Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
deepika was awsome

ఈ సంచికలో >> సినిమా >>

శివాజీ ఒంటరివాడైపోయాడు

shivaji was  feel alone

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం సినీ నటుడు శివాజీ ఒంటరిపోరాటం చేశాడు. పోరాటం అన్నాక గెలుపోటములు సహజం. అయితే ఆ పోరాటంలో ఇతరులూ కలిసొస్తే గెలుపు సాధ్యమవుతుంది. బిజెపి నేగా అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమవడంతో వేరే దారి లేక నిరాహార దీక్షను ఎంచుకున్నాడు శివాజీ. ఒకనాటి తెలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు పార్లమెంటులో విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని కోరింది బీజేపీనే. కానీ ఆ బీజేపీనే ప్రత్యేక హోదాను విస్మరించడం శివాజీలో ఆవేదన రగిల్చింది. ‘అన్నయ్యా మీరూ రండి. మీ వెనక మేమంతా నడుస్తాం’ అని పవన్‌కళ్యాణ్‌ని ఉద్దేశించి కూడా కోరాడు శివాజీ. సినీ రంగంలో ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే. వారెవరూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడానికి కారణం ఉంది. ఒక రాష్ట్రంలోని సెంటిమెంట్లకు అనుకూలంగా మాట్లాడితే ఇంకో రాష్ట్రంలో ఇబ్బందులు పడవలసి వస్తుందని. అందుకే ఈ వివాదంలో శివాజీ ఒంటరిగానే మిగిలిపోయినా, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddaam