Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Clots in Heart Vessels | C.A.D | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిపథం - పులివర్తి కృష్ణమూర్తి

 

దేమునితో బేరసారాలా?

మానవుడై పుట్టాక సుఖాలతో బాటు గా కష్టాలనూ అనుభవించాల్సి వస్తుంది. అయితే కష్టాలు రాగానే మన భగవంతుడినే గుర్తు చేసుకుంటాం. కొందరు కష్టాలు తెచ్చిపెట్టాడని దేముణ్ణి నిందించితే, మరికొందరు ఈ కష్టాల నుండి గట్టెకించమని కోరుకుంటారు. ఇక్కడ దేవుడితో బేరసారాలు ప్రారంభిస్తారు. కష్టాలు తీరాక కొండకు వచ్చి ముడుపులు చెల్లించుకుంటామంటారు. దక్షిణలిస్తామని ప్రలోభపేతారు. ప్రదక్షిణలు అంటారు. వ్రతాలు చేస్తామంటారు.  ఇలా ఒకటి తరువాత ఒకటిగా భగవంతుడికి మొక్కులు. మనం కోరుకున్నది నెరవేరితే మంచి దేముడు, లేదంటే చెడ్డ దేముడు అంటాము. ఈ కష్టాలు రావడానికి ఆ భగవంతుడు కారణం కాదని మనకూ తెలుసు. అయినా ఆ దేముని మీదే భారం వేస్తాం, దేముడు  మనలను ఆనందంగానూ, సుఖం గానూ జీవించమనే పుట్టించాడు. తాను ఏర్పర్చిన ప్రకృతి ద్వారా తన పని తాను చేసుకుంటూ పోతూనే వుంటాడు. ఇంత అద్భుతమైన ప్రకేతికి సైతం మనం విఘాతం కలిగిస్తూ , దానికి కూడా దేముణ్ణీ బాధ్యుడిగా నిలబెడుతున్నాము. సాటి మనిషి ఆదుకోమని భగవంతుడు చెప్పకనే చెప్పాడు. అంతెందుకు మనం తిన్న ఆహారాన్ని గానీ, నీటిని గానీ, గాలిని గానీ అంతా లోపల వుంచుకోగలుగుతున్నామా? కొంత విసర్జించాల్సిందే కదా!  ఆ విధం గానే మనం ఆర్జించిన దాంట్లో కొంతలో కొంత ఈ సమాజం కోసం వినియోగించాల్సి వుంది. బుద్ధిగానూ , ధర్మం గానూ న్యాయం గానూ, జీవించమని భగవాన్ బోధించాడు. భూత దయ కలిగి వుండాలన్నాడు. మానవుడే మాధవుడిగా, సాటి మనుష్యులను ప్రేమించమని సెలవిచ్చాడు.

 

కానీ మనుష్యులమని చెప్పుకుంటూ కొందరు మృగాలకన్నా హీనం గా ప్రవర్తించడమే ఒక వింత. భగవంతుని మాటే మంచి, అన్ని సక్రమం గా వుండి, శరీరం తనతో పూర్తిగా సహకరిస్తూ వుంటే తనంత గొప్పవాడు లేడనుకుంటాడు. డన మదం తో , భుజ బలంతో గర్వించి, అహంకారిగా ప్రవర్తించి, తనలో వున్న ఆ పరమాత్మ భోధను కాదని ప్రవర్తిస్తాడు, పరమాత్మ చెప్పిన విషయాలను విస్మరించి,  ఆశా వ్యామోహాలకూ లొంగిపోయి మాయలో పడిపోతారు. ఎవ్వరు చేసిన కర్మను వారే అనుభవించాలని చెప్పినట్లుగా, భగవాన్ వారి వారి కర్మానుసారం గా, వారికి తగు కష్టాలను ఏర్పాటు చేస్తూనే వుంటాడుదేముడు చెప్పిన మంచి మాటలను ఖాతరు చేయకుండా తానుగా కష్టాలనూ, నష్టాలనూ కోరుకుంటుంటే, భగవంతుడు మాత్రం ఎంతకాలం ఉపేక్షిస్తాడు? ఎవ్వరికి వారు గొప్పగా భావించుకుంటూ, మానవ కోటికి అపకారం తలపెడుతూ, స్వామి సృష్టించిన ఈ ప్రక్ర్టిని  ధ్వంశం గావిస్తూ, అరాచకం సృష్టిస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా.. ఆ విశ్వేశ్వరుడు.గమ్మత్తే మిటంటే  మనం చేసేదంతా చేసి, దాని, దాని ఫలితాన్ని అనుభవించాల్సిరాగానే, అన్యాయం గా ఆ భగవంతున్ని అపార్ధం చేసుకుం టున్నాము.  సాధారణం గా అందరూ ఈ విధం గానే దేముణ్ణి అనుకునేవారే, ఆడిపోసుకునేవారే.;ఎవ్వరు ఏమనుకున్నా ఎవ్వరికి నచ్చినా నచ్చక పోయినా భగవంతుడు తన పనిని తాను చేయకుండా వుండేప్రసక్తేరాదు.  ఈ విశ్వమంతటినీ శృష్టించిన ఆ భగవంతుడికి మనం పండ్లూ, ఫలహారాలూ, దక్షిణలూ ఆశపెట్టడం ఏమంత విజ్ఞత అనిపించుకోదు. ప్రేమతో , భక్తితో ఆ భగవంతుని ఆర్తితో పలకరిద్దాం. సదా ఆయనను గుర్తుంచుకుని ఆయన చెప్పిన మార్గం లోనే సాగుదాం. అప్పుడే ఈ లోకం లో మానవత్వం వెల్లివిరుస్తుంది. మానవతా పరిమళాలు గుబాళిస్తాయి. 

మరిన్ని శీర్షికలు
avee - ivee