Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
unique record of balaiah

ఈ సంచికలో >> సినిమా >>

బాలీవుడ్‌లో మన టాలెంట్‌

our talent in bollywood

ఆరడుగుల అందగాడు. అందానికి తగ్గ హుందాతనం. అన్నిటికీ మించిన నటనా ప్రతిభ. కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు. ఇవన్నీ సుమన్‌ సొంతం. హీరోగా సినిమాలు చేసి, విలన్‌గా అలరించి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించిన సుమన్‌, బాలీవుడ్‌లోకి ‘గబ్బర్‌’ సినిమాతో అడుగు పెడుతున్నాడు. ‘శివాజీ’ సినిమాలో సుమన్‌ నటనను చూసి ముగ్ధుడైన మురుగదాస్‌, సుమన్‌ని అక్షయ్‌కుమార్‌ సరసన విలన్‌గా పెట్టాడు. తెలుగు సినీ రంగం విలన్లని బాలీవుడ్‌ నుంచి దించుకుంటోంటే, బాలీవుడ్‌కి మన తెలుగు నటుడు వెళ్ళడం మనమంతా గర్వించదగ్గదే. 37 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్‌లో తొలిసారి బాలీవుడ్‌లో అవకాశం నటించడం పట్ల సుమన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘గబ్బర్‌’లో తనది విలక్షణమైన పాత్ర అనీ, బాలీవుడ్‌ తనను ఆదరిస్తుందన్న నమ్మకం తనకు ఉందని సుమన్‌ చెప్పాడు. సుమన్‌ బాలీవుడ్‌లో కూడా రాణించాలని తెలుగు ప్రేక్షక లోకం కోరుకుంటోంది.

మరిన్ని సినిమా కబుర్లు
super rakul glamour