Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rakul leave chance with mahesh

ఈ సంచికలో >> సినిమా >>

టాక్‌కి భిన్నంగా కొల్లగొడ్తున్న బన్నీ

bunny super collections for satyamurty

డివైడ్‌ టాక్‌ వచ్చిన సినిమాలు నిలదొక్కుకోవడం చాలా అరుదు. ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగిపోయినప్పుడు, వాటిని అందుకోలేక చతికిలపడితే, పరాజయం చాలా ఘోరంగా ఉంటుంది. కానీ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ అంచనాలకు భిన్నంగా టాక్‌ సంపాదించుకున్నా వసూళ్ళు మాత్రం కొల్లగొడుతుంది. 40 కోట్ల పై చిలుకు ఇప్పటికే వసూలు చేసి, హిట్‌ చిత్రం అనిపించుకోడానికి పరుగులు తీస్తుంది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఆడియన్స్‌, ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ సినిమాని నిలబెట్టేశాయని అంటున్నారు ట్రేడ్‌ పండితులు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా అల్లు అర్జున్‌, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాలో కనిపించాడు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత అలాంటి ఎమోషనల్‌ సీన్స్‌తోనే ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ని రూపొందించిన త్రివిక్రమ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పాళ్ళు తగ్గించినా ఆడియన్స్‌ని మెప్పించగలగడం గొప్ప విషయం. టాలీవుడ్‌ టాప్‌ 5లోకి ఖచ్చితంగా ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
 

మరిన్ని సినిమా కబుర్లు
tapsee believe larence