Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

గర్జిస్తోన్న ‘లయన్‌’

Garjistonna Lion

బరిలోకి బాలయ్య దిగితే అపోజిషన్‌ డల్‌ అయిపోవాల్సిందేనంటారు ఆయన అభిమానులు. నందమూరి నామ సంవత్సరం అని కళ్యాణ్‌రామ్‌ అననే అనేశాడు. ‘పటాస్‌’తో కళ్యాణ్‌రామ్‌, ‘టెంపర్‌’తో ఎన్టీఆర్‌ బాక్సాఫీస్‌ విజేతలుగా ఈ సంవత్సరం నిలిచారు. నందమూరి బాలకృష్ణ ‘లయన్‌’గా బాక్సాఫీజ్‌ వద్ద గర్జించడానికి సిద్ధమయ్యాడు.

సత్యదేవా అనే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చిన బాలకృష్ణ, ‘లయన్‌’తో బాక్సాఫీస్‌ని షేక్‌ ఛేయడం ఖాయమట. సినిమా ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆడియో ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే ఆడియో విడుదలైంది. చంద్రబాబు చేతుల్తో ఆడియో రిలీజ్‌ చేస్తే, అది బాలయ్య సినిమా అయితే హిట్టేనన్న సెంటిమెంట్‌ కూడా ఉంది.

బాలకృష్ణతో తొలిసారి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది త్రిష. ‘లెజెండ్‌’ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించిన రాధికా ఆప్టే, ఈ సినిమాలో కూడా ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటోంది. ఈ సమ్మర్‌కి నందమూరి అభిమానులు ఖుషీ అయ్యేలా ‘లయన్‌’ పెద్ద విజయం సాధిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. ‘లయన్‌’ గర్జనకు సిద్ధమైంది, అభిమానులు రెడీగా ఉన్నారా?

మరిన్ని సినిమా కబుర్లు
Akkineni Missail