Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

ప్రయోగాల‌కు వెనుకంజ వేయ‌ను  - నాగ‌చైత‌న్య‌

కాస్త కొత్త‌గా ట్రై చేస్తే పోయేదేముంది??  అనుకొంటోంది యువ‌త‌రం. క‌థానాయ‌కుల్లో యూత్ బ్యాచ్ కూడా ఇదే పాట పాడుతోంది. ఈమ‌ధ్య తెలుగులో థ్రిల్ల‌ర్స్‌, క్రైమ్ కామెడీ జోనర్లో సినిమాలు ఎక్క‌వ‌వుతున్నాయి. కాక‌పోతే అవ‌న్నీ చిన్న‌వాళ్ల‌వీ, కొత్త హీరోల‌వి. ఓ మాదిరి ఇమేజ్ ఉన్న క‌థానాయ‌కుడు అలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తే.. ఆ జోన‌ర్ రేంజు పెరుగుతుంది. నాగ‌చైత‌న్య అలాంటి ప్ర‌య‌త్న‌మే చేశారు. దోచేయ్‌తో. ఏ సెంట‌ర్ సినిమాగా ముద్ర‌ప‌డిన ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిరాశ ప‌రిచినా.. నాగ‌చైత‌న్య‌ని కి ఓ కొత్త జోన‌ర్‌ని ప‌రిచ‌యం చేసినట్టైంది. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య‌తో గో తెలుగు చేసిన చిట్ చాట్ ఇది.

* హా చై....
- హాయండీ..

* మీరు చై.. కాబ‌ట్టే టైటిల్ దోచేయ్ అని పెట్టారా?
- (న‌వ్వుతూ) అదేం కాదండీ క‌థ‌కి అదే యాప్ట్. క్రైమ్ కామెడీ సినిమాల‌కు అంత‌కంటే మంచి టైటిల్ ఏముంటుంది. పేరు పెట్టాక‌.. అందులోనూ చై ఉంద‌ని తెలిసిందంతే.

* రిజ‌ల్ట్ ప‌ట్ల హ్యాపీనేనా?
- అఫ్ కోర్స్‌.... ఫ‌స్ట్ డే డివైట్ టాక్ వ‌చ్చింది. సినిమా కాస్త స్లో అన్నారు. కానీ మెల్ల‌గా పిక‌ప్ అయ్యింది.

* స్లో అని మీరూ ఒప్పుకొంటారా?
- క్రైమ్ కామెడీ సినిమాలో ఇలాంటి డ్రాబ్యాక్‌లుంటాయి. కానీ చివ‌రి ముఫ్పై నిమిషాలూ సినిమా జెట్ వేగంతో వెళ్తుంది. దాంతో ఆడియ‌న్స్ సంతృప్తి చెందుతారు.

* ఇలాంటి కాన్సెప్ట్ క‌థ‌లు మెల్ల‌మెల్ల‌గా జ‌నంలోకి వెళ్తాయి. ప్రారంభ వ‌సుళ్లు రావు. ఈ ద‌శ‌లో ఇలాంటి సినిమా చేయ‌డం రిస్క్ కాదా?
- రిస్క్ లేక‌పోతే.. లైఫ్ లేద‌నుకొనే త‌త్వం నాది. రిస్క్ తీసుకొన్న‌ప్పుడే మ‌న‌లోని ప్ర‌తిభ నూటికి నూరుపాళ్లు బ‌య‌ట‌కు వ‌స్తుంది. ప్ర‌తిసారీ ఒకే క‌థ‌లో క‌నిపించ‌డం నాకూ బోర్‌. నాకు ప్రేమక‌థ‌లు సూట‌వుతాయి. అలాగ‌ని అస్త‌మానూ అవే క‌థ‌ల్లో క‌నిపించ‌లేను. ప్ర‌తి రెండో సినిమాకీ ఏదో ఓ తేడా చూపించాలి. లేదంటే... ఆడియ‌న్స్ ఒప్పుకోరు.

* అంటే... భవిష్య‌త్తులోనూ ప్ర‌యోగాలు చేస్తూనే ఉంటారా?
- త‌ప్పకుండా. ప్ర‌యోగాలు ఎప్ప‌టికీ వ‌ద‌ల‌ను. ఎందుకంటే మ‌న‌ల్ని మ‌నం కొత్త‌గా విష్క‌రించుకోవ‌డానికి ఇవే మార్గం చూపిస్తాయి. కొత్త క‌థ‌లు రావాలండీ. అంద‌రూ ఒకే మూస‌లో కొట్టుకుపోతే ప్ర‌యోజ‌నం ఏముంటుంది?  ఆడియ‌న్స్ కూడా కొత్త‌ద‌నం ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. మ‌న‌కు మ‌ల్టీప్లెక్స్ సంస్ర్కృతి పెరుగుతోంది. వాళ్ల‌నీ దృష్టిలో ఉంచుకొని క‌థ‌లు సిద్ధం చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

* ఏ సెంట‌ర్ వాళ్ల‌ని మాత్ర‌మే టార్గెట్ చేస్తే.. బీసీ ల ప‌రిస్థితేంటి?
- వాళ్ల‌కూ కావాల్సిన అంశాలు క‌థ‌లో ఉండేట్టు చూసుకోవాలి. నాకు తెలిసి క్లాస్‌, మాస్ సినిమాల‌కు ఓ సింపుల్ నిర్వ‌చ‌నం ఉంది. అంద‌రికీ న‌చ్చేదే మాస్ సినిమా. ఒక వ‌ర్గానికి ప‌రిమిత‌మైతే అదే క్లాస్‌.

* మాస్‌, యాక్ష‌న్ ఇమేజ్  కోరుకోవ‌డం లేదా?
- అది కోరుకొంటే వ‌చ్చేది కాదు. ఆటోన‌గ‌ర్ సూర్య‌, బెజ‌వాడ‌, త‌డాఖా మాస్ కోసం చేసిన సినిమాలే క‌దా?

* ఇన్నాళ్ల కెరీర్‌లో మీకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా ఏది?
- మ‌నం. తాత‌గారితో న‌టించా క‌దా. అది చాలా స్పెష‌ల్‌.

* మీ కుటుంబంలోనూ చాలామంది హీరోలున్నారు. వాళ్లు కాకుండా మీరు అభిమానించే హీరో ఎవ‌రు?
- ఒక‌రి పేరు చెప్ప‌డం క‌ష్టం. ఒకొక్క‌రిలో ఒక్కో క్వాలిటీ ఉంది. అంద‌రి సినిమాలూ చూస్తుంటా. అంద‌రూ న‌చ్చుతారు.

* ఏ క‌థానాయిక‌తో మ‌ళ్లీ మ‌ళ్లీ న‌టించాల‌నివుంది?
- స‌మంత‌

* కార‌ణం?
- త‌ను చాలామంచి ఫ్రెండ్‌. ఇద్ద‌రం దాదాపు ఒకేసారి ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాం. తొలి హిట్ ఒకే సినిమాతో వ‌చ్చింది. ఆ త‌ర‌వాత మ‌రో రెండు సినిమాల్లో క‌ల‌సి న‌టించాం. మా కెమిస్ట్రీ బాగుంటుంది.

* మీ తాత‌గారి సినిమా రీమేక్ చేయాల్సివ‌స్తే?
- ఆ పొర‌పాటు చేయ‌ను. ఎందుకంటే అవ‌న్నీ క్లాసిక్స్‌. తాత‌గారి కంటే నేను బాగా న‌టించ‌లేను.

* నాన్న‌గారి సినిమా?
- హ‌లో బ్ర‌ద‌ర్ అంటే చాలా ఇష్టం. కానీ.. నాన్న‌గారిలా కూడా నేను న‌టించ‌లేను.

* చందూ మొండేటి సినిమా ఎప్పుడు?
- క‌థ ఫైనలైజ్ అవ్వ‌లేదు. రెండు మూడు ఆప్ష‌న్స్ ఉన్నాయి. అందులో ఏది బెట‌రో చూసుకొని అప్పుడు డిసైడ్ చేస్తా.

* ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ

-కాత్యాయని
 

 

 

మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 14 - inte intinte inte intinte aalochiste antaa intinte - Balu