Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naresh marriage settiled

ఈ సంచికలో >> సినిమా >>

బాలయ్య యూనిక్‌ రికార్డ్‌

unique record of balaiah

‘లెజెండ్‌’ సినిమాతో బాలయ్య యూనిక్‌ రికార్డ్‌ సృష్టించాడు. కెరీర్‌లో కమర్షియల్‌గా బిగ్గెస్ట్‌ హిట్‌ని ‘లెజెండ్‌’తో కొట్టిన బాలకృష్ణ, మరో రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు థియేటర్లలో ఈ సినిమా 400 థియేటర్లలో ప్రదర్శన పూర్తిచేసుకుంది. కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా 400 రోజులపాటు రెండు థియేటర్లలో ప్రదర్శితమవడం కొత్త రికార్డ్‌. వంద రోజుల సినిమానే గగనమైపోతున్న ఈ రోజుల్లో ఓ సినిమా 400 రోజులు ఆడటం ‘లెజెండ్‌’కే చెల్లింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ద్వితపాత్రాభినయంతో అభిమానుల్ని అలరించారు. బాలకృష్ణ సరసన రాధికా ఆప్తే, సోనాల్‌ చౌహన్‌ హీరోయిన్లుగా నటించగా, జగపతిబాబు నెగెటివ్‌ రోల్‌లో కనిపించారు. వర్తమాన రాజకీయాల్ని స్పృశిస్తూనే మాస్‌, కమర్షియల్‌ అంశాల్ని జోడిస్తూ బోయపాటి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు.

మరిన్ని సినిమా కబుర్లు
our talent in bollywood