Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష - దాగుడు మూత దండాకోర్‌

movie review

చిత్రం: దాగుడు మూత దండాకోర్‌
తారాగణం: రాజేంద్రప్రసాద్‌, సారా అర్జున్‌, సిద్దు, నిత్యా శెట్టి, రవిప్రకాష్‌ తదితరులు
చాయాగ్రహణం: విఎస్‌ జ్ఞానశేఖర్‌
సంగీతం: ఇఎస్‌ మూర్తి
నిర్మాణం: ఉషా కిరణ్‌ మూవీస్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
దర్శకత్వం: ఆర్‌.కె. మలినేని
నిర్మాతలు: రామోజీరావు, క్రిష్‌
విడుదల తేదీ: 8 మే 2015

క్లుప్తంగా చెప్పాలంటే
రాజుగారు (రాజేంద్రప్రసాద్‌) ఉన్నతాశయాలుగల వ్యక్తి. ఓ గ్రామ పెద్ద. ఆయనకు మనవరాలంటే విపరీతమైన ఇష్టం. ఆ మనవరాలు (సారా అర్జున్‌)కి వారు పెంచుకునే కోడి (నాని) అంటే ఇంకా ఇంకా ఇష్టం. చాలాకాలం తర్వాత రాజుగారి కొడుకులు, ఇతర కుటుంబ సభ్యులు సెలవుల్ని ఆ గ్రామంలో ఎంజాయ్‌ చేయడానికి వస్తారు. ఓ సందర్బంలో నానిని ఆ ఊరి గ్రామ దేవతకు బలివ్వాలనే విషయం ఆ కుటుంబ సభ్యులకు గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది మిగతా కథ. అది తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే
నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ మరోమారు అద్భుతమైన పాత్రలో జీవించారు. కొన్ని సన్నివేశాల్లో కళ్ళతోనే ఆయన పలికించిన భావాలు నభూతో నభవిష్యతి అనేలా ఉన్నాయి. ఇలాంటి పాత్రల్లో రాజేంద్రప్రసాద్‌ని తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేం అన్నంతలా ఆయన తన ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. వయుసుకు మించిన బరువైన పాత్రలో నటించి మెప్పించింది సారా అర్జున్‌. క్యూట్‌గా, అందంగా, అద్భుతంగా ఆమె తెరపై జీవించిందనడం సబబు నటించింది అనడం కన్నా సిద్ధూ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తే, నిత్య సహజంగా కనిపించింది. రవిప్రకాష్‌ ఓకే. మిగతా పాత్రధారులంతా తెరపై తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. పాటలు సిట్యుయేషనల్‌గా ఉండి మంచి ఫీల్‌తో సాగాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ క్రిస్ప్‌గా ఉన్నా కొన్ని సీన్స్‌లో ల్యాగింగ్‌ అనిపిస్తుందిగానీ ఓవరాల్‌గా డీసెంట్‌గానే ఉంది. కాస్ట్యూమ్స్‌ సినిమా బ్యాక్‌డ్రాప్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. డైలాగ్స్‌ సెన్సిబుల్‌గా అర్థవంతంగా ఉన్నాయి. స్క్రీన్‌ప్లే చాలా బాగుంది.

తమిళ సినిమా ‘శివం’కి రీమేక్‌ అయినా, తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి డైరెక్టర్‌ చాలా కేర్‌ఫుల్‌గా సినిమాని తీశాడు. నేటివిటీని దృష్టిలో పెట్టుకోవడం, తెలుగు ప్రేక్షకులకు రీమేక్‌ పీల్‌ రాకుండా చేయడం దర్శకుడి క్రెడిట్స్‌. తొలి సినిమానే అయినా అనుభవజ్ఞుడిలా  హ్యాండిల్‌ చేశాడు దర్శకుడు. హ్యూమర్‌, ఎమోషన్స్‌ ఎక్కడా ఎక్కువ కాకుండా, ఎక్కడా తక్కువ కాకుండా సమపాళ్ళలో మిక్స్‌ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అనుభవజ్ఞుడైన సీనియర్‌ నటుడు, ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే చిన్నారిని ఈ సినిమాకి ఎంచుకున్న దర్శకుడు, వారినుంచి పూర్తిస్థాయిలో తాను ఆశించిన నటనను రాబట్టుకోగలగడం అభినందనీయం. ఇంకాస్త హ్యూమర్‌ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుందిగానీ, ఆ హ్యూమర్‌ డోస్‌ బాగా పెంచేసి, ఎమోషనల్‌ వాల్యూస్‌ని తగ్గించేయకపోవడమూ మంచిదే. మసాలా సినిమాల్ని ఇష్టపడేవారికి రుచించకపోవచ్చుగానీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే సినిమా ఇది. ఫీల్‌గుడ్‌ సినిమా అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే
మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, చూడాల్సిన సినిమా

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview