Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattistE koti

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ : జెంబా స్టేషన్లో పాతకాలం నాటి ట్రైన్ చూసి అబ్బురపడతారు జీవన్ బృందం. భోజనాల దగ్గర నాన్ వెజ్ తప్ప మరేమీ లేకపోవడంతో పాతికేళ్ళ అలవాటు మానుకుని శనివారం నాడు నాన్ వెజ్ తినాల్సొస్తుంది జీవన్ కి. ఎటుచూసినా పచ్చదనంతో కన్నుల పండుగగా ఉంటుంది అక్కడి వాతావరణం...ఆ తర్వాత....

హైదరాబాదు నుంచి ఫోనొచ్చింది సలీంకి. గబగబా దగ్గరకొచ్చి ఇండియాకి రెండు టిక్కెట్లు ఏర్పాటు చెయ్యండి చాలా అర్జంటు అని జార్జి ప్రసాద్ దగ్గరకెళ్ళి “ప్రసాదు భాయి నేనూ మా సిస్టరూ అర్జంటుగా వెళ్ళాల్సిన పని పడింది. చాలా అర్జంటు, దయచేసి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చెయ్యండి” అనేసి హడావుడిగా బయల్దేరాడు.వెళ్ళే ముందు కూడా ఫోనేం చెయ్యలేదు షహనాజ్. ఏవయ్యుంటది అన్న సందిగ్ధంలో పడిపోయేడు జీవన్.

“ఉన్నట్టుండి బయలుదేరిపోతున్నారేంటీ ఏవయి ఉంటుంది..?” అనడిగాడు జార్జి ప్రసాద్ ని.

“ఏమో సార్, ఇక్కడి కొచ్చినప్పట్రుంచీ నాతో కూడా ఏం మాటాడ్డం లేదు. మొన్న నేనే నోరు తెరిచి అడిగితే మాట మార్చేశాడు సలీం భాయ్” అన్నాడు జార్జి ప్రసాద్.

“ఆ డాక్టర్ అబూకి వజీర్ పెట్టిన గడువు ఇంకా రెండు రోజులుంది. ఏవన్నా జరక్కూడనిది జరిగిందంటావా..?” అన్నాడు జీవన్.

“ఏమోనండీ” అనెళ్ళిపోయాడు. అంతా బస్సెక్కుతున్నారు.

షూటింగ్ లేంగ్ విమల్ట్ మౌంటెన్స్ దగ్గరట.ఆ కొండల మీద ఎక్కడ చూసినా మంచు కప్పబడి ఉంటుంది. మంచు తప్ప మరింకేం చూడలేం. భలే లొకేషను, అక్కడికి “ఇంత లేటుగా వెళ్ళడం ఏంటి..?” అన్నాడు జీవన్, డైరెక్టర్ వేగేష్ తో.

“షెడ్యూల్ చివర్లో వెళదాం అనుకున్నాం, ఇక రెండు రోజులేగా షూటుంగ్” అన్నాడు వేగేష్.

యోగి, జీవన్ బస్సెక్కారు.

“ఈరోజు ఎండ విపరీతంగా ఉంది గదా చందర్రావు గారూ..?” అన్నాడు జీవన్.

“మన ఎండల ముందు ఇదెంతలెద్దురూ..! ఏవండీ మంచు కొండల సీనరీలో మనిద్దరం ఫోటోలు దిగుదాం ఏవంటారు...? రాజమండ్రి వెళ్ళాకా ఈ ట్రిప్పులో ఫోటోలన్నీ పెద్ద అల్బమ్ చేయిస్తాను. మా వీధిలో వాళ్ళూ, మిత్రులూ, శత్రువులూ వాటిని చూసి తెగ మురిసిపోవాలి ఏవంటారు..?” అన్నాడు.

కొండ దిగిన బస్సు ఇంతకు ముందొచ్చినప్పుడు మేం స్టే చేసిన “ఓబర్ పెర్ ప్యూస్” అనే ఊరుని టచ్ చేసి అట్నుంచి మళ్ళీ ఘాటీ ఎక్కింది.చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత వచ్చాయి లేంగ్ విమౌల్డ్ మౌంటెన్స్. పైకెళ్ళాలంటే ఎలక్ట్రికల్ కార్లెక్కాలి.ఆ లోకేషన్ చూసిన జీవన్ నోట్లోంచి మాట రాక అలా ఉండిపోయాడు.

ఇది వరకు మేం చూసినవి ఇవేనా..!? అనిపించింది. మొత్తం మంచంతా కరిగిపోయింది. కొండలన్నీ బోడి గుళ్ళు గీయించుకున్నట్టున్నాయి. వేణు దగ్గరకొచ్చిన డైరెక్టర్ వేగేష్ “ఇదేంటి సార్, చాలా గొప్పగా అనుకున్న ఈ లొకేషనిలాగుంది..?” అన్నాడు.

“నలభై సంవత్రరాల నుంచి ఇంత ఎండ ఎప్పుడూ కాయలేదట. ఈ ఏడాది కాసిన ఎండకి మొత్తం మంచు కరిగిపోయింది” అన్నాడు.అప్సెట్టయిపోయిన వేగేష్ “అందర్నీ దిగమనండి మొదలెడదాం” అంటునాడు.

అంతలో కొందరు జనం ఆ కొండల్లోంచి ఒక డెడ్ బాడీని మోసుకుని వస్తున్నారు. ఏంటా అని జీవన్, వేణు, యోగి అటెళ్ళారు.ముప్పై ఏళ్ళ క్రితం కెనడా నించి భార్యా భర్త పదేళ్ళ కుర్రాడూ ఈ టూరిస్టు ప్లేస్ కొచ్చారట. ఈ మంచు కొండలో ఆడుకుంటూ లోపలికెళ్ళిన ఆ కుర్రాడు మంచులోపలికి దిగబడిపోయి ఎంత వెతికినా కనబడలేదట. ఇన్నేళ్ళ తర్వాత కాచిన ఎండకి మంచు మొత్తం కరిగిపోవడంతో ఆ శవం బయట పడింది. దగ్గరకెళ్ళి చూస్తే ఇప్పుడే పది నిమిషాల క్రితం ప్రాణం పోయినట్టుంది.

ఆ మర్నాడు కెనడా నించి ముసలోళ్ళయిపోయి వచ్చిన ఆ కుర్రాడి తల్లిదండ్రులు ఆ శవాన్ని ఒక వేన్ లో ఎక్కించుకు తీసుకెళ్ళారట.

అక్టోబర్ – 10

ఆరోజు ఈ ఆస్ట్రియా షెడ్యూలుకి చివరి రోజు.

ఫెస్టంగ్స్ అనే లొకేషన్లో షూటింగ్ చేస్తుండగా ఇన్స్ బ్రూక్ నించి సినీటిరోల్ ఆస్ట్రియన్ ఫిలిం కమీషన్ వాళ్ళిచ్చారు. వాళ్ళంతా కో – ఆర్డినేటర్ వేణుకి ఫ్రెండ్స్. వాళ్ళతో ఈ సినిమా కేసేట్ ఓపెన్ చేయించారు.వర్షం మొదలైంది.మూడు గంటలకి షూటింగ్ పూర్తవ్వగానే అందరూ లంచ్ చేసేశాకా బయల్దేరిన బస్సు కూఫ్ స్టన్ మీదుగా ముంచెన్ వెళ్ళి అక్కడ్నించి మ్యూనిక్ ఎయిర్ పోర్ట్ కొచ్చింది.రాత్రి ఎనిమిది గంటలకట దుబాయ్ ఫ్లైట్.

ఎయిర్ పోర్ట్ లో ఉన్న రకరకాల షాప్స్ లో... చెక్ ఇన్ అని వితిన్ బ్రాకెట్స్ లో “లాస్ట్ మినిట్ షాపింగ్” అన్న పేరు గల షాపు పేరు చాలా నచ్చింది.

ఇంకా చెక్ ఇన్ టైం అవ్వలేదు గాబట్టి ఎయిర్ పోర్టంతా తిరుగుతున్నారు యూనిట్లో జనం. జీవన్ ని ఎక్కడికెళ్ళినా ఏం చేస్తున్నా వెళ్ళిపోయిన షహనాజ్ గుర్తుకొస్తుంది. ఆమె నీలి కళ్ళు గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఆ మర్నాడు పద్నాలుగో రోజు ఏం జరగబోతుందా అన్న ఉత్కంఠ. గిలగిల్లాడుతున్నాడు జీవ.

ఒక పక్క చెక్ ఇన్ టైమవుతుంది. ఇంకా టిక్కెట్లు కన్ ఫర్మ్ కాక చాలా టెన్షన్ తో తిరుగుతున్న వేణు ని గోవిందెళ్ళి ఏవో అడిగితే లాగిపెట్టి కొట్టేసేడు.

అందరికంటే ముందు యోగికివ్వాలి. కానీ, ఆ క్లాసులో జర్ని ఎంజాయ్ చేస్తాను అని చందర్రావు రిక్వెస్ట్ చెయ్యడంతో అతనికిచ్చారు.లోపలికెళ్ళారు.

ఇందాక కనిపించిన షాపే ఇంకోటి చెకవుట్ అని వితిన్ బ్రాకెట్స్ లో “లాస్ట్ మినిట్ షాపింగ్” అని రాసి ఉంది. ఇది మన ఇండియాలో ఏ ఎయిర్ పోర్ట్ లో అన్నా ఎవరన్నా కాపీ కొట్టి ఈ షాపు పేరు పెడితే బాగుండును అనిపించింది. ఆ షాపులోకెళ్ళిన యోగి ఒక ఉలెన్ టోపీ పెర్ఫ్యూమ్సూ కొన్నాడు. చెక్ ఇన్ దగ్గర మెటల్ డిటెక్టర్ స్కేనింగ్ లో గోవిందు మోకాలు కింద కుయ్... కుయ్... మని సౌండు రావడం, వాళ్ళు మమ్మల్నందర్నీ ఆపెయ్యడం. వేణూ వాళ్ళని ఎంత కన్విన్స్ చెయ్యడానికి ట్రై చేసినా వాళ్ళు అవ్వకపోవడం. ఎప్పుడూ లేనంత చిరాకు పడిపోయాడు వేణు. చివరికి ఎప్పటికో వదిలారు.ఫ్లైట్ లోపలకెళ్ళాకా జీవన్ పక్కనే చేరాడు చందర్రావు. వాళ్ళకి కాస్త దూరంగా ఉన్న సీట్లో కూర్చుని ఉన్న నాలుగేళ్ళ పిల్లకి ఆడుకొమ్మని బొమ్మనిచ్చింది ఏయిర్ హోస్టెస్.

“నాకూ కావాలి” అన్నాడు చందర్రావు.

“ఎందుకూ..?” అన్నాడు జీవన్.

“మా మనవడికి ఆడుకోవడానికిస్తాను” అన్నాడు.

“మనం ఎనిమిది గంటల పాటు లాంగ్ జర్నీ చేస్తున్నాం గాబట్టి చిన్న పిల్లలకి మట్టుకే ఇస్తారు. అయినా ఫ్లైట్ దిగాకా తిరిగి ఇచ్చెయ్యాలి అవి” అన్నాడు జీవన్.

“తిరిగి ఇచ్చేసే దానికి తీసుకోడం ఎందుకు లేద్దురూ” అని ఏదో గుర్తొచ్చినట్టు పెద్దగా అరిచాడు.

ఏవయిందన్నాడు జీవన్.

చెప్పడం లేదు చందర్రావు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika