Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Bunny, DSP Super Combination

ఈ సంచికలో >> సినిమా >>

పవన్‌ డైరెక్షన్‌ ఎవరికో మరి

pawan direction for whom

పవన్‌కళ్యాణ్‌ దర్శకత్వం చేసి ఎన్నో ఏళ్ళు గడిచింది. ‘జానీ’ సినిమాకి దర్శకుడిగా మారిన పవన్‌కళ్యాణ్‌ ఆ సినిమాతో వైఫల్యమే చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత డైరెక్షన్‌ గురించి ఆలోచించకపోయినా పవన్‌కళ్యాణ్‌కి ‘సత్యాగ్రహి’ అనే సినిమాని స్వీయ దర్శకత్వం చేయాలనే కల అయితే అలానే ఉండిపోయింది.‘సత్యాగ్రహి’ సినిమాని పట్టాలెక్కించాలనుకుంటున్న పవన్‌కళ్యాణ్‌ దాన్ని త్రివిక్రమ్‌ చేతిలో పెట్టాలని అనుకుంటున్నాడట. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి ఖాళీ లేనట్లయితే ‘గమ్యం’, ‘వేదం’ చిత్రాల దర్శకుడు క్రిష్‌ చేతిలో పెట్టడానికి పవన్‌కళ్యాణ్‌ సిద్ధంగా ఉన్నాడని సమాచారమ్‌. ‘గబ్బర్‌సింగ్‌`2’ కోసం డాలీని తీసుకున్న పవన్‌, డాలీ ‘సత్యాగ్రహి’ని డీల్‌ చెయ్యగలడా? అన్న డైలమాలోనూ ఉన్నాడట.‘గబ్బర్‌సింగ్‌`2’ సినిమా సెట్స్‌పైకి వచ్చిన వెంటనే పవన్‌కళ్యాణ్‌ ‘సత్యాగ్రహి’ సినిమాని పట్టాలెక్కించాలను కుంటున్నాడని, దాసరి నారాయణరావు నిర్మాతగా ఈ సినిమా రానుందనీ టాలీవుడ్‌లో అనుకుంటున్నారు. మే నెలలో ‘సత్యాగ్రహి’ సినిమాపై స్పష్టత రావొచ్చునట.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam