Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిషం విజ్ఞానం - శ్రీకాంత్


వ్యాపారం యొక్క విషయాలను జ్యోతిషం తెలియజేస్తుందా ?

ఒక దేశం యొక్క అభ్యున్నతి ఆ దేశం యొక్క అర్తిక్,వ్యాపారప్రగతి పైన ఆధారపడు ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనదేశం ప్రపంచలోనే మనకంటూ ఒక వ్యాపరబిందువుగా నాటి నుండి నేటి వరకు మెలుగుతూనే ఉంది. మనదేశాన్ని వాస్కోడిగామా కనిపెట్టాడు అని చదువుతుంటాం కాని వాస్కోడిగామా ఒక చిన్న పడవలో వస్తు ఉంటె దారిలో ఆయొక్క మరపడవ చెడిపోతే తనకు తనవ్యాపారాన్ని పూర్తిచేసుకొని తిరిగి దేశానికి వస్తున్నా ఒక గుజరాతి వ్యాపారి తన పెద్దదైన ఓడకు వాస్కోడిగాగామ యొక్క మర పడవను కలిపి తీసుకొని వచ్చాడు కాని మనం ముందు ఉన్న ఓడని వదిలేసి వెనుక ఉన్న మరపడవను గుర్తింపు తెచ్చుకున్నాం. ప్రాచీనకాలం నుండి కూడా వ్యాపరజ్యోతిషం మనదేశంలో ఒక అంతర్భాగంగా ఉంటూ ఉంది. ప్రతిపని ఆర్థికపరమైన విషయాలతో ముడిపడి పోతున్న రోజులలో జ్యోతిషాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే నిజమైన ప్రయోజనాన్ని పొందుటకు అవకాశం ఉంది.

ఒక వ్యక్తికి వ్యాపారం కలిసి వస్తుందా? తను చేస్తున్న ఆలోచన సరైనదా అతనికి యోగిస్తుందా ? ఇలాంటి ఎన్నో విషయాలను మనం జ్యోతిషం ద్వార తెలుసుకోవచ్చును. ఆర్థికజ్యోతిషాన్ని కనుక మనం సరిగా అర్థం చేసుకుంటే ఎన్నో సంస్థలు అలాగే వ్యక్తుల యొక్క భవిష్యత్తును అలాగే స్టాక్మార్కెట్,వస్తువుల ధరలను మనం ముందుగానే ఊహించుటకు అవకాశం ఉంది. వ్యాపరం ఎప్పుడు గిరాకి అలాగే సరఫరా మీద ఆధారపడి ఉంటుంది. ఎలానటి మూహుర్తంలో అలాగే ఏ గ్రహాల యొక్కఅంశాలు ఏవిధంగా పనిచేస్తాయో తెలుసుకొనే అవకాశంను జ్యోతిషం కలిపిస్తుంది.

రాశులు మరియు గ్రహాలు వ్యాపార వస్తుకారకత్వాలను తెలియజేస్తుందా ? 
 
మేషం ఇనుము,గోధుమలు,మిరియాలు, రైళ్ళు, ట్రాక్టర్లు, బంజరుభూములను సారవంతం చేయుట మున్నగునవి మేషం తెలియజేస్తుంది. అదేవిధంగా మేషరాశి యొక్క అధిపతి కుజుడు యొక్క కారకత్వాలను తెలుసుకుంటే ఇనుము, యంత్రసామాగ్రి,యుద్దసామగ్రి, బంగారం మొదలైన విషయాలను తెలియజేస్తుంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఒక వ్యక్తి లేదా సంస్థయొక్క జాతకం పరిశీలన చేయుట ద్వార ఏ జాతకంలో మేషం లేదా కుజుడు బలంగా ఉన్నచో వారికి అలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయని చెప్పవచ్చును ఎవరి జాతకంలో బలంగా లేకపోతే వారికి అవి కలిసి రావు అనిచెప్పవచ్చును.

చంద్రుడు  అన్ని గ్రహాల్లో త్వరితంగా సంచరించే గ్రహం. ఒక రాశిలో చంద్రుడు 2-1/4 రోజులు మాత్రమె ఉంటాడు. రవి ఒక నెల అధికంగా శని 2-1/2 సంవత్సరాలు గురుడు 1 సంవత్సరకాలం సంచరిస్తాడు. చంద్రుడు త్వరత్వరగా సంచరిస్తూ ఇతర గ్రహాలతో కలిసి సంచరిస్తూ వాటితో వివిధరకాలైన సంయోగాలు అలగే దృష్టులను ఎరపరుచుకోవ్డం ద్వార వ్యాపారపరామైన విషయాల్లో భిన్నమైన మార్పులకు దోహదం చేస్తున్నాడు. దీనిని పరిశీలించే అవకాశం మనకు జ్యోతిషం కలుగజేస్తుంది. వ్యాపారానికి కొన్ని కొన్ని గ్రాహాలు చల్ బలమైన మార్పులను కలగజేస్తాయి. వాటిని పరిగణలోకి తీసుకొని ముందుకు వెళితే ఉనతమైన ఫలితాలు పొందటమే కాకుండా దేశ అభివృద్దిలో భాగస్వాములం కావొచ్చు.
మరిన్ని శీర్షికలు
weekly horoscope 8st may  to 14th may