Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattistE koti

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ : మొజార్ట్ ప్లేస్ నుంచి తిరిగి వచ్చిన జీవన్ కి ప్రొడ్యూసర్ సలీం కనిపిస్తాడు...తన చెల్లెలు వల్ల తనకెలా కలిసొచ్చిందీ వివరిస్తాడు......ఆ తర్వాత....

“నాగరా ఆపరేటరూ, కెమెరా అసిస్టెంటూ తాగుతుంటే వాళ్ళ మధ్యకి దూరేను. సార్... సార్ ఇప్పుడు నేనో పని మీద వచ్చేను” అన్నాడు.“ఏంటి..?” అన్నాడు యోగి.“కేసినో లో మీకు వెయ్యి యూరోలు వచ్చినియంట యూనిట్లో అప్పుడే చెప్పేసుకుంటున్నారు.... మీకొచ్చిన దాంట్లో నాకో యాభై యూరోలు ఇవ్వండి సార్. రెండు డ్రస్సులు కొనుక్కుంటాను” అన్నాడు.

“ప్రొడ్యూసర్ని అడగవయ్యా”

“అడగడానికి నా ఎకౌంట్లో బేలన్స్ లేదు సార్. లాస్ట్ సినిమా అప్పుడే ఈ సినిమా ఎమౌంటు కూడా మొత్తం లాగేసేను” అన్నాడు.

“చాలా సంతోషం రేపు కలు”

చాలా థాంక్స్ సార్. గుడ్ నైట్ సార్ అని నడుచుకుంటూ వెళ్తున్న గంగరాజులో ఈ వారం నించీ ఆడోళ్ళ బట్టలు వేసుకీవడం వల్ల నడకలో మార్పొచ్చింది. ఆడారితనం బాగా కనిపిస్తుంది.

ఆరోజు మధ్యాహ్నం దాకా చాలా ట్యూన్స్ కంపోజ్ చేసాడు యోగి. మధ్యలో షహనాజ్ మలయమారుతం రాగం లో ఒక పాట చెయ్యండి అనే సరికి ఆ రాగం తెలీదన్నాడు యోగి. ఎసెండింగ్, డిసెండింగ్ చెప్పింది.

ఎడం చెవికి రింగ్ కుట్టించుకున్న వంట కుర్రోడు రాము ఒంటి గంటన్నరకి వచ్చెయ్యండి సార్ లంచ్ కి అని పోన్ చేశాడు.

“కుదరదు రెండున్నరకి వస్తాం. ఎందుకని అడగవేం...?” అన్నాడు యోగి.

“ఎందుకు సార్..?” అన్నాడు రాము.

“చలి చాలా ఎక్కువగా ఉంది మేం కోనియాక్ వేస్తున్నాం” అన్నాడు యోగి.

“కాస్త తొరగా రావడానికి ట్రై చెయ్యండి సార్. ఇవ్వాళ్ళ తెల్లవారు ఝాము మూడింటికి లేపేశారు వేణుగారు. కాస్సేపు పడుకుంటాను” అన్నాడు.

“అలాగేలే” అని ఫోన్ డిస్కనెక్ట్ చేసిన యోగి “సార్ పెట్రోల్ బంక్ దాటాకా చాలా పెద్ద సూపర్ మార్కెట్ చూశాను నిన్న బస్సులో వెళ్తా” అన్నాడు.

“అవును యోగి నేనూ చూశాను” అన్నాడు జీవన్.

“దాంట్లో కెళదాం ఇవ్వాళ” అన్నాడు.

“అలాగే” అన్నాడు జీవన్.

భోంచేశాకా నడుచుకుంటూ ఆ పక్కకి వెళ్తూ దార్లో పక్క పక్కనే ఉన్న రెండు స్పోర్ట్స్ షాపుల్లో కెళ్ళారు. భర్త ఒకటి భార్య ఒకటీ నడుపుతున్నారు.

చదరంగం బల్ల అడిగాడు వాళ్ళని.

అర్థంగాక రెండు షోల్టర్లూ ఎగరేశారు వాళ్ళు.

తొమ్మిది డాలర్లకి ఒక బనియన్ కొని బేంక్ కార్డ్ ఇచ్చాడు.

పని చెయ్యలేదా కార్డు. కేష్ పే చేస్తుండగా రెండు పచ్చటి జర్కిన్ లు కనిపించాయి. ఒకోదాని రేటూ మూడు వందల యూరోలు. “అమ్మో మనం కొనలేం” అనుకుని వచ్చేస్తుంతే ఒక పచ్చ జర్కిన్ కనిపించింది. రేటు కేవలం ఎనిమిది యూరోలు మాత్రమే.

చాలా చీప్ అనుకుని రెండు కొనేసి అక్కడే వేసుకున్నారు.

అక్కడ్నించి కిలోమీటరు అవతలున్న సూపర్ మార్కెట్ వేపుకి వెళ్తుంతే అంతా వీళ్ళకేసి చూసి నవ్వుకుంటున్నారు. అర్థం కాలేదు వీళ్ళకి.సూపర్ మార్కెట్లో ఒక ట్రాలీ తీసుకుని రకరకాల వస్తువులు అందులో వేసుకుని ట్రాలీని ముందుకు తోసుకుంటూ వెళ్తున్న వీళ్ళని చూసిన ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నారు. అర్థం గావటం లేదు.

కొన్న మొత్తం సామాన్లకి ఏభై తొమ్మిది యూరోలు అయ్యింది.

యోగి క్రెడిట్ కార్డు అక్కడ పని చేసింది.

తిరిగి వస్తున్నారు.

సామన్లని రెండు పోలీతిన్ బేగ్స్ లో మోసుకొస్తుంటే వాళ్ళకెదురైన జనంలో కొందరు నవ్వులు.

హోటలు దగ్గరికొచ్చాక తెల్సింది వాళ్ళు నవ్వడానికి కారణం ఏంటంటే... వాళ్ళిద్దరూ వేసుకున్న ఆ ఆలివ్ గ్రీన్ జర్కిన్సు. ఆ దేశంలో పాకీ పని చేసేవాళ్ళు ఆ పని చేసేటప్పుడు మాత్రం వేసుకుంటారంట.

కోపమొచ్చిన యోగి ఆ జర్కిన్ విప్పి గదిలో మూల పారేసి “ఇది మా కారు డ్రైవర్ క్కూడా ఇవ్వను” అన్నాడు.

మధ్యాహ్నం షహనాజ్ కోసం ఫోన్ చేస్తే సలీం భాయ్ వచ్చి లొకేషన్ కి తీసుకెళ్ళాడని తెల్సింది. ఆమె అన్ని రోజులలా రూమ్ లో ఉండిపోవడం చాలా గొప్ప అనిపించింది. అప్పుడప్పుడూ వీళ్ళతో క్లోజ్ గా ఉండేది కానీ, ఎక్కువగా రూమ్ లో ఒక్కత్తే వుండేది. కళ్ళల్లో దిగుడు బావిలోని శూన్యం, నిశ్శబ్ధం కనిపించేవి. వయోలిన్ తో ఎక్కువగా కాలక్షేపం చేసేది.

ఆ అమ్మాయి హృదయంలో అంతు పట్టని రహస్యమేదో వుంది. తెలుసుకోవాలని వుంది జీవన్ కి. కానీ, ధైర్యం చాలడం లేదు. మధ్యాహ్నం నిద్ర లేచాకా కొన్ని ట్యూన్లు చేసేడు యోగి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika