Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
The Bodyguard Bad Boy

ఈ సంచికలో >> సినిమా >>

సెంచరీ కొట్టేసిన అల్లు అర్జున్‌

Allu Arjun hit a century

వరుసగా రెండు సినిమాలతో సెంచరీ కొట్టిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ‘రేసుగుర్రం’ సినిమా 50 కోట్ల పైన వసూలు చేయగా, అతని తాజా చిత్రం ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ కూడా 50 కోట్లకు పైగా వసూలు చేసి, అల్లు అర్జున్‌కి బ్యాక్‌ టు బ్యాక్‌ 50 ప్లస్‌ క్రోర్స్‌ హిట్‌ని ఇచ్చినట్లయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే క్రమంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని కాదనుకుని, మెసేజ్‌ ఇవ్వాలనే ఆలోచనతో ఆ టైప్‌ స్టోరీని ఎంచుకోవడం హీరోగా అల్లు అర్జున్‌ గొప్పతనమైతే, అల్లు అర్జున్‌ లాంటి ఎంటర్‌టైనింగ్‌ హీరో తెరపై ఎనర్జీ చూపకుండా, స్టడీగా పెర్ఫామెన్స్‌ ఇచ్చేలా చేయడం దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కే చెల్లింది. ఏ హీరోకి అయినా వరుసగా రెండు సినిమాలు హిట్‌ టాక్‌ సొంతం చేసుకోవడం, ఆ రెండు సినిమాలూ 50 కోట్ల పైన వసూలు చేయడం అంటే చాలా గొప్ప విషయమే. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఆ ఫీట్‌ సాధించాడు. కంగ్రాట్స్‌ బన్నీ. త్రివిక్రమ్‌ మ్యాజిక్‌, బన్నీ స్టామినా, దేవిశ్రీ మ్యూజిక్‌ ఇవన్నీ ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ని సక్సెస్‌ఫుల్‌ మూవీగా నిలబెట్టాయి.

మరిన్ని సినిమా కబుర్లు
trisha was breakup