Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atidhi satkaram

ఈ సంచికలో >> కథలు >> అప్పారావూ-అప్పర్ బెర్తూ

2nd story

 రైల్వేస్టేషన్లో అనౌన్స్ మెంట్ బయటికి వినిపిస్తోంది.' దయచేసి వినండి ! బెంగుళూరు కాచీగూడా ఎక్స్ ప్రెస్ ఐదవనెంబర్ ప్లాట్ ఫాం మీద నిలచి ఉన్నది .' అప్పారావు హడావిడిగా రైల్వేస్టేషన్ చేరుకుని, అనౌన్స్ మెంట్ విని, ' రైల్ నిలచి ఉండక పండుకోని ఉంటుందా! ఏదో ములిగి పోయినట్లూ ఈ అనౌన్స్ మెంట్ ' అని గొణుక్కుంటూ, బ్యాటరీ కార్ కోసం చూశాడు. ఐదో నెంబరు  ప్లాట్ ఫాం కెళ్ళాలంటే  అప్పారావుకు వీల్ ఛైర్ అవసరం తప్పనిసరి. కనుచూపు మేరలో కాన రాలేదు. అక్కడ ఉన్న రైల్వే పోర్టర్ " సార్ ఎక్కడికెళ్ళాలి? " అని అడిగాడు, అప్పారావును  ఎగా దిగా చూస్తూ. "కాచీగూడా ఎక్స్ ప్రెస్ కెళ్ళాలోయ్! బేటరీ కార్ వస్తుందా?" " అదెక్కడుందో తెలీదుసార్! మీ లగేజ్ నేను తెచ్చి మీ బోగీలో పెడతాను రండి సార్! ఈ మెట్లమీదుగా వెళదాం '”అన్నాడు. " నేను మెట్లెక్కలేనయ్యా! నాకు బీ.పీ, షుగరూనూ, కాస్తంత బ్యాటరీ  ఛైర్ కారు పిలుద్దూ!" అన్నాడు బ్రతిలాలుతూ. " సార్! మీ లగేజీకి మూడు వందలివ్వండి, నేనెళ్ళి వీల్ ఛైర్ తెస్తాను, మిమ్మల్ని ఐదో నెంబర్ కు నెట్టుకుంటూ తీసుకెళ్తాను. సరా?"  అన్నాడు.  ఇహ తప్పదని " సరే వెళ్ళి తీసుకురా! రెండొంద లిస్తాన్లేవోయ్! ఒక్క బేగేగా " అన్నాడు అప్పారావ్.

" సార్ మిమ్మల్ని నెట్టు కెళ్ళేందుకే మూడొందలు సార్ బేగ్ ఫ్రీ! ఆపైన మిమ్మల్నీ  మీ సామాన్నూ తెచ్చి బోగీలో పెట్టాలా? మీ లాంటి వారిస్తేనే కదా మాలాంటోళ్ళు బతికేది, పొట్ట చేత బట్టుకుని ఆంధ్రానుంచీ వచ్చాను సార్!"  అంటూ తనబాధ వెళ్ళగక్కాక ఇహ తప్పదని ” సరే వెళ్ళిపట్రాపో  రైల్ కదుల్తుందేమో!" అన్నాడు అప్పారావ్ కంగారుగా." " నేను హామీ సార్ రైల్ కదిల్తే మీకే ఐదొందలిస్తాను." పోర్టర్ లాజికల్గా అన్నాడు.."నీ ఐదోంద లెందుగ్గానీ నా త్రీ టైర్ ఏసి టికెట్ పదిహేను వందలూ పోతుందోయ్! రైల్ పోతే , వెళ్ళుత్వరగా.."అని అప్పారావ్ తొందర చేయగానే , పక్కకెళ్ళి పోర్టర్ ఎవరికో ఫోన్ చేశాడు. పదినిముషాలైనా వీల్ చైర్ రాలేదు.అప్పారావ్ కంగారు పెరిగింది. "ఏదయ్యా వీల్ చైరూ? వస్తుంది వస్తుంది అంటూనే ఉన్నావ్!" వాచీ చూసుకుంటూ అన్నాడు అప్పరావ్  ." కంగారొద్దు సార్ ! వస్తుంది. " అంటూ మళ్ళీ ఫోన్  చేసి " బేగిరావోయ్ ! సార్ ! కంగార్పడు తుండ్రు. , పోనీ బేటరీ కారు పట్రా , రైల్ కదులుద్ది" అంటూ తొందర చేయగా , మరో పది నిముషాల్లో బేటరీ కార్ వచ్చింది.

దాన్లో వెనక అప్పారావ్ ఎక్కలేక అవస్త పడుతుంటే ఇద్దరూ కల్సి చేతులు పట్టి సీట్ పైకి లాగారు. " సార్ టైమవుద్ది నేనూ ఈ కార్లో నే వచ్చి లగేజ్ బోగీలో పెడతాను." అంటూ వాడూ డ్రైవర్  పక్కనెక్కి కూర్చున్నాడు. పది నిము షాల్లో బ్యాటరీకారు వెళ్ళి ఐదో నెంబర్ ప్లాట్ ఫాం మీద , భ్2 బోగీవద్ద ఆగడం , ఇద్దరూ పట్టుకుని అప్పారావ్ ను దింపి రైల్ బోగీ లోకి ఎక్కి చేతులు పట్టి లోనికి లాగడం,ఆ పైన బెర్త్ వరకూ వెళ్ళి బేగ్ పెట్టడం నిముషాల్లో జరిగిపోయింది.  " మీ బెర్త్ అప్పర్ సార్ ! రైల్ కదులుద్దేమో డబ్బివ్వండి సార్!" అనితొందర  చేసి మూడొందలూ తీసుకుని పోర్టర్ దిగిపోయాడు. అప్పారావ్  అయోమయంగా ‘ మూడొందలిచ్చింది తనబ్యాగ్ మోసినందుకో తనతోపాటు బోగీవరకూ పోర్టర్ బ్యాటరీ కారులో వచ్చినందుకో  అర్ధం కాక , వాస్తవానికి వచ్చి  అప్పర్ బెర్త్ వేపు ఎగాదిగా చూసుకుంటూ క్రింద సీట్లో కూర్చున్నాడు. పక్కనే ఉన్న మహిళ జరిగి చోటిచ్చింది. రైల్ కదిలింది.

ఇక్కడ మా అప్పారావుగురించీ ఒక్కమాట చెప్పుకోవాలి.మావాడు కాస్తంత పొట్టిగా మరీ కాదనుకోండీ ఐనా ఐదడుగుల భారీ విగ్రహం, కొంచెం పొట్ట , ఐతే తెల్లగా మల్లెపూవ్వులా ఉంటాడు, దానికి ఈడూ జోడూగా ఉండే తెల్లబట్టలే ఎప్పుడూ వేసుకుంటా డు హుందాగా. నడుస్తుంటే’ చిన్నపాటి తెల్లేనుగు నడిచి నట్లుంటుందని’ అంతా  అనుకుంటారు గుస గుసగా. ఆగుస గుసలు అప్పారావుకూ తెల్సు. నవ్వి ఊరుకుంటాడు. బస్సెక్కాలంటేనే మావాడికి కష్టం , బస్సుకుండే మూడు, నాల్గు మెట్లూ ఎత్తుగానే ఉండటాన మావాడికి ఎవరై నా’ చే’సాయం చేయక తప్పదు. అందుకే మా అప్పారావు తనవెంట పనీ పాటాలేని పాపారావును వేసుకు తిరుగు తుంటాడు. వాడికి డ్ఫ్ అదేనండీ! ‘ దండగ పిండం ‘ పెడుతూవాడి ‘ చే ‘సాయం బదులడుగు తుంటాడు.    

ఓమారేమైందంటే అప్పారావు బాబాయి’ కూతురి పెళ్ళి కుదిరిందనీ తాంబూలాలు పుచ్చుకోను రమ్మనీ ‘ చరవాణి తో కబురు చేశాడు. హైదరాబాదెళ్ళాలంటే బెంగుళూరు నుంచీ యస్వంత పూర్ రైల్వేస్టేషన్ కెళ్ళి రైలెక్కి హైదరాబాదు చేరాలి. పాపారావును పంపి టికెట్ బుక్ చేయించాడు. అప్పర్ బెర్త్ వచ్చింది.  " నీవూ రారాదు టోయ్ సరదాగా?" అని అప్పారావన్న దానికి " నాకు రైల్ పడదన్నా! ఈ ఊర్లో వరకూ నీ వెంటే ఉంటాగా?" అన్నాడు. టీ. సీని బ్రతిమాలాడు అప్పారావు . " ఒక్క లోయర్ బెర్త్ ఇప్పిం చండి సార్ ! పైకెక్కలేను," అని. అతగాడు " ఖాళీలే లేవండీ! మీరెవర్నైనా అడగండి, వాళ్ళొప్పు కుంటే అడ్జెస్ట్ చేస్తాను." అన్నాడు. అప్పారావ్ కి వళ్ళుమండింది " వాళ్ళొప్పు కుంటే మీరేందీ అడ్జెస్ట్ చేసేది? ఐనా నేను లోయర్ బెర్త్ కోసం అప్లై చేస్తే నాకీ అప్పర్ బెర్త్ ఎలా ఇస్తారండీ! మీ రైల్వే వారి కసలు మనస్సే ఉండదా? డబ్బులు గుంజడ మే నా? " అని కడుపుమంట వెళ్లబోసు కున్నాడు . " నేనేం చేయనండీ టికెట్ చెక్ చేయడమే నాడ్యూటీ. " అంటూ వెళ్లాడతను. ఇహ వేరేదారిలేక  పాపం అప్పారావ్ పై కెక్క లేకా ఎవ్వరూ పైకెక్కను ఒప్పుకోకా, అప్పర్ బెర్త్ వైపు చూస్తూ లోయర్ బెర్త్ లమ ధ్య న క్రింద దుప్పటి పరుచుకు పడుకున్నాడు. రాత్రులు ఒంటి కెళ్ళేవారంతా అప్పారావును తొక్కుకుంటూ వెళ్ళేవారే! అప్పారావూ బాత్ రూం కెళ్లాల్సి , పైకి లేవ లేక పక్కనే ఉన్న లోయర్ బెర్త్ మీద చేతులు పెట్టి లేవబోగా అక్కడ పడుకున్న మహిళకు చేతులు తగిలి ఆమె , పెద్దగా కేకలేసి , ఆమె భర్తను పిలిచింది. అతగాడు వచ్చి లైట్లేసి " ఏమయ్యా ! తెల్లగుడ్డ లేసు కుని  చూట్టానికి  మర్యాదున్నవాడిలా ఉన్నావ్?

వయస్సులోనూ పెద్దవాడివి? సిగ్గూ బిడియం లేదా! ఆడవాళ్ల మీద చెయ్యే స్తావా? నాభార్య నగలుంకొట్టేయాలని చూస్తావా? తెల్ల గుడ్ద లేసుకున్న దొంగ వెధవ్వాయేం? అసలి లాంటి వాళ్ళ నిక్కడ ఎలా పడుకో నిచ్చాడయ్యా టీ.సీ. ఎక్కడ ఆటీసీ ?" అంటూ కేకలేయ సాగాడు. అంతా వచ్చి చుట్టు ముట్టారు. అప్పారావు  పైప్రాణం పైనే పోయినట్లైంది, పైకి లేవలేక అలాగే బాసిం పెట్లేసు కుని క్రిందనే కూర్చుని తల మాత్రం పైకెత్తి నిస్సహాయంగా చూడసాగాడు. "అయ్యా! నాది అప్పర్ బెర్త్ ! ఎక్కలేనంటే ఎవ్వరూ ఎడ్జెస్ట్ అవలేదు. మీరంతా పడుకున్నారాయె !  నేనెక్కడ కూర్చోను ? అందుకే ఇక్కడ పడుకున్నా.బాత్ రూంకెళ్ళా ల్సి లేవలేక ఈ బెర్త్ ను ఊతకోసం పట్టుకున్నా నయ్యా! అంతే కావలిస్తే ఇదిగోండి నా టికెట్ చూడండీ! అంటూ జేబులోంచీ టికెట్ తీసి చూపాడు. అంతా నమ్మారు.'పాపం పాపం ' అనుకున్నారు, ఏమనుకున్నా డో ఏమోకానీ ఆమహిళ భర్త " సారీ సార్! నేను పైకెక్కుతాను. మీరు నా లోయర్ బెర్త్ లో పడుకోండి, " అంటూ చేసాయం చేసి అప్పారావ్ను క్రిందనుంచీ లేపాడు.ఆమహిళ  ,   " క్షమించండి అన్నయ్యగారూ ! భయపడ్డాను" అంది తలవంచుకుని. " సహజంలేమ్మా! రోజులట్టా వున్నై  " అన్నాడు అప్పారావ్. " మీరీ బెర్త్ మార్పు ఆయనడిగినప్పుడు ఇందాకే చేస్తే ఈగోల లేకపోనుకదండీ!

భయంతో నాగుండె రెండొందలమార్లు కొట్టుకుంటున్నది " అంటూ భర్తకు సన్నగా పోపు పెట్టిందావిడ. పాపం ఇది అప్పారావ్ మొదటి అనుభవం. ఆతర్వాత ఒకటా, రెండా ఎన్నో ఇలాంటి అనుభవాలు అప్పారావ్ కు. అదేం ఖర్మమో కానీ అప్పారావ్ టికెట్ కోసం వెళ్లాడంటే అన్నీ అప్పర్ బెర్త్ లే ఖాళీగా ఉంటాయి.లోయర్ బెర్త్ లన్నీ ఎప్పుడో ఐపోతాయి.  మొదటి అనుభవం తర్వాత అప్పారావ్ క్రిందపడుకోను భయపడి, అలాగే సైడ్ బెర్త్ వాళ్ళ పర్మిషన్ తో వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునేవాడు. వెయ్యీ, 12 వందలూ పెట్టి టికెట్ కొని కురుక్షేత్ర యుధ్ధంలో సహాయంకోసం వెళ్ళిన అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్ల వద్ద కూర్చున్నట్లు కూర్చునే వాడు. అతడి బాధ చూస్తూండేవారేకానీ ఒక్కరంటే ఒక్కరన్నా అతడికి లోయర్ బెర్త్  బదులిచ్చి నపాపానపోలేదు.అతడి బాధ చూస్తూండేవారేకానీ ఒక్కరంటే ఒక్కరన్నా అతడికి లోయర్ బెర్త్  బదులిచ్చినపాపానపోలేదు. వయసు చూసైనా రైల్వే టికెట్ డిపార్ట్ మెంట్ 60 దాటిన వయో వృధ్ధులకు లోయర్ బెర్త్ ఎందుకివ్వదో అప్పారావుకు తల బద్ద లు కొట్టుకున్నా అర్ధంకాదు.

అందరికీ సీనియర్ సిటిజన్స్ అంటే అమిత గౌరవం ఉన్నట్లు ఉత్తుత్త మాటలు మాట్లాడుతారు. అప్పర్ కెటూ [ పైకి ] వెళ్ళేవారేగనుక అప్పర్ బెర్త్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటారేమో అనుకుంటాడు అప్పారావ్ తనకు అప్పర్ బెర్త్ ఇచ్చినప్పుడల్లా. ఓమారు పాపారావ్ ఒక సలహా ఇచ్చాడు " మిత్రమా! పోనీ ఎక్కువ డబ్బుకట్టి అదేంటీ తత్కాల్ కొందామా! అడిగిన బెర్త్ ఇస్తా రుట!" అన్నాడు. ఆసంబడమూ తీరింది.హైదరాబాదులో ఉండే అన్నయ్య కు వంట్లో బావులేదని ఫోనొస్తే అప్పటికపుడు తత్కాల్   టికెట్ 18 వందలు పోసికొని వెళ్తే అదీనీ అప్పర్ బెర్తే!" ఇదేంటోయ్ ! పాపారావ్! లోయర్ బెర్త్ అన్నావూ?" అంటే "తప్పక మారుతుందండీ! ఇది కన్ ఫర్ మేషన్ మాత్ర మే అందయ్యా ఆ టికెట్ కొట్టినావిడ!" అన్నాడు పాపారావ్.అప్పారావ్ కు ఒక డౌట్ కూడా ఉంది." రైల్వేవారు  టికెట్స్ కొట్టి సొమ్ముచేసుకోను ఇలా’ తత్కాల్ ’ అబధ్ధమాడుతున్నారాని. ఐనా ఈ తత్కాల్ టికెట్టంత మోసం మరోటిలేనేలేదుస్మీ! తత్కాల్ టికెట్ తో జర్నీ చేయాలి, లేకపోతే సొమ్ము మురిగ్గుంటకే అదే రైల్వే డిపార్ట్ మెంట్ కే. బోగీలో సీనియర్ సిటిజన్స్ అంతా ఒకటే గోల మాకు అప్పర్ బెర్త్ వచ్చిందంటే మాకూ అప్పరేనండీ ' ఎక్క లేమూ , నాకు 74 అని ఒకరూ’ నాకు ఎనభై ‘ అని ఒకరూ , 'నాకూ 65 ఐనా ఎక్కలేనండీ 'అని అప్పారావూ , ఇదండీ అప్పారావ్ ఎవర్ రిజర్వ్డ్ అప్పర్ బెర్త్ కధ!  

సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అప్పటికపుడు టికెట్ తత్కా ల్లో బుక్ చేసుకుని ఎలా సైడ్ లోయర్ బెర్తులు పొందు తారో అర్ధంకాక అప్పారావేగాక సీనియర్ సిటిజన్స్ అంతా అయోమయావస్థలో పడ్డారు. అప్పారావ్ ఒక కాయితం తీసి అందరి చేతా సంతకాలు చేయించి , ' మావయస్సు చూసైనా మాకు లోయర్ బెర్తులు ఎందుకు అలాట్ చేయరూ?’ అని –భ్1, భ్2, భ్3 బోగీలన్నీ తిరిగి సంతకాలు తీసుకున్నాడు , రైల్వే మంత్రికి పంపను. ఈ కాయితం ఆయన దాకా పోయి నప్పుడు అప్పారావ్ లాంటి వారి కష్టాలు తీరుతాయేమో చూద్దాం.. లెట్ అజ్ వైట్ అండ్ సీ..

మరిన్ని కథలు
buddhi vacchindi