Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ: చిన్నారి చంద్రకళ మదిలో చిగురులు తొడిగిన  నాట్యాభిలాష  క్రమంగా పెరుగుతూ వుంటుంది. తండ్రి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన నాట్య ప్రదర్శనకు తల్లితో బాటు వెళ్ళిన చంద్రకళ  అక్కడ అందరూ తన తండ్రిని పొగడడం, గౌరవించడం  చూసి గర్వం గా ఫీలవుతుంది. ఆ తరువాత....

“నమ్మలేనంత  బాగా చేసావు,” అని నన్ను, “అంతకంటే మీరు బాగా నేర్పారు మేడమ్,” అని అమ్మని మెచ్చుకున్నారు,  నా డాన్స్ చూసాక, మ్యూజిక్  క్లాస్ వాళ్ళంతా. “ఈ సారి మా  ‘చిన్మయ  మిషన్’  ఫంక్షన్ కి ఈ డాన్స్ చెయ్యాలి నువ్వు చంద్రా,” అంది నా భుజం మీద తట్టి, భానుమామి.“అక్కడ  మంచి  ‘వేదిక’  ఉంటే,  అమ్మ ‘సరే’ అంటే  చేస్తాను.  ఫంక్షన్ ఎప్పుడు?”  అడిగాను భానుమామీని.అమ్మతో  సహా  అందరూ  నవ్వారు.   కరెక్టుగానే  అన్నానుగా  అనుకున్నాను....

**

సమ్మర్ హాలిడేస్  అయ్యాక,  నాన్న చేయి  పట్టుకొని  స్కూల్లో  అడుగు పెట్టాను.  ఆరునెల్ల క్రితమే నాకిక్కడ అడ్మిషన్ కన్ ఫర్మ్ అయిందట. “హోలీ ఏంజల్స్” కాన్వెంట్ కాంపౌండ్  చాలా పెద్దది.  గేటు నుంచి ప్రిన్సిపాల్ ఆఫీస్ కి కొంత దూరం నడవాలి.  లెఫ్ట్ లో పార్క్, దాటాక కిండర్ గార్టెన్,  తరవాత పార్లర్,  పక్కన ఆఫీసు. నాన్న ప్రిన్సిపాల్ తో మాట్లాడి పేపర్స్ మీద సైన్ చేసి నన్ను సెకెండ్ స్టాండర్డ్ లో అడ్మిట్ చేసారు. నాకు నర్వస్ గా,  ఆత్రుతగా ఉంది. మరునాటి నుండి స్కూల్. మొదటి నాలుగు రోజులు నాన్న లోపల వరకు దిగబెడతాన్నారు.

**

స్కూల్  లోపల  కిక్కిరిసినట్టు జనం.  నాన్న  వెంట నడుస్తుంటే, అందరూ మా వంకే చూస్తున్నారు.  నాకు  తెలుసు,  మా నాన్న మిలటరీ యూనిఫారంలో ఉన్నందుకే  అని.  నాన్నతో నడవాలంటే చాలా గర్వంగా, భయం లేకుండా, గొప్పగా అనిపిస్తుంది నాకు.

**

స్కూల్లో ప్రతిరోజు  జరిగే మ్యూజిక్ క్లాస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అవర్, చర్చ్కెళ్ళడం చాలా నచ్చాయి నాకు. ఆటల్లో ఈజీగా గెలవగలనని, మా  టీచర్లని అచ్చంగా ఇమిటేట్  చేయగలనని  కొత్తగా, నా గురించి నేను తెలుసుకున్నాను.స్కూల్లో మా మ్యూజిక్ క్లాస్  అంటే నాకు స్పెషల్ గా చాలా ఇష్టమయింది.  మా మ్యూజిక్  టీచర్  అమెరికన్  లేడీ.  పేరు  మిస్. లిండా మాథ్యూ.  ఇంగ్లీష్ పాటలు, చాలా కొత్త రకంగా నేర్పుతుంది  మాకు.

**

ప్రతి సాయంత్రం,  నాన్న నన్ను స్కూలు  విషయాలు చెప్పమని అడగడం, ఆలస్యం.... కుర్చీలు, బల్లలు, సోఫా ఓ పక్కకి జరిపేసి, నాకోసం గదిని ‘వేదిక’ గా మార్చేస్తాను.  అమ్మ, నాన్న తమ్ముడు, ఒక్కోప్పుడు కన్నన్ కూడా కాస్త దూరంలో, నా ఎదురుగా కూర్చోగానే, మా మ్యూజిక్  క్లాసుని  ఓ  ‘డ్రామా’~`7ా నటించేస్తాను.

మ్యూజిక్ క్లాస్ లో నేర్చుకున్న ఆ ఇంగ్లీష్ పాటలని రాగాలు  తీస్తూ, రాగానికి తగ్గట్టుగా నేల మీదనుండి, బల్లమీదకి, అక్కడినుండి  కిటికీలోకి  ఎక్కి  పాడటం  ఒక ఎత్తైతే,  ప్రతి  టీచర్ని  అనుకరించి  చూపించడం మరో ఎత్తుగా, ఓ గంట సేపు వాళ్ళని నవ్వించగలుగుతున్నాను...

 

ఓ ’ వేదిక ’ మీద  డాన్స్ చేయాలి, చేయగలను, నన్ను అందరూ మెచ్చుకుంటారు కూడా - అన్న ఆలోచన, నాలో మొదలైంది.

 

నా చేత ఇంగ్లీష్ పాటలు పాడించుకోడం, అమ్మ  స్టూడెంట్స్ కి...,  ఎప్పటికప్పుడు

కొత్త పాటలు పాడి వాళ్ళముందు  పర్ ఫాం చేయడం  నాకు  రొటీన్ అయింది...వాళ్ళు నా ఫేవరేట్ ఆడియన్స్ అయ్యారు...

**

నేను కొత్తగా నేర్చుకున్న పాట ‘రైన్ డ్రాప్స్ ఆన్ రోజస్’.....వాళ్లకి  పాడి  వినిపించాలని ప్రాక్టిస్ చేసాను.  మ్యూజిక్ క్లాస్ అయ్యాక,  ఉత్సాహంగా పాడి వినిపించాను కూడా. అమ్మ స్టూడెంట్స్ “బ్యూటిఫుల్  పర్ఫామెన్స్ ,” అంటూ చప్పట్లు కొట్టారు....

 

ఆ సందడిలోనే,  కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఏదో హడావిడి వినిపించింది.  ఏమిటో చూద్దామని నేను కూడా మాలినితో కిందకి వచ్చాను.  ఖాళీగా ఉన్న ఫ్లాట్ లోకి సామాను దింపుతున్నారు.

“నేను చెప్పానే, డాన్స్ క్లాసు మొదలవ్వబోతుందని. వాళ్ళ సామానే దింపుతున్నారు. ఆ మాస్టారు మంచి పేరున్న వారంట.  ఆయన దగ్గర డాన్స్ నేర్చుకోవాలని...చాలా మంది ఎదురు చూస్తున్నారు...మా చెల్లి లాగా.   బాగుంది.   అయితే, త్వరలోనే ఇక్కడ  డాన్స్ స్కూల్  మొదలై పోతుందన్న మాట,” అంది మాలిని.

నా వంక చూసి, “నువ్వింక పైకి వెళ్ళు చంద్రా,” అని తను ఇంటికి వెళ్ళిపోయింది.

**

మారల్ సైన్స్ క్లాసులో నా పక్కనే ఓ స్టూడెంట్ వచ్చి కూర్చుంది.  పేరు లీనా జోసెఫ్. ‘హలో’ అంది.క్లాస్ మొదలవ్వడానికి  ఐదు నిముషాలుంది. నా గణపతి బొమ్మ పెన్-బాక్స్  డెస్క్ మీద ఉంది.  “హు ఇజ్ థిస్?” అంది గణపతి బొమ్మని చూస్తూ.

లార్డ్ గణపతి,”  అన్నాను.

ఐ హేట్ యువర్ గాడ్స్.  హవ్ స్టుపిడ్?  హవ్ కెన్ హి హావ్ ఎలెఫెంట్ ఫేస్ అండ్ ఫోర్ హాండ్స్?  సో ఫన్నీ,”  అంటూనే పోయింది.

షాక్ అయిపోయాను.  కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి. నేను గట్టిగానే ఎదురు చెప్పాను.  “హవ్ కెన్ యు టాక్ లైక్ థిస్?  హి ఇజ్ అవర్ గాడ్,” అన్నాను. అప్పుడే  క్లాస్ రూం లో అడుగు పెట్టిన మా మేడమ్ కి చెప్పాను.ఆవిడ కూడా ఆశ్చర్య పోయింది.  మమ్మల్నిద్దర్నీ   క్లాస్ బయటికి తీసుకువెళ్ళి,  నచ్చజెప్పి,  వార్నింగ్ కూడా ఇచ్చింది...“చూడు లీనా, నీవిలా బిహేవ్ చేసి ఇతరులని ఇన్ సల్ట్ చేసి మాట్లాడుతుంటే,  చర్చ్- ప్రీచర్ అయిన మీ ఫాదర్ కి చెడ్డ పేరు వస్తుంది.  నీవు, చంద్రకళ కి అపాలజీ చెప్పవలసిన అవసరం ఉంది.  మీ పేరెంట్స్ కి కూడా స్కూల్ నుండి నోట్ వెళుతుంది,” అని హెచ్చరించింది మేడమ్.మొదటి సారి ఇటువంటి సంగతి ఎదురవ్వడం.   చాలా బాధపడ్డాను.  ఇంటికెళ్ళాక అమ్మకి, నాన్నకి చెప్పాను.

**

“లీనా జోసెఫ్ లాంటి వాళ్ళతో అనవసరంగా వాదనలు పెట్టుకోకు.  వీలయినంత మటుకు నీ పని నువ్వు చూసుకో.  అలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేసుకోకు,” అంది అమ్మ.

“ఎన్నో రెలిజన్స్, కల్చర్స్ ఉన్నాయి ప్రపంచంలో.  ఎవరు  ఏది పాటించినా, ఇతరుల భావాలని గౌరవించడం నేర్చుకోవాలి...” అన్నారు అంతా విన్న నాన్న.

అప్పటి నుంచే  నాకు  ఇతర  రెలిజెన్స్  గురించి  తెలుసుకోవాలనే  ఆసక్తి  పెరిగింది.

**

పేరెంట్స్ కి ఇమ్మని,  ‘స్కూల్ కాలెండర్ ఆఫ్ ఈవెంట్స్’  ఇచ్చారు క్లాస్ టీచర్. యేడాది పొడుగునా జరగబోయే  అకడమిక్, ఎక్ష్ ట్రా-కరికులర్, కల్చరల్ యాక్టివిటీస్ లిస్టు అని  వివరించింది  మా  మేడమ్.

స్ప్రింగ్ ఫెస్టివల్ - టాలెంట్ షో’ – జరగనుందని, మా మ్యూజిక్ టీచర్ కూడా, అనౌన్స్ చేసి, ‘టాలెంట్ షో’’ గురించి పేపర్స్ ఇచ్చింది.  ఒక్కో స్కూల్ నుండి సెలెక్ట్  అయిన నాలుగు ఐటమ్స్ ని ‘చెన్నై యంగ్  టాలెంట్ షో’ అవార్డు కి పంపుతారంట. 

రెండు వారాల్లో పార్టిసిపేట్  చేసేవాళ్ళ నేమ్స్ ఇవ్వాలంది మేడమ్.

**

ఇంటికి వెళ్ళగానే, స్కూల్ యాక్టివిటీ కాలెండర్ అమ్మకిచ్చాను. తప్పకుండా నేను ఆ ‘టాలెంట్ షో’ కి డాన్స్ ఐటమ్  చేయాలని  అడిగాను. “నీకు కాస్ట్యూమ్ లేదు కదమ్మా!,” అంది అమ్మ.“చెయ్యనివ్వు శారదా, దాన్ని ఏడిపించకు. కాస్ట్యూమ్  కుట్టించు,” అన్నారు నాన్న. నాన్నని, అమ్మని  గట్టిగా హగ్ చేసి ‘లవ్ యు’ అని చెప్పాను..“రేపే నా పేరు ఇస్తున్నా మా మేడమ్ కి,” అన్నాను.

“ఓకే,” అన్నారు ఇద్దరూ.

“అయితే, నీకు బాగా వచ్చిన ‘అధరం,మధురం’ డాన్స్ కి ‘కాళీయ మర్దనం’ ఎపిసోడ్ ని కలపాలి.  పోటీకి వెళ్ళాలంటే, తప్పదు.  నీకు సరిపడా ఆ ఎపిసోడ్ ని మార్చి నేర్పాలంటే,  చిన్న పనేమీ కాదు మరి.  రేపటినుండే ఆ ప్రాక్టీసు....,” అంది అమ్మ...

ఆనందంతో నాకు నిద్ర రాలేదు..... ‘అధరం,మధురం...డాన్స్ గురించి, అమ్మ  కుట్టించబోయే  కాస్ట్యూమ్  గురించి  ఆలోచిస్తూ  ఎప్పటికో...నిద్రపోయాను.

**

అమ్మచేత  కన్సెంట్  లెటర్  రాయించి,  మరునాడు  మా  మ్యూజిక్ క్లాస్ లో సబ్ మిట్  చేసాను.

టాలెంట్ షోకి నేను చేయబోయేది- ‘ఇండియన్ క్లాసికల్ డాన్స్’ అని రాసింది అమ్మ.

అది  చదివిన  మా మ్యూజిక్ టీచర్,  “వెరీ గుడ్. యు ఆర్ ది ఫస్ట్ గర్ల్ టు గివ్ యువర్ నేమ్, చంద్ర.  గుడ్ లక్, చైల్డ్,” అంది.

**

గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఫర్నిచర్  దిగిన వారానికి క్రింద ఫ్లాట్ లో డాన్స్ క్లాస్ మొదలైంది.  రెండో రోజు సాయంత్రం డాన్స్ క్లాస్ లోకి వెళుతున్న వారితో పాటు నేనూ వెళ్ళి, క్లాసులన్నీ అయ్యేంత వరకు చూసి ఇంటికి వెళ్ళాను.

మూడో రోజు, ఆ తరువాత కూడా అలాగే చేసాను. అక్కడున్నంత సేపు అసలు టైం తెలియడం లేదు....

ఒక వారం గడిచింది. ప్రతిరోజు  డాన్స్ క్లాస్ చూసి ఇంటికి  వెళ్ళేప్పటికి  అమ్మ తప్ప అందరూ భోంచేసేస్తున్నారు.   నేను వెళ్ళాకే,  నాతో పాటు కూర్చుని తనూ భోంచేస్తుంది అమ్మ. దాంతో,  కాస్త   ధైర్యం వచ్చింది. అమ్మకి  నామీద  కోపం లేదన్న మాట అనుకున్నాను.  అందుకే, రెండు రోజులుగా,  సీనియర్ స్టూడెంట్స్ డాన్సులు  కూడా చూడ్డానికి  మరింతసేపు  ఉండిపోయాను.

**

ఇవాళ మాత్రం, రోజూ కంటే బాగా ఆలస్యం అవడంతో, అమ్మ ఏమంటుందోనని భయం వేసింది.  నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి,  చేతులు కడుక్కొని, డైనింగ్ టేబిల్ వద్ద కూచున్నాను.  టేబిల్ వద్దనే వెయిట్ చేస్తున్న అమ్మ....సీరియస్ గా ఉంది.  బాగా కోపం వచ్చిందిలా ఉంది. ముందు నా ప్లేట్ లో, తరువాత తన ప్లేట్ లో వడ్డించింది.  ..  మెల్లగా తినడం మొదలు పెట్టాను. “చూడు చంద్రా, ఒకటో, రెండో  రోజులు  అక్కడ  ఏం  జరుగుతుందో  చూసొస్తావులే అనుకున్నాను.  వారం  రోజులుగా  రాత్రి వరకు అక్కడే పడుంటున్నావు.  ఇంట్లోతమ్ముడితో, పనితో నాకు ఊపిరాడటం లేదు.  అసలు నువ్వు, స్కూల్ వర్క్ చేస్తున్నట్టు కూడా లేవు.  నీ  కోసం కన్నన్ వచ్చినా, అతన్ని లోపలికి పంపరుగా!  అసలు గ్రహింపు లేకుండా ఉంది నీకు,”  గట్టిగా కోప్పడింది అమ్మ...

**

అమ్మ కోపానికి భయమేసి, స్కూల్ నుండి వచ్చాక ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఇవాళ అప్పుడే మూడో రోజు.  పుస్తకాలు ముందు పెట్టుకొని కూర్చున్నాను.  దిగులుగా అయిపోయాను.‘ఎలాగైనా నాన్నతో మాట్లాడి, అమ్మ కోపం పోగొట్టి, డాన్స్ చూడ్డానికి  వెళ్ళాలి.  అసలు డాన్స్ నేనెందుకు నేర్చుకోకూడదు? అమ్మా వాళ్ళని  అడగాలి’ అనుకున్నాను.ఒక వారంలో ఎగ్జామ్స్  అయ్యాక, అమ్మ హ్యాపిగా ఉన్నప్పుడు డాన్స్ విషయం అడగాలని డిసైడ్ అయ్యాను....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattistE koti