాడే చిత్రానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ సినిమా వ‌ల్లే క‌దా.. ఇన్ని అవ‌కాశాలు త‌లుపుత‌డుతున్నాయి.

* సినిమా సినిమాకీ గ్లామ‌ర్ పెంచుతున్న‌ట్టున్నారు..?
- (న‌వ్వుతూ) నాకు దక్కుతున్న పాత్ర‌లు అలా ఉన్నాయ్‌. తొలి సినిమాలోనూ అందంగానే క‌నిపించా క‌దా. ఆ త‌ర‌వాత జోరులో నా పాత్ర మ‌రింత రొమాంటిక్‌గా ఉంటుంది. జిల్ అయితే... ఇది వ‌ర‌క‌టి సినిమాల‌కంటే అందంగా గ్లామ‌ర్‌గాక‌నిపిస్తా. ఎందుకంటే.. నా పాత్ర స్వ‌భావ‌మే అలాంటిది.

* ఇంత‌కీ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారేంటి?
- ఇందులో నా పాత్ర పేరు సావిత్రి.  ఫ్యాష‌న్ డిజైన‌ర్‌ని...

* పేరుకీ పాత్ర‌కీ ఏమైనా సంబంధం ఉందా?
- అదే మ‌రి ఈ పాత్ర‌లోని విచిత్రం. కొన్నిసార్లు పేరుకి త‌గ్గ‌ట్టు సంప్ర‌దాయ‌బ‌ద్దంగా క‌నిపిస్తా. మ‌రికొన్ని సార్లు ఆధునిక దుస్తులతో మెరుస్తా. 
న‌న్ను రెండుక‌రాలుగానూ చూడొచ్చు. దాంతో పాటు నా బాడీ లాంగ్వేజ్ కూడా కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంది.

* ఎంగిలి ముద్దులూ కాస్త ఎక్కువ‌గానే పెట్టుకొన్న‌ట్టున్నారు?
- ఆ ముద్దుల‌కు మీరు ఎన్ని పేర్లు పెట్టుకొన్నా ఫ‌ర్లేదు గానీ.. మ‌రీ మీర‌నుకొన్నంత ఘాటైన ముద్దులు కావు. పెద‌వీ పెదవీ ట‌చ్ అవుతాయ‌నంతే. క‌థ‌లో రొమాన్స్‌కీ కాస్త చోటుంది. అందుకే ముద్దుల‌కు ప్రాధాన్యం ఇచ్చాం.

* ఇలాంటి స్నివేశాల్లో న‌టించేట‌ప్పుడు ఇబ్బంది క‌ల‌గ‌లేదా?
- ఏదైనా స‌రే.. స్న‌నివేశానికి అనుగుణంగానే న‌టించాలి. ముద్దుల్ని ప్ర‌త్యేకంగానో, అదేదో నేరంగానో చూడాల్సిన ప‌నిలేదు. ప్రేమ‌క‌థంటే ఇవ‌న్నీ స‌హ‌జ‌మే క‌దా....??  ఈ సినిమాలో ఇంకా చాలా చాలా విష‌యాలున్నాయి. వాటి గురించి మాట్లాడుకొందాం..మ‌నం ముద్దుల ద‌గ్గ‌రే ఆగిపోతున్నాం ఎందుకు?

* ఇంత‌కీ గోపీచంద్‌తో క‌ల‌సి న‌టించ‌డం ఎలా అనిపించింది?
- త‌ను చాలా కూల్‌. సెట్లో త‌న ప‌నేదో త‌న‌దే. సినిమా బాగా రావాల‌ని త‌ప‌న ప‌డుతుంటారు. స‌హ‌నం చాలా ఎక్కువ‌. అన్నింటికంటే మంచి మ‌నిషి.

* బెంగాల్ టైగ‌ర్‌లో రెండో క‌థానాయిక‌గా క‌నిపిస్తున్నారు.. మీకు ఎలాంటి పాత్ర‌లైనా ఓకేనా?
- ఓ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌లుంటే త‌ప్పేంటి?  అందులో నా స్థానం ఏమిటనేది నేను ఆలోచించ‌ను. పైగా నాతో పాటు న‌టిస్తోంది ఎవ‌ర‌నుకొన్నారు... త‌మ‌న్నా. త‌మ‌న్నా కంటే నేను చాలా జూనియ‌ర్‌ని కాబ‌ట్టి రెండో నాయిక అనిపించుకోవ‌డంలోనూ త‌ప్పేం లేదు.

* అఖిల్ సినిమాలో ప్ర‌త్యేక‌గీతంలో న‌టిస్తున్న‌ట్టు వార్త‌లొచ్చాయి..
- అదేం నిజం కాదు. నాకెలాంటి ఆఫ‌ర్లూ రాలేదు.

* వ‌స్తే చేస్తారా?
- ప్ర‌త్యేక గీతాల ప‌ట్ల నాకేం ప్ర‌త్యేక‌మైన కండీష‌న్లు లేవు. న‌చ్చితే చేస్తా, లేదంటే లేదు. ఎప్ప‌టికైనా అలాంటి పాట‌ల్లో మెర‌వ‌డానికి రెడీనే. కానీ ఇప్పుడు మాత్రం కాదు. కొంత టైమ్ తీసుకొంటా.

* తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. డ‌బ్బింగ్ చెప్పుకోవ‌చ్చు క‌దా?
- నా తెలుగు కొంచెం కొంచెం మెరుగు అవుతోంది. డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌నే ఉంది. కానీ... ఇంకా ప‌రిపూర్ణంగా ఈ భాష నేర్చుకోవాల‌నుకొంటున్నా. ఎందుకంటే తెలుగు భాష‌పై రోజు రోజుకీ ప్రేమ పెరుగుతోంది. చాలా మ‌ధుర‌మైన భాష ఇది. పూర్తిగా నేర్చుకొని డ‌బ్బింగ్ చెబితే బాగుంటుంద‌నుకొంటున్నా.

* నిజ జీవితంలో రాశీ ఎలా ఉంటుంది?
- తెర‌పై క‌నిపించేంత అల్ల‌రి అమ్మాయిని కాను. చాలా మెత‌క‌. ఎక్కువ‌గా మాట్లాడ‌ను. నా ప‌నేదో నాదే. పెద్ద‌లంకే నాకు గౌర‌వం.. భ‌యం. అయితే ఇవేం నా పాత్ర‌ల్లో క‌నిపించ‌వు. ఏ పాత్ర ఇచ్చినా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డ‌మే క‌దా... నా బాధ్య‌త‌.

* జిల్ గురించి ప్రేక్ష‌కుల‌కు ఏం చెబుతారు?
- చాలా చాలా మంచి సినిమా ఇది. మీకేం కావాలో అన్నీ ఇందులో ఉంటాయి. యాక్ష‌న్‌, ల‌వ్‌, కామెడీ అన్నీ క‌ల‌బోసిన విందు భోజ‌నం. త‌ప్ప‌కుండా థియేట‌ర్ల‌కు వెళ్లి చూడండి.

కాత్యాయిని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka