Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
be ready for bahubali trailar

ఈ సంచికలో >> సినిమా >>

మెగాస్టార్‌ మెగాస్టారే

megastar is  megastar

ఎంతైనా మెగాస్టార్‌ మెగాస్టారే. రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాలకు దూరమైనా, వయసు మీద పడ్తున్నా అవేవీ ఆయన సినిమా కెరీర్‌పై ప్రభావం చూపులా లేవు. సినిమాలకి బ్రేక్‌ ఇచ్చే ముందు చిరంజీవికి ట్రేడ్‌ వర్గాల్లో ఎలాంటి ఫాలోయింగ్‌ ఉందో, ఇప్పుడు కూడా అదే ఫాలోయింగ్‌ ఉందట. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటించనున్న సినిమా కోసం అన్ని ఏరియాలనుంచీ బిజినెస్‌ ఎంక్వయిరీలు చాలా స్పీడ్‌గా ఉన్నాయని సమాచారం. రామ్‌చరణ్‌ నిర్మించే ఈ సినిమాని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నాడంటున్నారు. స్టోరీ ఏంటి? హీరోయిన్‌ ఎవరు? సినిమాలో మెగాస్టార్‌ గెటప్‌ ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకనప్పటికీ, సినిమా పట్ల ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తి పీక్స్‌లో ఉందంటే, మెగాస్టార్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గలేదనే అర్థం. ‘అన్నయ్యా’ అని చిరంజీవిని ప్రేమగా పిలుచుకునే పూరి జగన్నాథ్‌, చిరంజీవి రీ`ఎంట్రీ కోసం ఎంతటి అద్భుతమైన కథ రెడీ చేశాడో చూడాలి.

మరిన్ని సినిమా కబుర్లు
kruti sanan don't like that