Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilians attracted to  ami jakson

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్‌తో ఛాన్స్‌ వదులుకుందా?

rakul leave chance with mahesh


రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తెలుగులో బాగా డిమాండ్‌ ఉన్న హీరోయిన్‌. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘లౌక్యం’ సినిమాలతో రకుల్‌ అందుకున్న విజయాలు ఆమెను బిజీ హీరోయిన్‌ని చేసేశాయి. రామ్‌చరణ్‌తో ఓ సినిమా, ఎన్టీఆర్‌తో ఇంకో సినిమా చేస్తున్న రకుల్‌ మరికొన్ని ఆఫర్లతో చాలా బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉందంటే, మహేష్‌తో నటించే అవకాశం వచ్చినా ఆ సినిమాలో చేయలేనంత బిజీగా. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌ హీరోగా ‘బ్రహ్మోత్సవం’ అనే సినిమా రానుంది. అందులో హీరోయిన్‌గా నటించమని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని అడిగారట. అయితే తన కాల్షీట్స్‌ అస్సలు ఖాళీ లేవని తెలుసుకున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సినిమా చెయ్యలేకపోతున్నందుకు బాధపడ్తున్నానని దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలకు చెప్పిందట. రకుల్‌ నో చెప్పడంతో ఆ ఛాన్స్‌ సమంతను వరించినట్లు సమాచారమ్‌. ఇంత పెద్ద ఆఫర్‌ని వదులుకుందంటే రకుల్‌ ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ మహేష్‌, పవన్‌ లాంటి స్టార్స్‌తో నటించే అవకాశం రావడం అదృష్టం. అది ఇంకోసారి రకుల్‌ తలుపుతడ్తుందా?

మరిన్ని సినిమా కబుర్లు
bunny super collections for satyamurty