Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sunny leone dedicated for items

ఈ సంచికలో >> సినిమా >>

సురేందర్‌ డైరెక్షన్‌లో చరణ్‌

charan in serender direction

శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మై నేమ్‌ ఈజ్‌ రాజు’ సినిమా చేస్తున్నాడు హీరో రామ్‌చరణ్‌. ఈ సినిమాకి ‘బ్రూస్‌ లీ’ అనే మరో టైటిల్‌ని కూడా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా రామ్‌చరణ్‌, సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. ‘రేసుగుర్రం’ టైమ్‌లోనే సురేందర్‌తో సినిమా గురించి చర్చలు జరిపిన రామ్‌చరణ్‌, దాన్ని ఇటీవలే ఫైనల్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది. రవితేజతో ‘కిక్‌`2’ తీస్తున్న సురేందర్‌రెడ్డి, ఆ సినిమా అయిపోగానే, రామ్‌చరణ్‌ సినిమా మీద దృష్టిపెడతాడట. రామ్‌చరణ్‌ కూడా, శ్రీనువైట్ల సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ‘అతనొక్కడే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సురేందర్‌రెడ్డి, ఎంటర్‌టైనింగ్‌ యాక్షన్‌ మూవీస్‌ని తీయడంలో దిట్ట. టెక్నికల్‌గానూ అతని సినిమాలు చాలా రిచ్‌గా ఉంటాయి. హీరోయిజంని ఎలివేట్‌ చేయడంలోనూ సురేందర్‌ తనకు తానే సాటి. అలాంటి సురేందర్‌రెడ్డి, రామ్‌చరణ్‌ని అత్యద్భుతంగా చూపించనున్నాడని ఆశించడం అత్యాశ కాబోదు.

మరిన్ని సినిమా కబుర్లు
Chaitanya Bharathi Life Time Achievement Award for SP Bala Subrahmanyam