Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Naa Paata 9 - Aakasam ammai aithe - Gabbar Singh

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - జిల్‌

Movie Review : Jil

చిత్రం: జిల్‌
తారాగణం: గోపీచంద్‌, రాశి ఖన్నా, ఊర్వశి, చలపతిరావు, శ్రీనివాస్‌ అవసరాల, పోసాని కృష్ణమురళి తదితరులు
చాయాగ్రహణం: శక్తి శరవణన్‌
సంగీతం: గిబ్రాన్‌
నిర్మాణం: యువి క్రియేషన్స్‌
దర్శకత్వం: రాధాకృష్ణకుమార్‌
నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి
విడుదల తేదీ: 27 మార్చి 2015

క్లుప్తంగా చెప్పాలంటే:
ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే జై (గోపీచంద్‌)కి తల్లిదండ్రులు వుండరు. పిన్ని, బాబాయ్‌లతో కలిసి హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటాడు. అనుకోకుండా జై, సావిత్రి (రాశి ఖన్నా)కి దగ్గరవుతాడు. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. ఓ సందర్భంలో రంగనాథ్‌ (బ్రహ్మాజీ)ని ప్రమాదం నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తాడు జై. కానీ రంగనాథ్‌ చనిపోతాడు. రంగనాథ్‌ని వెతుక్కుంటూ వచ్చిన మాఫియా డాన్‌ ఛోటా నాయక్‌, ‘జై’ వెంట పడతాడు. చనిపోతూ తనకు రంగనాథ్‌ ఇచ్చిన ఓ కోటు వల్లనే, మాఫియా తన వెంట పడుతుందని జై తెలుసుకుంటాడు. ఆ కోటులో ఏముంది? మాఫియాని జై ఎలా అడ్డుకుంటాడు? అనే అంశాలు తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే:
‘లౌక్యం’ సినిమాతో గోపీచంద్‌ బాగా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత ఇంకా మారిపోయాడని ‘జిల్‌’ చూస్తే అర్థమవుతుంది. గోపీచంద్‌ సినిమా అంటే గతంలో లౌడ్‌ డౌలాగ్స్‌. ఊర మాస్‌ ఎలిమెంట్స్‌. అవేవీ లౌక్యంలో కనిపించలేదు. అంతకన్నా కూల్‌ అండ్‌ క్లాస్‌ లుక్‌ ‘జిల్‌’లో గోపీచంద్‌ ఆపాదించుకున్నాడు. యాక్టింగ్‌, డైలాగ్‌ డిక్షన్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ ఇలా అన్నిటిలోనూ ‘మార్పు’ చూపించి ఆకట్టుకన్నాడు గోపీచంద్‌. సినిమాకి అన్నీ తానే అయి నడిపించిన గోపీచంద్‌ని చూసి స్టైల్‌ ఐకాన్‌ అనకుండా ఉండలేం.

రాశి ఖన్నా తొలి సినిమాలో బొద్దుగా, ముద్దుగా కనిపించింది. ఈ సినిమాలో అవసరమైన మేరకు క్లాస్‌గా కనిపిస్తూనే, స్టైల్‌గా గ్లామరస్‌ కాస్ట్యూమ్స్‌లో కుర్రకారులో వేడి పుట్టించింది. నటనతోనూ ఆకట్టుకుంది. సినిమాకి రాశి ఖన్నా గ్లామర్‌ అదనపు ఆకర్షణ అనడం నిస్సందేహం. విలన్‌ పాత్రలో కొత్త నటుడు స్టైల్‌గానే విలనిజం పండించాడు. నటన ఓకే. పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను కామెడీతో నవ్వించారు. ఊర్వశి షరా మామూలే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర ఓకే అనిపిస్తారు.

కథ కొత్తదేమీ కాదుగానీ, స్క్రీన్‌ప్లేతో మార్కులు కొట్టేశాడు డైరెక్టర్‌. ఎంటర్‌టైనింగ్‌గా, స్టయిలిష్‌గా చెప్పాలనుకున్న విషయం చెప్పాడు. ఎడిటింగ్‌ ఓకే. డైలాగ్స్‌ బాగున్నాయి. పాటలు బాగున్నాయి. తెరపై చూడ్డానికి ఇంకా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ సినిమాకి స్ట్రెంగ్త్‌. సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. సినిమా రిచ్‌గా వచ్చిందంటే ఆ క్రెడిట్‌ సినిమాటోగ్రాఫర్‌దే. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ సినిమాకి అవసరమైన స్టైల్‌ లుక్‌ని తీసుకురావడానికి ఉపయోగపడ్డాయి.

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. సెకెండాఫ్‌లోనూ దర్శకుడు జాగ్రత్తగానే డీల్‌ చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌ అన్నీ సమపాళ్ళలో మిక్స్‌ చెయ్యగలిగాడు దర్శకుడు. తడబాటు లేకుండా స్టైలిష్‌గా సినిమాని తెరకెక్కించడంతో ఆడియన్స్‌కి ఎక్కడా బోర్‌ కొట్టదు. యూత్‌ మెచ్చే ఎలిమెంట్స్‌తోపాటు, ఎంటర్‌టైనింగ్‌ కంటెంట్‌ వుండటంతో అన్ని వర్గాల ఆడియన్స్‌ మెప్పూ ఈ సినిమా పొందేందుకు అవకాశముంది.

ఒక్క మాటలో చెప్పాలంటే: స్టయిలిష్‌గా జిల్‌ మనిపించారు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with rashi khanna