Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
The perfect time to exploit the highly commendable

ఈ సంచికలో >> సినిమా >>

బన్నీ, డీఎస్‌పీ సూపర్‌ కాంబినేషన్‌

Bunny, DSP Super Combination

ఏ సినిమాకి అయినా మనసుపెట్టి మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌. వెల్లువలా ఆఫర్స్‌ వస్తున్నా సెలక్టివ్‌గానే సినిమాలు చేసే దేవిశ్రీప్రసాద్‌కి, హీరో అల్లు అర్జున్‌ అన్నా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అన్నా ప్రత్యేకమైన అభిమానం, గౌరవం. డీఎస్‌పీ, బన్నీ కలిసి చేసిన సినిమాలన్నీ మ్యూజిక్‌ పరంగా పెద్ద హిట్స్‌.త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ హీరోగా రానున్న ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ మూవీకి కూడా సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అల్లు అర్జున్‌తో దేవిశ్రీప్రసాద్‌ పనిచేసిన ‘జులాయి’ సినిమాకి ఓ ప్రమోషన్‌ సాంగ్‌ చేశారు. ‘పకడో పకడో..’ అంటూ సాగుతుంది అది. ఆ ట్రెండ్‌ని కొనసాగిస్తూ బన్నీ, డీఎస్‌పీ ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’కి కూడా ఓ ప్రోమో చేశారు.చాలా స్టైలిష్‌గా ఈ ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ ప్రోమో సాంగ్‌ ఉంది. ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ నుంచీ ట్రైలర్‌ దాకా అన్నీ వెరైటీగా ప్లాన్‌ చేసిన ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ యూనిట్‌, ఈ ప్రోమో సాంగ్‌ని కూడా కొత్తగా డిజైన్‌ చేయడంతో ఆడియన్స్‌కి సినిమా పట్ల క్రేజ్‌ డబుల్‌ అయ్యింది. బన్నీతో పోటీగా డీఎస్‌పీ డాన్సులు చేసి ఉర్రూతలూగించాడు ఈ ప్రోమో సాంగ్‌లో. బన్నీతో డీఎస్‌పీకి కుదిరిన ర్యాపో సినిమాకి హైప్‌ని పెంచడం పట్ల ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ టీమ్‌ హర్షం వ్యక్తం చేస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు
pawan direction for whom