Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddam

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

సిక్స్ ప్యాక్ చేయాల‌ని ఉంది కానీ... నాగ‌శౌర్య‌

యువ‌త‌రం హీరోల్లో జోరు చూపిస్తున్నాడు నాగ‌శౌర్య‌. త‌న‌కు సూట‌య్యే ప్రేమ క‌థ‌ల్లో ఇమిడిపోతూ.. ఈత‌రం దృష్టిలో ప‌డిపోయాడు. తొలిసారి మాస్ పాత్ర‌లో `జాదూగాడు` అవ‌తారం ఎత్తాడు. అయితే ఇది కేవ‌లం రిఫ్రెష్‌మెంటేన‌ట‌!  అస్త‌మానూ ల‌వ్ స్టోరీలే చేస్తూ కూర్చుంటే బోర్ కొ.ట్టేస్తుంద‌ని.. ఇలా మాస్ బాట ప‌ట్టాడ‌ట‌. `జాదూగాడు` ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఈ సంద‌ర్భంగా నాగశౌర్య‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇది


* హాయ్ నాగ‌శౌర్య‌
- హాయండీ.

* జాదూగాడు థియేట‌ర్లో వ‌చ్చేస్తోంది. టెన్ష‌న్ ఏమైనా ప‌డుతున్నారా?
- కొంచెం ఉందండీ. ఎందుకంటే... కాస్త మాస్ షేడ్స్ ఉన్న పాత్ర తొలిసారి చేశా. ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే టెన్ష‌న్ ఉంది.

* థియేట‌ర్లో సినిమాలు చూస్తుంటారా?
- ఓ.. త‌ప్ప‌కుండా చూస్తానండీ. నేనేదో హీరో అయిపోయా అని ఎప్పుడూ పోజులు కొట్ట‌ను. ప్రెండ్స్‌తో స‌ర‌దాగా ఫ‌స్ట్ షో.. సెకండ్ షోల‌కు వెళ్లిపోతుంటా. `జాదూగాడు` కూడా అలానే ప్రెండ్స్‌తో చూస్తా.

* మీ సినిమాని మీరో ప్రేక్ష‌కుడిగానే చూస్తారా?
- ఎంత చూడాల‌నుకొన్నా అలా చూడ‌లేమండీ.  మ‌న త‌ప్పులు మ‌నకు క‌నిపిస్తుంటాయి. ఈ సీన్లో ఇలా చేశానేంటి?  అని అనిపిస్తూనే ఉంటుంది. డాన్సులు బాగా చేశానా, లేదా?  అనేది చెక్ చేసుకొంటూ ఉంటా. నిజం చెప్పాలంటే నా సినిమా నేను చూస్తే.. తెర‌పై న‌న్ను మాత్ర‌మే చూసుకొంటుంటా.

* మీ సినిమా రిపోర్ట్ మీకు ఎప్పుడు అందుతుంది?
- అంత టైమ్ ఏం ప‌ట్ట‌దు.  ఫ‌స్ట్ డే.. ఫ‌స్ట్ షోకే తెలిసిపోతుందండీ.

* సినిమా బాగుందా, లేదా అని నిక్క‌చ్చిగా చెప్పేదెవ‌రు?
- ఇంకెవ‌రు.. ఫ్రెండ్సే. `అరె.. ఈసినిమా లైట్ తీసుకోరా` అని చెప్పారంటే.. ఆ సినిమా అయిపోయిన‌ట్టే.

* ఇప్ప‌టి వ‌ర‌కూ మీకు ఏ సినిమాలో మీ పెర్‌ఫార్మ్సెన్ న‌చ్చింది?
-  చంద‌మామ క‌థ‌లు. అదో డిఫ‌రెంట్ స్టోరీ. ఎనిమిది క‌థ‌ల మ‌ధ్య నేనెవ‌రో , నా క‌థేమిటో ప్రేక్ష‌కులు గుర్తుప‌ట్టాలంటే నేను క‌ష్ట‌ప‌డి న‌టించాల్సిందే అనే క‌సితో చేశా.

* ఊహ‌లు గుస‌గుల‌లాడే బాగా హిట్ట‌య్యింది క‌దా. ఆ సినిమా సంతృప్తినివ్వ‌లేదా?
- సినిమా చేస్తున్న‌ప్పుడు చాలా టెన్ష‌న్ ప‌డుతూ చేసిన సినిమా అది. ఎందుకంటే హీరోగా ఫ‌స్ట్ టైమ్. ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకొంటారో తెలీదు. అందుకే అంత టెన్ష‌న్‌. సినిమా బాగుంద‌న్న రిపోర్ట్ వచ్చినా రిలాక్స్ అవ్వ‌లేదు. ఆ ఎంజాయ్‌మెంట్ నాకు క‌నిపించ‌లేదు. ఆ త‌ర‌వాత టీవీలో సినిమా చూస్తే.. చాలా హ్యాపీగా అనిపించింది. మంచి సినిమా చేశానన్న తృప్తి అప్పుడు మిగిలింది.

* ద‌ర్శ‌కుల విష‌యాల్లో జోక్యం చేసుకొంటార‌ని బ‌య‌ట టాక్‌...
- అబ్బే అంత లేదండీ. నా ప‌ని నాకిచ్చిన పాత్ర చ‌క్క‌గా చేయ‌డ‌మే. క‌నీసం ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రు?  అని కూడా అడ‌గ‌ను. అదంతా ద‌ర్శ‌కుల ప‌ని. నా సినిమాల‌కు నేనే డైరెక్ష‌న్ చేసుకొంటే. ల‌క్ష్మీ రావె మా ఇంటికి బాగా హిట్ట‌యిపోదునేమో.. (నవ్వుతూ)

* మీకు మంచి హైట్‌.. సిక్స్ ప్యాక్ చేయొచ్చు క‌దా..?
- నాకూ ఆ ఆలోచ‌న వ‌చ్చింది. కానీ ఫ్రెండ్స్ వ‌ద్ద‌న్నారు. ఇప్పుడు సిక్స్ ప్యాక్ చేసి యాక్ష‌న్ సినిమాలు చేస్తావేంటి?  నీకంత లేద‌న్నారు. ఇంకా నాది ల‌వ్ స్టోరీలు చేసే వ‌య‌సే. బాడీ పెంచితే ఆ క‌థ‌లు దూర‌మైపోతాయి.

* మీలో ప్ర‌భాస్ పోలిక‌లు కొన్ని క‌నిపిస్తాయి..
- ఈ మాటే చాలామంది అన్నారు. అదో కాంప్లిమెంట్‌గా స్వీక‌రిస్తా. 

* మీ కంటూ ఏమైనా ల‌వ్ స్టోరీ ఉందా..?
- ల‌వ్ స్టోరీలు చేస్తున్నానంతే. ల‌వ్ చేయ‌డం లేదు. ఏ అమ్మాయి న‌న్ను ప్ర‌పోజ్ చేయ‌లేదు.

* ఈ జ‌ర్నీ హ్యాపీగానే ఉందా?
- ఎక్క‌డండీ నా జ‌ర్నీ ఇంకా మొద‌లుకాలేదు. జాదూగాడు సినిమాతో నా ప్ర‌యాణం మొద‌లవుతుంద‌నుకొంటున్నా. ఈ సినిమా హిట్ట‌యితే.. నాపై నాకు ఇంకా న‌మ్మ‌కం వ‌స్తుంది. అప్పుడు కొత్త క‌థ‌లు చేసే ఛాన్స్ దొరుకుతుంది.

* యాక్ష‌న్ క‌థ‌లు ఇలా చేస్తూనే ఉంటారా?
- అప్పుడ‌ప్పుడూ ట్రై చేస్తా. నా ఫోక‌స్ మంచి ల‌వ్ స్టోరీల‌పైనే.

* ఒకే ఆల్ ది బెస్ట్
- థ్యాంక్యూ.

మరిన్ని సినిమా కబుర్లు