Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Naa Paata 11 - Nuvvu Choodu Chudaka po - Okato No Kurradu

ఈ సంచికలో >> సినిమా >>

అల్లు అర్జున్ తో ముఖాముఖి

Interview with allu arjun

ముందు త్రివిక‌మ్... ఆ త‌ర‌వాతే.. క‌థ‌! - అల్లు అర్జున్‌

అల్లు అర్జున్ అంటేనే కావ‌ల్సినంత ఎన‌ర్జీ!
ఆ ఎన‌ర్జీకి త‌గిన క్యారెక్డ‌ర్ ప‌డితే రెచ్చిపోతాడు. ఓ ఆర్య‌, ఓ దేశ‌ముదురు, ఓ బ‌న్నీ, ఓ రేసుగుర్రం...
న‌టుడిగా త‌న కెరీర్‌లో ఎప్పుడూ త‌ప్పు చేయ‌లేదు. త‌న‌కు సాధ్య‌మైనంత వ‌ర‌కూ కొత్త‌దారిలో వెళ్తూ.. క‌మ‌ర్షియల్ సినిమాల్ని ఎంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. వేదం సినిమాతో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు తలుపులు తెరిచాడు. ఒక విధంగా రుద్ర‌మదేవి కూడా మ‌ల్టీస్టార‌రే! సోలో హీరోగా త‌న స్టామినాని రూ.50 కోట్ల‌కు తీసుకెళ్లాడు. ఆ రికార్డు బ‌ద్ద‌లు కొట్ట‌డానికి సన్నాఫ్ స‌త్య‌మూర్తిగా మ‌న ముందుకు వ‌చ్చాడు అల్లు అర్జున్‌. ఈ సంద‌ర్భంగా బ‌న్నీతో స్పెష‌ల్ చిట్ చాట్ ఇది..


* హాయ్ బ‌న్నీ..
- హాయ్‌..

* స‌త్య‌మూర్తి రిజ‌ల్ట్ ఏంటి?
- నేనైతే.... ఫుల్ హ్యాపీగా ఉన్నాను. పొద్దుట నుంచి ఫోన్లే ఫోన్లు. నాకే కాదు.. మా టీమ్ అంద‌రిదీ ఇదే ప‌రిస్థితి.

* త్రివిక్ర‌మ్‌తో రెండో సినిమా ఇది. ఎలా ఉంది ఈ అనుభ‌వం?
- సింప్లీ సూప‌ర్బ్‌. జులాయితే మా కాంబినేష‌న్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. న‌న్ను ఓ కొత్త జోన‌ర్‌లో ప‌డేయ‌డ‌మే కాదు... ఆయ‌న కూడా త‌న శైలి మార్చుకొని.. సంభాష‌ణ‌లు రాశారు. ఇద్దరం ఆ సినిమాతో రిఫ్రెష్ అయ్యాం. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలోనూ అంతే. ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ద‌గ్గ‌ర చేశారు. ఆయ‌న శైలిలో,  క‌థ‌ని తెర‌కెక్కించే విధానంలో చాలా మార్పు క‌నిపించింది.

* జులాయి నుంచి స‌త్య‌మూర్తి... ఇద్ద‌రిలో ఎవ‌రు బాగా మారారు?
- ఇద్ద‌రం కూడా. న‌టుడిగా కొన్ని లేయ‌ర్స్ ఓపెన్ చేసే అవ‌కాశం వ‌చ్చింది ఈ సినిమాతో. థ్యాంక్స్ టూ త్రివిక్ర‌మ్‌.

* త్రివిక్ర‌మ్ క‌దా అని ఈ క‌థ ఒప్పుకొన్నారా?  లేదంటే స్ర్కిప్టు న‌చ్చి ఓకే చేశారా?  ఈ రెండింటిలో మీ మొద‌టి ప్రాధాన్యం దేనికి, ఎందుకు?
- ముందు త్రివిక్ర‌మ్‌.. ఆ త‌ర‌వాతే క‌థ‌. ఎందుకంటే ఆయ‌న ఎటిట్యూడ్ నాకు బాగా న‌చ్చుతుంది. ఏదైతే న‌మ్ముతారో అదే చూపిస్తారు. ఈ క‌థ‌లో నిజాయ‌తీ, చెప్పాల‌నుకొన్న పాయింట్ నాలో బాగా స్ఫూర్తి నింపాయి.

* సెట్లో త్రివిక్ర‌మ్ ఎలా ఉంటారు?
- కూల్‌. సెట్లో ఆయ‌న పెద్ద‌గా స‌ల‌హాలు ఇవ్వ‌రు. ఇలా చేయ్‌.. అలా చేయ్ అన‌రు. సినిమా షూటింగ్‌కి ముందే మేం ఈ క‌థ గురించి, విరాజ్ ఆనంద్ పాత్ర గురించి చాలా సార్లు క్ష‌ణ్ణంగా మాట్లాడుకొన్నాం. విరాజ్ ఆనంద్‌గా నేను మారిపోవ‌డానికి అదెంతో ఉప‌యోగ‌ప‌డింది. కొంత‌మంది ద‌ర్శ‌కులు న‌టీన‌టుల‌నుంచి త‌మ‌కు కావల్సింది రాబట్టుకొంటారు. ఇంకొంద‌రు.. కావ‌ల్సినంత ఫ్రీడ‌మ్ ఇచ్చి.. మీకు న‌చ్చిన‌ట్టు చేయ‌మంటారు. ఈ ల‌క్ష‌ణం త్రివిక్ర‌మ్‌గారిలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

* ఇద్ద‌రూ ఏం మాట్లాడుకొంటారు.. పుస్త‌కాలు, సినిమాలూ మీకిష్ట‌మైన టాపిక్ ఏంటి?
- మా సంభాష‌ణ అంతా ఇన్‌జ‌న‌ర‌ల్ గానే ఉంటుంది. నాకు సినిమాలంటే ఇష్టం. పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ విష‌యాలు మాట్లాడ‌తా. మా మ‌ధ్య పాజిటీవ్ పాయింట్లే చ‌ర్చ‌కు వ‌స్తాయి. నెగిటీవ్ థింకింగ్ అస్స‌లు ఉండ‌దు.

* రేసుగుర్రం రూ.50 కోట్లు చేసింది. మ‌రి స‌త్య‌మూర్తి టార్గెట్ ఎంత‌?
- ఫ‌లానా రికార్డు బ్రేక్ చేయాలి.. ఇన్ని వ‌సూళ్లు సాధించాలి అనే లెక్క‌లు వేసుకోలేదు. ఇది మంచి సినిమా. కుటుంబ ప్రేక్ష‌కులు మొత్తం చూసేలా తీర్చిదిద్దాం. వాళ్లంతా చూస్తే.. మేం అనుకొన్న ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్టే.

* తొలి రోజు వ‌సూళ్లు, రికార్డు బ్రేకింగుల గురించి ఆలోచిస్తారా, లేదా?
- మేం ఈ సంగ‌తి ప‌ట్టిచుకోం.. అని చెబితే అబ‌ద్దం చెబుతున్న‌ట్టే లెక్క‌. సినిమా రూ.40 కోట్ల‌తో పూర్త‌యింద‌నుకోండి. క‌నీసం రూ.50 అయినా రావాలి అనుకొంటాం క‌దా..?  అలా రావాలంటే కొన్ని రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టుకొంటూ వెళ్లాల్సిందే.

* తెలుగు సినిమా స్థాయిని ఒక్క మెట్టు పెంచినా... సంతోషిస్తా అని రుద్ర‌మ‌దేవి ఆడియో ఫంక్ష‌న్లో చెప్పారు. అది ఏ కంటెస్ట్‌లో అర్థం చేసుకోవ‌చ్చు?
- మ‌న మార్కెట్ పెర‌గాలి. తెలుగు సినిమా తెలుగు సినిమాగానే ఉండిపోకూడ‌దు. నా వ‌ర‌కూ వ‌స్తే.. నాకంటూ ఓ మార్కెట్‌ని మ‌ల‌యాళంలో ఏర్పాటు చేసుకొన్నా. ఇది తెలుగు సినిమా సాధించిన విజ‌య‌మే క‌దా..?  రేపు బాహుబ‌లి రాబోతోంది. అది మిగిలిన రాష్ట్ర్రాల్లోనూ బాగా ఆడాలి. అలా ఆడితేనే తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది. ఇంకొన్ని మెట్లు పైకివెళుతుంది.

* రుద్ర‌మ‌దేవి అలాంటి సినిమానేనా?
- అఫ్‌కోర్స్‌.. త్రీడీ టెక్నాల‌జీతో తెర‌కెక్కించిన సినిమా అది. వంద‌మంది ప్రేక్ష‌కుల వ‌ల్ల వంద రూపాయిలే వ‌స్తున్నాయ‌నుకొందాం. వాళ్లంద‌రికీ త్రీడీ సినిమా చూపిస్తే రెండొంద‌లు వ‌సూలు చేయొచ్చు క‌దా..?  కొత్త టెక్నాల‌జీని వాడుకోవ‌డానికి మ‌నమంతా సిద్ధంగా ఉండాలి. రుద్ర‌మ‌దేవిలాంటి సినిమాలు టెక్నాల‌జీ వ‌ల్లే సాధ్యం అవుతాయి. ల‌క్ష‌మందిని ఓ చోట చేర్చి ఓ సీన్ తీయ‌డం మ‌న వల్ల కాదు. కానీ బ్లూమేట్ ద్వారా ఆ క‌ష్టాన్ని అధిగ‌మిస్తున్నాం. టెక్నాల‌జీ వ‌ల్ల ఇలాంటి లాభాలెన్నో.

* రుద్ర‌మ‌దేవిలో మీది త్రూ అవుట్ ఉండే పాత్రేనా?  లేదంటే అతిథి పాత్ర అనుకోవాలా?
- ఏదో ఓ ఎపిసోడ్‌కి ప‌రిమిత‌మ‌య్యే పాత్ర కాదు. ఫ‌స్టాఫ్ లో రెండు మూడు సీన్ల‌లో క‌నిపిస్తా. సెకండాఫ్‌లో నూ ఉంటా.

* వేదంలాంటి సినిమాలెప్పుడు?
- క‌థ కుద‌రాలి..

* తండ్ర‌యాక మార్పులొచ్చాయా?
- మారాను. అయితే అది కేవ‌లం ఫాద‌ర్ వుడ్ వ‌ల్ల వ‌చ్చిన మార్పు కాదు, ప‌దేళ్లుగా ఇండ్ర‌స్ట్రీలో ఉంటున్నా. నా చుట్టు పక్క‌ల స‌మాజాన్ని ప‌రిశీలిస్తున్నా... మార్పు ఉంటుందిగా.

* త‌రువాతి సినిమా ఎప్పుడు?
- ఇంకా ఏదీ క‌న్‌ఫామ్ కాలేదు.. త్వ‌ర‌లో చెబుతా.

* బోయ‌పాటి శ్రీ‌నుతో అన్నారు.
- అదింకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది. ఇంకా ఏమీ అనుకోలేదు..

* ఆల్ ది బెస్ట్ ఫ‌ర్‌.. స‌త్య‌మూర్తి..
- థ్యాంక్యూ సోమ‌చ్‌...

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review : S/O Satyamurthy