Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఈ బాడీగార్డ్‌ బ్యాడ్‌ బాయ్‌

The Bodyguard Bad Boy

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ‘బ్యాడ్‌ బాయ్‌’ అని న్యాయస్థానం డిక్లేర్‌ చేసింది. న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించడంతో సల్మాన్‌ఖాన్‌ఖాన్‌ సినిమా కెరీర్‌ అయోమయంలో పడిరది. సల్మాన్‌ఖాన్‌ కన్నా పెద్ద టెన్షన్‌ ఇప్పుడు నిర్మాతలదే. ఆయనతో సినిమాచేయ తలపెట్టిన నిర్మాతలు సల్మాన్‌ఖాన్‌ ఈ కేసు నుంచి బయటపడాలనీ, లేదంటే బెయిల్‌ లభించాలని కోరుకుంటున్నారు. సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు సల్మాన్‌ఖాన్‌ మీద నిర్మాతలు పెట్టుబడి పెడుతున్నారట. ఇవన్నీ సల్మాన్‌ఖాన్‌తో చేయనున్న సినిమాలకు అయ్యే ఖర్చు. సల్మాన్‌ఖాన్‌ జైలుకు వెళితే నిర్మాతల బతుకు బస్టాండ్‌ అయిపోతోంది. తన వద్ద బాడీగార్డ్‌గా పనిచేసే వ్యక్తే కేసు పెట్టడంతో, సల్మాన్‌ఖాన్‌ ఈ కేసు నుంచి తప్పించుకోడానికి వీల్లేకపోతోంది. సల్మాన్‌ఖాన్‌ దృష్టిలో ఆ బాడీగార్డ్‌ బ్యాడ్‌ బాయ్‌ అయితే, సినీ ప్రేక్షకుల దృష్టిలో ‘బాడీగార్డ్‌’ సినిమా హీరో సల్మాన్‌ఖాన్‌ విలన్‌ అయ్యాడు. ఎంత స్టార్‌డమ్‌ సంపాదించుకున్నా ఎప్పుడూ సల్మాన్‌ఖాన్‌ మీద బ్యాడ్‌బాయ్‌ అనే ముద్రే ఉంది. అతనితో పనిచేసిన హీరోయిన్లు, అతనితో ఎఫైర్‌ పెట్టుకున్న హీరోయిన్లే సల్మాన్‌ఖాన్‌ని బ్యాడ్‌ బాయ్‌ అంటుంటారు.

మరిన్ని సినిమా కబుర్లు
Allu Arjun hit a century