Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
super rakul glamour

ఈ సంచికలో >> సినిమా >>

మంచు వారి పెళ్ళి సందడి మొదలైంది

manchu family wedding bells

ఇంకా పెళ్ళికి ఇరవై రోజుల సమయం ఉన్నా అప్పుడే మంచువారింట పెళ్ళి సందడి మొదలైంది. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభలేఖతోనే మంచు కుటుంబం తమ ప్రత్యేకతను చాటుకుంది. సినీ, రాజకీయ వర్గాల్లో ఈ వివాహ ఆహ్వాన పత్రిక తన గురించి అందరూ చర్చించుకునేలా చేసింది. ప్రధానమంత్రం నరేంద్ర మోడీ కూడా శుభ లేఖ చూసి, చాలా ఇన్నోవేటివ్‌గా చేయించారని మంచు కుటుంబాన్ని అభినందించారట. శుభలేఖను చూసినవారందరి నోటా ఇదే మాట వస్తుంది. తెలుగు సినీ రంగంలో మంచు కుటుంబానికి ఉన్న ప్రత్యేకత దృష్టి మంచువారింట పెళ్ళి కూడా అంతే ప్రత్యేకంగా జరగనుంది. వివాహ నిశ్చితార్ధ కార్యక్రమాన్నే పెళ్ళి తంతులా ఘనంగా నిర్వహించిన మంచు కుటుంబం, అంగ రంగ వైభవంగా వివాహ వేడుకను జరప తలపెట్టింది. సినీ, రాజకీయ రంగాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు ఈ కళ్యాణ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddaam