Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotishyam vignanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం 08-05-2015 నుండి 14-05-2015 వరకు - శ్రీకాంత్

మేష రాశి :  ఈ వారం మొత్తంమీద ఆలోచనలకు స్వస్తి చెప్పండి ఆచరణకు ప్రముక్యతను ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. మీయొక్క మాటతీరు మూలాన ముఖ్యంగా కుటుంబసభ్యుల కొంతమేర భాధకు లోనయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట వలన మీకుటుంబంలో నూతన సమస్యలు తగ్గుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళుట మొలన లబ్దిని పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ధనమును అప్పుగా ఇవ్వకపోవడం అనేది సూచన అలాగే అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మేలు. ప్రయాణాలు అలాగే వాహనముల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. బంధువుల నుండి నూతన సమాచరం సేకరిస్తారు.        

వృషభ రాశి :  ఈ వారం మొత్తంమీద భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద చూపుట అలాగే ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు కలుగుతాయి సర్దుబాటు విధానం అవసరం,నలుగురిలో పనిచేసే విషయంలో అందరికి అనుకూలంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు ఉన్నప్పటికిని ఆదాయం బాగానే ఉంటుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. చర్చాసంభందమైన విషయాల్లో పాల్గొనేటప్పుడు నిదానంగా వ్యవహరించుట అలాగే ఎదుటివారి ఆలోచనలకు గౌరవం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. స్త్రీ / పురుష  సంభందమైన విషయాల్లో నూతన మార్పులకు ఆస్కారం కలదు. మిత్రులను కలిసే అవకాశం ఉన్నది.           

మిథున రాశి : ఈ వారం మొత్తంమీద నూతన ఆలోచనలు కలిగి ఉంటారు ఆలాగే సామాజిక పరమైన విషయాల్లో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు తలపెటిన పనులు సాధారణ ఫలితాలను కలుగజేస్తాయి. కుటుంబంలో సభ్యులకు మీయొక్క వ్యవహారశైలి నచ్చకపోవచ్చును ఈ విషయంలో స్వల్ప మనస్పర్థలు ఏర్పడుటకు ఆస్కారం కలదు. చర్చాసంభందమైన విషయాల్లో పాల్గొనవలసి వస్తే మౌనంగా ఉండుట అవతలివారి విధానాలు గౌరవించుట వలన మేలుజరుగుతుంది. అధికారులతో కలిసి చేపట్టిన పనులలో శ్రమను అలాగే పనిభారం పొందుతారు. మీయొక్క కష్టపడే విధానాన్ని అధికారులు గుర్తించే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కోసం ధనం వెచ్చించే ఆస్కారం కలదు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించుట మేలు.         

కర్కాటక రాశి :  ఈ వారం మొత్తంమీద మీరు తలపెట్టిన పనుల మూలాన నలుగురిలో ఆశించిన విధంగా గుర్తింపును పొందుతారు. స్వల్పదూరప్రయాణాలు కలిసి వస్తాయి వాటికి సమయాన్ని ఇస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు కాకపోతే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. అధికారులతో మాత్రం చిన్న చిన్న విభేదాలు ఎర్పడుటకు అవకాశం ఉంది. ఈవిషయంలో కాస్త నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశ ప్రయాణాలు చేసేసమయంలో లేక చేయవలసి వచ్చినపుడు విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండుట సూచన. విద్యార్థులకు బాగుంటుంది కాకపోతే పెద్దల అనుభవాలు పరిగణలోకి తీసుకోండి. వాహనముల మూలాన అనుకోని ఇబ్బందులు ఏర్పడుటకు ఆస్కారం కలదు.           

సింహ రాశి : ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో మీయొక్క ఆలోచనలు నూతన మార్పులకు అవకాశంను కలుగజేస్తాయి కాకపోతే ప్రాక్టికాలిటికి దగ్గరగా ఆలోచించుట మంచిది. శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీయొక్క మాటతీరు మూలాన లాభం లేదా నష్టం ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త. కొన్ని కొన్ని విషయాల్లో మొండి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించే ప్రయత్నం చేయుట మేలు. సంతానం మూలాన ఊహించని ఖర్చులకు ఆస్కారం కలదు. పెట్టుబడుల విషయంలో కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కాకపోతే ఫలితాలు నిదానంగా వస్తాయి. నలుగుర్లో గుర్తింపు కోసం చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇచ్చే అవకాశం కలదు.           

 


కన్యా రాశి :  ఈ వారం మొత్తంమీద మానసికంగా దృడంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. గతంలో మీరుతీసుకున్న నిర్ణయాల విషయంలో పున్ః సమీక్ష అవసరం. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. వ్యతిరేకవర్గం నుండి సమస్యలు ఏర్పడుతాయి వాటిని తెలివితో ఎదుర్కొనే అవకాశం ఉంది. నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు బాగా ఆలోచించుట మేలు. విదేశీప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది కావున ప్రయత్నం చేయుట మేలు. చిననాటి మిత్రులను కలుస్తారు వారితో కలిసి సమయాన్ని గడుపుతారు. కుటుంబసభ్యులతో కలిసి పూజసంభందమైన విషయాల్లో పాల్గొనే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుతాయి జాగ్రత్త అవసరం ముఖ్యంగా కడుపు అలాగే తల సంభంద ఇబ్బందులు ఎదుర్కొంటారు.            

తులా రాశి : ఈ వారం మొత్తంమీద ఇష్టమైన పనులను చేపట్టుటకు ఇష్టపడుతారు అలాగే నచిన వారినుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మేలు. దగ్గర ప్రదేశాలకు ప్రయాణం చేయుటకు అవకాశం ఉంది సమయాన్ని వృధాకాకుండా చూసుకొనే ప్రయత్నం మంచిది. మీయొక్క మాటతీరు మూలాన ఆప్తులను కోల్పోయే అవకాశం కలదు కావున సర్దుబాటు విధానం మూలాన మేలుజరుగుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తడబాటు ఉంటుంది కావున అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన వారినుండి సహకారం లభిస్తుంది సమయపాలన అవసరం.     

 .వృశ్చిక రాశి  :  ఈ వారం మొత్తంమీద మీయొక్క ఆలోచనలు వివిధరూపాలుగా ఉండే అవకాశం ఉంది స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట అనేది సూచన. ప్రయాణాలు పెద్దగా కలిసి రాకపోవచును కావున సాధ్యమైనంత వరకు వాటిని వాయిదా వేయుట అనేది సూచన. ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేపట్టుటకు అవకాశం ఉంది వాటిమూలన నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. స్త్రీ / పురుష పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన మీ అనుకున్న వారితో మాటపట్టింపులకు పోకండి. వ్యాపారపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం కలిగి ఉండే ఆస్కారం కలదు. కాస్త ఆరోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బందిపెడుతాయి.  

ధనస్సు రాశి  : ఈ వారం మొత్తంమీద చిననాటి మిత్రులను కలసే అవకాశం ఉంది వారినుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనల్లో ఒకింత ఆందోలన్ ఉండుటకు అవకాశం ఉంది కావున మానసికంగా దృడంగా ఉండుట సూచన. దైవసంభందమైన విషయాల్లో పాల్గొనే ప్రయత్నం చేయుట మంచిది. బంధువుల నుండి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు వారితో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. గతంలో మీరు మధ్యలో వదిలేసిన పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు పెట్టుటకు కాస్త వేచిఉండుట మేలు తొందరపాటు ప్రయత్నాలు చేయకండి నూతన సమస్యలు ఏర్పడుతాయి. మిత్రులతో చర్చలు చేయకండి.      

మకర రాశి :  ఈ వారం మొత్తంమీద అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వలన కొత్త కొత్త సమస్యలను కొనితెచ్చుకున్నవారు అవుతారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది కాకపోతే సమయపాలన పాటించుట అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. రాజకీయపరమైన రంగాల్లో ఉన్నవారు కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట మేలు. బంధువర్గం నుండి వచ్చు సూచనలు పెడచెవిన పెట్టకండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆర్థికపరమైన విషయాల్లో ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది. దూరప్రదేశం నుండి గత కొంతకాలంగా వేచిచూస్తున్న ఫలితాలు రావడం అనేది ఊరట. జీవితభాగస్వామితో కలిసి చర్చలు చేయకండి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. సోదరసంభందమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు.    

కుంభ రాశి : ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో కొత్త కొత్త ప్రయత్నాలు మొదలుపెడతారు. బందువర్గంతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చర్చలలో పాల్గొంటారు వారినుండి ఆశించిన సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిమూలన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. కుటంబసభ్యులతో కలిసి చర్చాసంభందమైన విషయాల్లో పాల్గొనకపోవడం మంచిది. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చిననాటి మిత్రులను కలుస్తారు. అధికారుల నుండి వచ్చు సూచనల విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది.              

మీన రాశి : ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేయునపుడు నిదానంగా వ్యవహరించుట సూచన. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇస్తారు. కుటుంబంలో సభ్యుల నుండి పూర్తిసహకరం లభిస్తుంది దానిమూలాన కొంత ఊరట చెందుతారు. మానసికంగా ఒత్తిడిని కలిగి ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయం తీఎసుకొక్పొవ్దమ్ అన్నివిధాల మేలు. నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది వాటిలో ఆశించిన ఫలితాలు కొంత మేర వచ్చే అవకాశం ఉంది. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు,శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు.                      

 

టి. శ్రీకాంత్ 

వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
cartoonistulato interview