Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with allu arjun

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి

Movie Review : S/O Satyamurthy

చిత్రం: సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి
తారాగణం: అల్లు అర్జున్‌, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్‌, సమంత, నిత్యా మీనన్‌, అదా శర్మ, స్నేహ, ప్రకాష్‌రాజ్‌, అలీ, రావు రమేష్‌ తదితరులు.
చాయాగ్రహణం: ప్రసాద్‌ మురెళ్ళ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
నిర్మాణం: హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌
దర్శకత్వం: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
నిర్మాత: ఎస్‌. రాధాకృష్ణ
విడుదల తేదీ: 9 ఏప్రియల్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే:
విరాజ్‌ ఆనంద్‌ (అల్లు అర్జున్‌) ఓ బిలియనీర్‌. అతని తండ్రి సత్యమూర్తి (ప్రకాష్‌రాజ్‌). ఇతరులకు సహాయం చేయడం, జీవితంలో నైతిక విలువలతో బతకడం తెల్సిన వ్యక్తి విరాజ్‌. అనుకోకుండా విరాజ్‌, తన తండ్రిని కోల్పోతాడు. తండ్రితోపాటు, ఆస్తులూ కోల్పోయిన విరాజ్‌, ఓ జాబ్‌ వెతుక్కుంటాడు. అలా ఓ సందర్భంలో విరాజ్‌కి సమీర (సమంత) తారసపడ్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ మనీ మైండెడ్‌ అయిన సమీర తండ్రి (రాజేంద్రప్రసాద్‌) తన కూతుర్ని విరాజ్‌కి ఇచ్చేందుకు ఓ పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో విరాజ్‌ నెగ్గాడా? సమీరను దక్కించుకున్నాడా? అన్నది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
నటనలో ఆరితేరిపోయాడు అల్లు అర్జున్‌. నటుడిగా అతన్ని ఓ మెట్టు పైకెక్కించే చిత్రమిది. భావోద్వేగాల్ని చక్కగా పలికించాడు. ఛాలెంజింగ్‌గా ఈ సినిమాలోని పాత్రను తీసుకున్నాడు అల్లు అర్జున్‌. వరుసగా ఎంటర్‌టైనింగ్‌ పాత్రలు చేస్తున్న అల్లు అర్జున్‌ స్టడీగా, కొంచెం ఎమోషనల్‌ పాత్రలో సమర్థవంతంగా తన ప్రతిభను చాటుకున్నాడు. సమంత క్యూట్‌గా వుంది. నటనతోనూ ఆకట్టుకుంటుంది.

రాజేంద్రప్రసాద్‌ పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా వుంది. ఉపేంద్ర సూపర్బ్‌. స్నేహ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బావుంది. ఆదా శర్మ, నిత్యామీనన్‌ తక్కువ నిడివి వున్న పాత్రల్లోనే కనిపించారు. బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిషోర్‌ నవ్వులు పూయించారు. రావు రమేష్‌ ఓకే. ఎంఎస్‌ నారాయణ మామూలే. మిగతా పాత్రధారులంతా తెరపై అవసరమైనంతమేర తమ నటనా ప్రతిభను చాటుకున్నారు.

దర్శకుడు మరోమారు ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్‌గా చేసుకుని కథ రాసుకున్నాడు. ప్రెజెంటేషన్‌ రిచ్‌గా వుంది. డైలాగ్‌లు బావున్నాయి. స్క్రిప్ట్‌ యావరేజ్‌గా వుంది, స్క్రీన్‌ప్లే కూడా అంతే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. రెండు పాటలు తెరపై చూడ్డానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్‌ ఫస్టాఫ్‌లో ఇంకాస్త అవసరం అన్పిస్తుంది. కాస్ట్యూమ్స్‌ స్టైలిష్‌గా వున్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు ఆకట్టుకుంటుంది.

త్రివిక్రమ్‌ సినిమాల్లో హ్యూమర్‌కి ఎక్కువ ఆస్కారం వుంటుంది. అయితే ఈసారి ఆ హ్యూమర్‌ కాస్త తగ్గిందనిపిస్తుంది. స్క్రిప్ట్‌ మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ కొంచెం డల్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్‌ తర్వాత సినిమా మూడ్‌లో మార్పు వస్తుంది. సెకెండాఫ్‌లో కొంచెం స్పీడ్‌గా కథ మూవ్‌ అవుతుంది. అక్కడక్కడా ఎత్తుపల్లాలు కనిపిస్తాయి. క్లయిమాక్స్‌ ఎమోషనల్‌గా వుండాల్సింది పోయి, అక్కడా ఆ ఇంటెన్సిటీ లేకుండా పోయింది. ఓవరాల్‌గా సినిమా రిలీజ్‌కి ముందు నెలకొన్న అంచనాల్ని అందుకునేలా లేదు. అయితే సినిమాగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి కొంతవరకు బాగానే రీచ్‌ కావొచ్చు. మంచి ఓపెనింగ్స్‌ సినిమాకి ప్లస్‌. మౌత్‌ టాక్‌ పాజిటివ్‌గా స్ప్రెడ్‌ అయితే హిట్‌ అనిపించుకునే లక్షణాలు లేకపోలేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే: సత్యమూర్తి కొడుకు ఫర్వాలేదుగానీ..

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka