Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 1st may  to 7th may

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిషం-విజ్ఞానం - శ్రీకాంత్

గత వారం జ్యోతిషం వైద్యం ను ఏవిధంగా మానవునికి అన్వయిన్చుకుందో తెలియజేసే ప్రయత్నంలో మరింత ముందుకు వెళ్దాం గతవారం రాశులు ఏ ఏ అంగాలను తెలియజేస్తాయో తెలుసుకున్నాం ఈ వారం మరింత లోతుగా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. నేడు మనం అందరం గొప్పగా ఎదిగాం వైద్యంలో కాని ఒక విషయాన్ని సునిశితంగా ఆలోచిస్తే మన పూర్వీకులు ఇవన్నీ మనకు ముందే తెలియజేసారు అనిపిస్తుంది మనం వాటిని మరింతగా పరిశోదన చేయుట ద్వార ఉన్నతమైన ఫలితాలను పొందుటకు అవకాశం ఏర్పడుతుంది. రోగాన్ని అలాగే రోగాకారకాన్ని గుర్తించే క్రమం చాలా విలువైనది అందుకే మన శాస్త్రాలు వైద్యున్ని నారయణునితో పోల్చారు అంటే భగవత్ స్వరూపం అన్నారు. మానవుని శరీరాన్ని గమనిస్తే మనకు చాల విలువైన విషయాలు గోచరిస్తాయి వాయువుని పిలుచుకోవడానికి స్వాసనాళం. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే జటరాశయం ఈవిధంగా చాలా అధ్బుతాలే కనభడుతవి. మన జ్యోతిషశాస్త్రంలో ఏ ఏ అంగాలకు వేటిని అధిపతులుగా తెలియజేసిందో తెలుసుకుందాం.


మానవ శరీర నిర్మాణం జ్యోతిషాన్ని బలపరుస్తుందా ?         


మానవుడు జన్మించిన కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని జాతకచక్రాన్ని వేస్తె ఆ సమయానికి సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో ఆయొక్క రాశిని జాతకుని యొక్క జన్మ లగ్నం అంటారు దీనినే తను భావం అంటారు. ఈ యొక్క తనుభావం శిరస్సు,మెదడు,సాధారణ ఆరోగ్య స్థితి, వ్యక్తీ యొక్క మానసిక అలాగే వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం వ్యక్తిత్వాన్ని గనుక తీసుకుంటే సైకాలజీ ప్రకారం తన చుట్టూ ఉన్న పరిసరాలు అలాగే ఒక వ్యక్తి పైన పనిచేసే భావనలు కావొచ్చు కాని తనని ప్రభావితం చేసే అంశాల వలన తన యొక్క విధానం ఉంటుంది అని తెలియజేస్తుంది. సరిగా ఇదే విషయాన్ని జ్యోతిషం తెలియజేస్తుంది. జాతకుని లగ్నం పైన శుభగ్రహాల ద్రుష్టి ఉన్న,లగ్నం పాపఆర్గలం కాకున్నా జాతకుని వ్యక్తిత్వం బాగుంటుంది అని తెలుపుతుంది. మిగితా భవాలు ఏవిధంగా అవయవాలను తెలియజేస్తాయి క్లుప్తంగా తెలుసుకుందాం.

ద్వితీయభావం :- రెండవ భాగాన్ని ద్వితియం అంటారు ఈ భావంలో ముఖం,నోరు , నాలుక , కళ్ళు, దంతాలు, రుచి మొదలైనవి తెలియజేస్తుంది.

తృతీయభావం :- మెడ,మెడచర్మం,కుడి చెవి,ముక్కు,గొంతుల యొక్క అనుసంధాన విభాగాలు తెలియజేస్తుంది.

చతుర్థభావం :- ఛాతీ అలాగే ఛాతీలోని నిర్మాణవ్యవస్థ , ఊపిరితిత్తులు, హృదయం మొదలైన విభాగాలను తెలియజేస్తుంది.

పంచమభావం :- కడుపు పై భాగం,జీర్ణాశయం, కాలేయం , క్లోమం , ఉదరనాడులను తెలియజేస్తుంది.

షష్టమభావం :- ప్రేవులు,కటివెన్ను పై భాగం,కాలేయపు ఒక భాగం, మూత్రపిండాలు మొదలైనవి తెలియజేస్తుంది.

సప్తమభావం :- మూత్రనాళాలు,ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీలలో అండాశయం, పురుషులలో పురుష గ్రంధి తెలియజేస్తుంది.

అష్టమభావం :- స్త్రీ మరియు పురుషులలో బాహ్యజననఅంగాలు అలాగే విసర్జక అవయవాలు తెలియజేస్తుంది.

నవమభాగం :- తొడలు మరియు చర్మం అలాగే కటిఎముకలు తెలియజేస్తుంది.

దశమభావం :- మోకాళ్ళు అలాగే జానువులు తెలియజేస్తుంది

ఏకాదశభావం :- మోకాళ్ళ నుండి చీలమండలం వరకు గల కాలు అలాగే ఎడమచెవి తెలియజేస్తుంది.

ద్వాదశభావం :- పాదములు అలాగే ఎడమకన్ను తెలియజేస్తుంది.

పైన చెప్పిన భవాలు జాతకుని జన్మలగ్నం ఆధారంగా ఏర్పడుతాయి ఆలాగే మేషం,వృషభం ,మిథునం ఎలా ద్వాదశ రాశులు కూడా రాశుల వారిగా ఒక్కొక్క రాశి కొన్ని కొన్ని రోగాలను తెలియజేస్తుంది. జ్యోతిషాన్ని సరిగా అర్థం చేసుకొని ఈ భావం , రాశి ఇబ్బంది ఉందొ తెలుసుకోవడం దానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వార కొన్ని పరిష్కారాలు తెలుసుకొనే వాళ్ళం అవుతాం తద్వారా సమస్యల యొక్క తీవ్రత తగ్గించుకోవచ్చును.

మరిన్ని శీర్షికలు
Shoulder Pain | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)