Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
trisha was breakup

ఈ సంచికలో >> సినిమా >>

వారెవ్వా దీపిక

deepika was awsome

మోడలింగ్‌ రంగం నుంచి వెండితెరపైకొచ్చి సినిమా తారగా , స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన అందాల భామ దీపికా పడుకొనే, కేవలం అందంతోనే సినిమాల్లో రాణించెయ్యాలనుకోలేదు. చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండాలనుకోవడమే దీపికా పడుకొనేని హీరోయిన్‌గా ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’ సినిమా కోసం తమిళం నేర్చుకుని, ఆ నేర్చుకున్న తమిళంలోకి, తనకు తెలిసిన హిందీని మిక్స్‌ చేసి, డిఫరెంట్‌ యాక్సెంట్‌ని తయారుచేసుకుని, ఆ సినిమాలో దుమ్మురేపింది. తన కొత్త సినిమా ‘పికు’ కోసం అలాంటి రిస్కే చేసింది దీపిక. ఈసారి హిందీనీ, బెంగాలీని మిక్స్‌ చేసి, ‘పికు’తో వారెవ్వా దీపిక అనిపించుకుంది. ‘పికు’ సినిమాలో దీపిక నటనకు హేట్సాఫ్‌ అననివారుండరట. ఈ క్రెడిట్‌ దర్శకుడిదేనని దీపిక ఎంతో హుందాగా చెబుతోంది. తన పాత్రకు న్యాయం చేయడమొక్కటే తన పని అనీ, దాన్ని డిజైన్‌ చేసేది దర్శకుడేనని అంటుంది దీపిక. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటుంది కాబట్టే దీపిక హీరోయిన్‌గా విజయాల మీద విజయాల్ని చవిచూస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
shivaji was  feel alone