కామెడీ హీరో అల్లరి నరేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. చెన్నయ్‌కి చెందిన ఓ విరూప అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో అల్లరి నరేష్ నిశ్చితార్థం కూడా ఖాయమైపోయింది. మే 3వ తేదీన నిశ్చితార్ధం జరుగుతుంది. వివాహం కూడా అతి త్వరలోనే జరిపించడానికి పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. నిశ్చితార్ధం తర్వాత వివాహ తేదీ ఇరు కుటుంబాల నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. దివంగత సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ రెండో కుమారుడు అల్లరి నరేష్. పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ ‘హాయ్’ సినిమాతో హీరోగా తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఇటీవలే ఆర్యనర్ రాజేష్ వివాహం కూడా అయ్యింది. అన్నయ్య హీరోగా సక్సెస్ కాలేకపోయినా తమ్ముడు అల్లరి నరేష్ తెలుగు తెరపై కామెడీ హీరోగా, విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేశాడు. ఓ ఇంటివాడు అవుతున్న అల్లరి నరేష్‌కి శుభాకాంక్షలు అందజేద్దాం.
|